![San Francisco Bay Red Rock Island Market for 25 Million Dollars - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/28/red-rock-island.jpg.webp?itok=Ge6BlhyW)
సాధారణంగా వ్యవసాయ భూములు, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్‌మెంట్స్, విల్లా వంటివి వాటిని అమ్మడం లేదా కొనటం అనేది జరగటం సర్వసాధారణం. అయితే చాలా అరుదుగా ఐలాండ్ (ద్వీపాలు) అమ్మకానికి వస్తాయి. బాగా డబ్బున్న వారు, ఏకాంతంగా.. ప్రశాంతంగా బతకాలనుకునే వారు మాత్రమే ఇలాంటి ఐల్యాండ్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి బేరమే ఒకటి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శాన్ ఫ్రాన్సిస్కో బేలో ప్రైవేట్ యాజమాన్యంలోని ద్వీపం ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. దీనిని కొనాలంటే 25 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ ద్వీపాన్ని కొనాలంటే సుమారు రూ. 200 కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సుమారు 5.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందమైన 'రెడ్ రాక్ ఐలాండ్' సొంతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. 2015లో ఓ సారి ఈ ఐలాండ్‌ను విక్రయించడానికి ప్రయత్నించారు, అప్పుడు దీని కేవలం 5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఆ తరువాత దీని ఓనర్ 2011లో మరోసారి విక్రయించడానికి పూనుకున్నాడు. ఆ సమయంలో దీని ధర రూ. 22 మిలియన్ డాలర్లు.
ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి
ఎర్ర రాళ్లతో, మట్టితో ఉండటం వల్ల దీనిని రెడ్ రాక్ ఐలాండ్ అని పిలుస్తారు. దీని ఓనర్ 'బ్రాక్ డర్నింగ్' ప్రస్తుతం అలాస్కాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఇది తన తండ్రి నుంచి వారసత్వంగా లభించింది. కానీ అతడు గత 22 సంవత్సరాలుగా అక్కడికి రాకపోవడం గమనార్హం. బ్రాక్ తల్లి వృద్ధురాలు కావడంతో.. ఆమె సంరక్షణకు కావలసిన సంరక్షణ కోసం దీనిని అమ్మటానికి సిద్దమైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment