
మానసికంగా/శారీరకంగా గాయపరిచే ఘటనలు, జన్యు సంబంధిత కారణాలు, ఒత్తిడి.. ఇలా మనిషి కుంగుబాటుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒక్కోసారి మెదడులో కెమికల్ ఇంబ్యాలెన్స్‌తోనూ డిప్రెషన్‌లోకి వెళ్లొచ్చు. డిప్రెషన్.. ఎంతకాలంలో క్యూర్ అవుతుందనేది.. మనిషి మానసిక స్థితిని బట్టి, చుట్టూ నెలకొనే పరిస్థితులను బట్టి ఉంటుంది. అయితే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో డిప్రెషన్‌ను దూరం చేస్తే ఎలా ఉంటుంది?
ఇప్పటిదాకా ఊహకందని ఈ ఆలోచనను.. ఆచరణలో పెట్టి విజయం సాధించారు రీసెర్చర్లు. ఓ డివైజ్‌ను ఉపయోగించి డిప్రెషన్‌ను దూరం చేయొచ్చని శాన్ ఫ్రాన్సిస్కో రీసెర్చర్లు నిరూపించారు. కాలిఫోర్నియాకు చెందిన సారా అనే 36 ఏళ్ల మహిళ ఐదేళ్లుగా నిరాశనిస్పృహ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు ఈ టూల్‌ను బ్రెయిన్‌లో ప్రవేశపెట్టడం ద్వారా సత్ఫలితం రాబట్టారు.
మూర్ఛ వ్యాధిలో ఉపయోగించే డివైజ్ అది. సారా బ్రెయిన్ సర్క్యూట్‌లలో బయోమార్కర్‌లను గుర్తించి.. ఆ స్పాట్‌లలోకి ఎలక్ట్రోడులను పంపించి చికిత్స(Deep brain stimulation) అందించారు. కేవలం ఆరు సెకండ్లపాటు సాగే ట్రీట్‌మెంట్‌ను.. పన్నెండు రోజుల్లోనే ఫలితం వచ్చిందని పేర్కొన్నారు. సారాకి సంబంధించిన వివరాలను ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 4న ‘నేచర్ మెడిసిన్’ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన ఓ కథనం కూడా పబ్లిష్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment