రాయికల్: అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కోలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అమెరికా వంటి అగ్రదేశాల్లో సైతం బతుకమ్మ పండగ నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అమెరికాలోని వివిధ స్టేట్స్‌కు చెందిన సుమారు రెండు వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కవితతో కలిసి కోలాటాలు ఆడారు. కార్యక్రమంలో భారత రాయబార కౌన్సిల్ జనరల్ వెంకటేశం, అశోక్, తెలంగాణ జాగృతి అమెరికా అధ్యక్షుడు బండారి శ్రీధర్, సభ్యులు సతీశ్, మురళి, సత్యపాల్, నరేశ్, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు విజయ్, భాస్కర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.