శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్.. భారత అత్యున్నత పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. శుక్రవారం కాలిఫోర్నియా నగరం శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు ఈ గౌరవం పిచాయ్‌కు అందించారు.
మధురైలో పుట్టిన సుందర్ పిచాయ్‌కు.. భారత ప్రభుత్వం 2022 ఏడాదికిగానూ పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల నడుమ పిచాయ్ ఈ పురస్కారం అందుకున్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతదేశం నాలో ఒక భాగం. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా దానిని నా వెంట తీసుకువెళతాను అని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు. భారత మూడో అత్యున్నత పురస్కార గౌరవం అందుకున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు గాఢంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారాయన. ఈ సందర్భంగా తన మూలాల్ని, తన తల్లిదండ్రుల త్యాగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారాయన.
Delighted to hand over Padma Bhushan to CEO @Google & Alphabet @sundarpichai in San Francisco.
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) December 2, 2022
Sundar’s inspirational journey from #Madurai to Mountain View, strengthening 🇮🇳🇺🇸economic & tech. ties, reaffirms Indian talent’s contribution to global innovation pic.twitter.com/cDRL1aXiW6
Comments
Please login to add a commentAdd a comment