
న్యూఢిల్లీ: కోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం సాధారణ పాస్‌పోర్టును అందుకున్నారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ ఇటీవల తన దౌత్యహోదా పాస్‌పోర్టును అధికారులకు తిరిగి ఇచ్చేశారు. ఆయనకు సాధారణ పాస్‌పోర్టును జారీ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదంటూ శనివారం ఢిల్లీ కోర్టు తెలిపింది.
ఈ మేరకు అధికారులు రాహుల్‌కు ఆదివారం ఉదయం పాస్‌పోర్టును పంపించారు. సోమవారం రాహుల్ శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్తారు. అక్కడ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర ముఖ్యులను కలుసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment