San Francisco Bay Area
-
అమ్మకానికి అందమైన ఐలాండ్.. ధర తెలిస్తే ఆశ్చర్య పోతారు!
-
అమ్మకానికి అందమైన ఐలాండ్ - ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సాధారణంగా వ్యవసాయ భూములు, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, విల్లా వంటివి వాటిని అమ్మడం లేదా కొనటం అనేది జరగటం సర్వసాధారణం. అయితే చాలా అరుదుగా ఐలాండ్ (ద్వీపాలు) అమ్మకానికి వస్తాయి. బాగా డబ్బున్న వారు, ఏకాంతంగా.. ప్రశాంతంగా బతకాలనుకునే వారు మాత్రమే ఇలాంటి ఐల్యాండ్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి బేరమే ఒకటి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాన్ ఫ్రాన్సిస్కో బేలో ప్రైవేట్ యాజమాన్యంలోని ద్వీపం ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. దీనిని కొనాలంటే 25 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ ద్వీపాన్ని కొనాలంటే సుమారు రూ. 200 కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సుమారు 5.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందమైన 'రెడ్ రాక్ ఐలాండ్' సొంతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. 2015లో ఓ సారి ఈ ఐలాండ్ను విక్రయించడానికి ప్రయత్నించారు, అప్పుడు దీని కేవలం 5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఆ తరువాత దీని ఓనర్ 2011లో మరోసారి విక్రయించడానికి పూనుకున్నాడు. ఆ సమయంలో దీని ధర రూ. 22 మిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి ఎర్ర రాళ్లతో, మట్టితో ఉండటం వల్ల దీనిని రెడ్ రాక్ ఐలాండ్ అని పిలుస్తారు. దీని ఓనర్ 'బ్రాక్ డర్నింగ్' ప్రస్తుతం అలాస్కాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఇది తన తండ్రి నుంచి వారసత్వంగా లభించింది. కానీ అతడు గత 22 సంవత్సరాలుగా అక్కడికి రాకపోవడం గమనార్హం. బ్రాక్ తల్లి వృద్ధురాలు కావడంతో.. ఆమె సంరక్షణకు కావలసిన సంరక్షణ కోసం దీనిని అమ్మటానికి సిద్దమైనట్లు సమాచారం. -
అమెరికాలో కాల్పులు..
కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చోటు చేసుకుంది. హలోవీన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో అకస్మాత్తుగా కాల్పులు చోటు చేసుకున్నాయి. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా కమ్యూనిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి అత్యంత ధనికులు నివాసముండే ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండే 100 మంది హలోవీన్ విందు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. కాల్పులకు కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, కాసేపటికి పోలీసులు వచ్చారని, అంబులెన్స్ల్లో పలువురిని తీసుకువెళ్లారని స్థానికులు తెలిపారు. -
శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడి బే ఏరియాలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో పలువురు ఎన్ఆర్ఐల సహకారంతో ఈ సంబరాలు జరిగాయి. గత 14 ఏళ్లుగా తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించేలా టీసీఏ, ఎన్ఆర్ఐలు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శాన్ జోస్ లోని చారిత్రక గౌడలుపే పార్క్ లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పార్క్ పరిశుభ్రతకు శ్రమదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఒక నిమిషం పాటు మౌనం వహించారు. తెలంగాణ త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు అమెరికాలోని ఎన్నారైలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆసియాలోనే తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భాస్కర్ కల్వ తెలంగాణ జానపద గేయాన్ని చక్కగా ఆలపించారు. ధనుంజయ బోడ కుటుంబం తెలంగాణ వంటకాలైన అరిసెలు, సకినాలను తెచ్చి అందరకీ రుచి చూపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐల పిల్లలు నేహారెడ్డి బోడ, శ్రేయ్ కొత్త, అమిత్ మెట్టపల్లి, హన్నాలు స్వచ్ఛందంగా వాలంటీర్లుగా ముందుకొచ్చి పనిచేశారు. టీసీఏ వ్యవస్థాపక సభ్యుడు బిక్షం పాలబిందెల, శ్రీనివాస్ గుజ్జు, చందు సిరామదాస్, విజయలక్ష్మి కనికరం, తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కృషిచేసిన వాలంటీర్ల సేవలను కొనియాడారు. టీసీఏ వ్యవస్థాపక సభ్యులు విజయ్ చవ, టీసీఏ అధ్యక్షులు ధనంజయ బోడ, సబితా బోడ, మహిపాల్ అన్నం, వినోయ్ మేరెడ్డి, సాగర్ కొత్త, ప్రవీణ్ గరపల్లి, విష్ణు మెట్టపల్లి, సుశీల్.కె, క్రిష్ణమూర్తి వేముల, భాస్కర్ కల్వ, సుస్మిత అన్నాడి, రవి అనంత, తదితరులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.