beedi
-
జైలులో బీడీలు, గుట్కా ఇవ్వాలని ఖైదీల డిమాండు
దొడ్డబళ్లాపురం: బీడీలు, గుట్కా ఇవ్వాలని డిమాండు చేస్తూ కలబుర్గి జైలులో ఖైదీలు ధర్నా చేశారు. ఇటీవల జైలులో అన్నీ నిలిపివేసారని ముస్తఫా అనే ఖైదీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది ధర్నా చేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన జైలు అధికారి అనిత లంచం అడిగారని ముస్తఫా ఒక మహిళ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు ఇప్పించాడు. డబ్బులు ఇస్తేనే పొగాకు, గుట్కాలను అనుమతిస్తానని ఆమె స్పష్టం చేసిందన్నారు. అతడు, మిగతా ఖైదీలు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని జైలర్ అనిత సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సోదరితో మాట్లాడిన ఆడియోలో తనకు బెదిరింపులు ఉన్నాయని అనిత చెబుతున్నారు. గుట్కా తదితరాలను అడ్డుకోవడంతో తనపై కక్ష గట్టారని ఆమె చెప్పారు. -
బీడీ అడిగాడని.. బండరాయితో బాది చంపేశాడు!
ఒక్క బీడీ కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దేశరాజధాని ఢిల్లీలోని షాహ్దరా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కస్తూర్బా నగర్‌కు చెందిన సన్నీ(20) గురువారం జ్వాలానగర్‌కు చెందిన రాజేశ్ శ్మశానవాటిక సమీపంలో కలుసుకున్నారు. ఆ సమయంలో సన్నీ బీడీ ఇవ్వాలని రాజేశ్‌ను కోరాడు. ఈ విషయం ఇద్దరి మధ్యా వాగ్వాదానికి దారి తీసింది. తీవ్ర కోపోద్రిక్తుడైన రాజేశ్ పెద్ద బండరాయితో సన్నీ తలపై మోదాడు. దీంతో, సన్నీ అక్కడికక్కడే నేలకూలడంతో రాజేశ్ పరారయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి చూడగా సన్నీ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. సన్నీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు, పరారీలో ఉన్న రాజేశ్‌ను శుక్రవారం పట్టుకున్నారు. విచారణలో అతడు నేరం అంగీకరించా డని పోలీసులు తెలిపారు. కాగా, సన్నీ మైనర్‌గా ఉన్నప్పుడే హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని, అతడిపై ఆయుధాల చట్టం కేసు కూడా ఉందని వివరించారు.కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోపొర్ ప్రాంతంలోని పానీపొరాలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న బలగాలు గురువారం రాత్రి నుంచి కార్డన్‌సెర్చ్ కొనసాగిస్తున్నాయి. అధికారులు ముందుగా ఆ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. శుక్రవారం ఉదయం భద్రతాబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు. మృతుల వివరాలు, వారు ఏ ఉగ్ర సంస్థకు చెందిన వారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.ముగ్గురు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బిజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధి రేఖపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చేపట్టాయి. శుక్రవారం ఉదయం రేఖపల్లి–కోమటపల్లి అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో పోలీసులు సైతం కాల్పులు జరిపారు. గంట పాటు హోరాహోరీగా సాగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి ఒక ఎస్ఎల్ఆర్, ఒక స్నైపర్ తుపాకీ, ఒక 12 బోర్ రైఫిల్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, గ్రెనేడ్ లాంచర్ తూటాలు, మందుగుండు సామగ్రి స్వాదీనం చేసుకున్నారు. చదవండి: కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం.. అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య? -
ఫ్లైట్‌లో బీడీ పొగ..
