సూసైడ్ స్పాట్‌కు వెళ్లిన సోనాక్షి | Image for the news result Sonakshi Sinha visits Golden Gate Bridge in San Francisco | Sakshi
Sakshi News home page

సూసైడ్ స్పాట్‌కు వెళ్లిన సోనాక్షి

Published Mon, Aug 31 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

సూసైడ్ స్పాట్‌కు వెళ్లిన సోనాక్షి

సూసైడ్ స్పాట్‌కు వెళ్లిన సోనాక్షి

అయ్యో పాపం... సోనాక్షీ సిన్హాకు ఏమైంది...? ఆమె ఎందుకు సూసైడ్ పాయింట్‌కు వె ళ్లింది? చక్కగా సినిమాలు చేసుకుంటోంది కదా! ఏమంత కష్టమొచ్చింది? అని ఈ హెడ్ లైన్ చదివినవాళ్లు అనుకోకుండా ఉండలేరు. సోనాక్షీ సూసైడ్ పాయింట్‌కి వెళ్లిన మాట నిజమే కానీ.. ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం వెళ్లలేదు. సరదాగా వెళ్లారన్నమాట.
 
 ఇంతకీ ఆ పాయింట్ ఎక్కడ ఉందో తెలుసా? విదేశాల్లో. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వంతెన ల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ ఒకటి. బంగారంలాంటి జీవితాన్ని కాదనుకుని, చాలామంది ఈ గేట్ ద్వారా పరలోక ప్రయాణం చేసేస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడే ప్రాంతంగా ఇది రెండో స్థానంలో ఉంది. దీని మీద నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిలో కేవలం రెండు శాతం మాత్రమే బతికారంటే ఎంత ప్రమాదమో ఊహించుకోవచ్చు.
 
 ఈ నగరానికి వచ్చిన వాళ్లు ఈ గోల్డెన్ గేట్‌ని చూడకుండా మాత్రం వెళ్లరు. ఏదో పనిమీద శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన సోనాక్షి కూడా ఈ బ్రిడ్జ్‌ను సందర్శించారు. దీని గొప్పతనం గురించి తెలుసు కానీ, సూసైడ్ హిస్టరీ గురించి మాత్రం ఆమెకు తెలియదట. ఈ బ్రిడ్జ్ నుంచి కిందకు చూడటానికే సోనాక్షీకి  గుండె ఆగినంత పనయిందట. సూసైడ్ హిస్టరీ విని ఆమెకు మరింత భయం వేసిందట. పక్కనున్న వాళ్లు ఓసారి దూకుతారా? అని సరదాగా అడిగితే ‘‘చచ్చినా ఆ పని చేయను’’ అని బదులిచ్చారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement