విమానంలో 140మంది.. తప్పిన ప్రమాదం | Air Canada Airbus Nearly Lands On Taxiway Where 4 Planes were Lined Up | Sakshi
Sakshi News home page

విమానంలో 140మంది.. తప్పిన ప్రమాదం

Published Wed, Jul 12 2017 3:32 PM | Last Updated on Tue, Aug 27 2019 4:33 PM

విమానంలో 140మంది.. తప్పిన ప్రమాదం - Sakshi

విమానంలో 140మంది.. తప్పిన ప్రమాదం

వాషింగ్టన్‌: అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. 150మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం నేరుగా రన్‌వేపై కాకుండా ట్యాక్సీవేపై దిగబోయింది. దానికి అతి సమీపంలోనే నాలుగు విమానాలు టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎయిర్‌ ట్రాఫిక్‌ సిబ్బంది ఏమాత్రం ఏమరుపాటుతో ఉన్న భారీ నష్టం జరిగి ఉండేది.

సకాలంలో స్పందించడంతో ప్రమాదాన్ని తప్పించారు. ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కెనడాకు చెందిన ఎయిర్‌బస్‌ ఏ320 విమానం శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయానికి అర్ధరాత్రి వచ్చింది. ఆ విమానం రన్‌వే-28 మార్క్‌ వద్ద దిగేందుకు అనుమతించారు. అయితే, దీనిని అజాగ్రత్తతో తప్పుగా అర్ధం చేసుకున్న పైలెట్‌ కాస్త విమానాన్ని ట్యాక్సీ వే సీ మార్గంలో దింపే ప్రయత్నం చేశాడు. అయితే, పైలట్‌కు డేంజర్‌ అలర్ట్స్‌ పంపించడంతో మరోసారి విమానాన్ని చక్కర్లు కొట్టించి చివరకు సురక్షితంగా దింపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement