కోల్‌కతా నుంచి దోహా వెళుతున్న కతర్ ఎయిర్‌వేస్‌లో ఆ సమయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విమానంలో ఉన్న ఒక యువకుడు ‘బాంబు.. బాంబు’ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో క్రూ మెంబర్స్ ఈ విషయాన్ని సీఐఎస్‌ఎఫ్‌కు తెలియజేశారు. వెంటనే విమానంలో తనిఖీ చేపట్టారు. అయితే ఆ యవకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు.
వివరాల్లోకి వెళితే కతర్ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యూఆర్541, విమానం కోల్‌కతా నుంచి దోహాకు బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. ఒక యువకుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా కేకలుపెట్టాడు. విమానంలోని క్రూ మెంబర్స్ వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్‌ఎఫ్‌కు చేరవేశారు. వెంటనే భద్రతా దళాలు పరుగుపరుగున వచ్చి, విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారు ఆ యువకుడిని ప్రశ్నించగా... ఎవరో తనతో విమానంలో బాంబు ఉందని చెప్పారని అన్నాడు. కాగా సీఐఎస్‌ఎఫ్ బృందం ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్నిఫర్ డాగ్స్ సాయంతో తనిఖీ చేయించారు. ఇంతలో ఆ యువకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, అందుకు సంబంధించిన ధృవపత్రాలను కూడా చూపించాడు.
ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. బాంబు లేదని నిర్థారించాక ప్రయాణికులను తిరిగి విమానంలోకి అనుమతించారు. కాగా దీనికిముందు గత ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ సూచన అందించింది. దీంతో ఆ విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్‌సింగ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తరువాత విమానంలో తనిఖీలు జరిపారు. అయితే విమానంలో ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. ఈ ఘటనలో బాంబు ఉందంటూ వదంతులు వ్యాపింపజేసిన హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: ఆమె 18 ఏళ్ల తరువాత తన ఎల్‌కేజీ ఫ్రెండ్‌ను కనిపెట్టిందిలా..
Comments
Please login to add a commentAdd a comment