కూలిన విమానం : ముగ్గురి మృతి | Three killed in Alaska plane crash | Sakshi
Sakshi News home page

కూలిన విమానం : ముగ్గురి మృతి

Published Wed, Sep 16 2015 8:26 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

Three killed in Alaska plane crash

శాన్ఫ్రాన్సిస్కో : అలస్కాలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని ఎయిర్ నేషనల్ గార్డు సార్జంట్ ఎడ్వర్డ్ ఈగర్టన్ బుధవారం వెల్లడించారు. విమానం టేకాఫ్ అయిన కొంత సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపింది. ఎయిర్ఫీల్డ్కి కేవలం 270 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. మృతులు ముగ్గురు స్థానికులు కాదని చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదన్నారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement