
ఇక జంతువులతో నో సర్కస్.!
ఇక నుంచి ప్రజల ఆహ్లాదం కోసం జంతువులను విసిగించడానికి వీల్లేదని, ఆటవీ జంతువులతో సర్కస్వంటివాటితోపాటు సినిమాల్లో నటింపజేసేందుకు కూడా అనుమతించకూడదని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్ణయించారు.
శాన్ ఫ్రాన్సిస్కో: ఇక నుంచి ప్రజల ఆహ్లాదం కోసం జంతువులను విసిగించడానికి వీల్లేదని, ఆటవీ జంతువులతో సర్కస్వంటివాటితోపాటు సినిమాల్లో నటింపజేసేందుకు కూడా అనుమతించకూడదని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్ణయించారు. సర్కస్తోపాటు.. కొన్ని ప్రదేశాల్లో జంతువులతో ప్రదర్శన ఇప్పించడం అమెరికాలోని పలు నగరాల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణ కోసం ఏర్పాటైన శాన్ఫ్రాన్సిస్కోలని ఓ బోర్డు తాజా తీర్మానం చేసింది.
అందుకు అక్కడి అనేక మున్సిపల్ సంస్థలు కూడా మద్దతిచ్చాయి. దీంతో మరో వారం రోజుల్లో చివరిసారి ఓటింగ్ నిర్వహించి పూర్తి స్థాయిలో అటవీ జంతువుల ప్రదర్శనపై నిషేధం అమలుచేయనున్నారు. నియమ నిబంధనలు అమల్లోకి వస్తే అటవీ జంతువులతో సర్కస్ చేయిండచంగానీ, వాటిని జైలు లాంటివాటిని ఏర్పాటుచేసి వాటిల్లో పెట్టడంగానీ కుదరదు. వాటిని స్వేచ్ఛకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకూడదు. అయితే, ఈ పరిమితులు కేవలం అటవీ జంతువులకు మాత్రమే వర్తిస్థాయి. పెంపుడు జంతువులకు వర్తించబోవని స్పష్టం చేశారు.