Smoking Beedi inside Flight: విమానంలో బీడీ తాగిన ఓ వ్యక్తిని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్‌లో బీడీ ఎందుకు తాగావని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. 56 ఏళ్ల ఎం.ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమానంలో బెంగళూరు నగరానికి వస్తున్నాడు. వాష్‌రూమ్‌లో బీడీ తాగుతుండగా విమాన సిబ్బంది పట్టుకున్నారు. బెంగళూరులో దిగగానే ఎయిర్ ప్లేన్ డ్యూటీ మేనేజర్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ‘రైలులో తాగినట్లే విమానంలోనూ తాగాను’ తాను ఎక్కువగా రైలులో ప్రయాణిస్తానని, విమానంలో ప్రయాణించడం తనకు తొలిసారి అని పోలీసులకు నిందితుడు తెలిపాడు. రైలు టాయిలెట్ లో బీడీ తాగినట్లే విమానంలోనూ తాగానని అమాయకంగా చెప్పాడు. మార్వార్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న కుమార్ మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో బంధువు మరణానంతర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా బీడీ తాగిన వ్యక్తిని అరెస్టు చేయడం బెంగుళూరు విమానాశ్రయంలో ఇదే తొలిసారి. గతంలో విమానంలో సిగరెట్ తాగిన ఇద్దరు వ్యక్తులపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: బంఫరాఫర్: వైజాగ్ నుంచి సింగపూర్ విమాన టికెట్ ఎంతో తెలుసా? -
షాకింగ్.. కాల్చి పడేసిన బీడీ, సిగరెట్ల వల్ల 3,969 అగ్ని ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: నిర్లక్ష్యం నిప్పుగా మారుతోంది. ఆ అగ్గి అమాయకుల ప్రాణాలను బుగ్గి చేస్తోంది. మానవతప్పిదాలే పెనుముప్పునకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో బాణాసంచా కాల్చడంలో చిన్న పొరపాటు నలుగురిని బలితీసుకుంది. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇదేరీతిలో చాలావరకు అగ్నిప్రమాదాలకు మానవతప్పిదాలే కారణమవుతున్నాయి. అత్యంత నిర్లక్ష్యపు ప్రవర్తనే ప్రధాన కారణంగా నిలుస్తోందని అగి్నమాపక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2021, 2022లో నమోదైన అగ్నిప్రమాదాల కారణాలు విశ్లేషిస్తే ఇదే స్పష్టమవుతోంది. కాల్చి పడేసిన సిగరెట్, బీడీల వల్లే అత్యధిక అగి్నప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు తేల్చారు. ఈ తరహా ప్రమాదాలు 2021లో 3,610, 2022లోనూ 3,969 జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అగ్ని ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. చదవండి: కరెంట్ ఉద్యోగులకు 7% ఫిట్మెంట్ -
బీడీకి జీఎస్టీ పొగ
పన్ను పోటు పొద్దంతా కష్ట పడతారు. ఆరోగ్యం పొగచూరుతున్నా లెక్క చేయకుండా బీడీలు చుడతారు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా కూలి కూడా గిట్టుబాటు కాదు. వారి బతుకులు వెళ్లబారేది ఆ కాస్త డబ్బుతోనే. బీడీలు చుట్టి చుట్టి వాళ్ల వేళ్లు వంగిపోతున్నాయి... అంతే తప్ప వాళ్ల బతుకులు నిలబడడం లేదు. దీనికి తోడు ‘గోరుచుట్టపై రోకటి పోటు’లా వచ్చి పడింది జీఎస్టీ. ఈ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు పరిశ్రమల యజమానులే వణికి పోతున్నారు. బీడీ కార్మికులు చిగురుటాకులు కాక మరేమవుతారు? జీఎస్టీతో బీడీ పరిశ్రమలు సంక్షోభం అంచుకు చేరాయి. జీఎస్టీ సెగకు బీడీలు చుట్టి బతుకు వెళ్లదీస్తున్న లక్షలాది మంది ఉపాధి పొగచూరుతోంది. ఇది పూర్వ కరీంనగర్ జిల్లా, వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్. గజ్జెల శశికళ కుటుంబం. శశికళ, ఆమె కూతులు, ఇద్దరు కోడళ్లు. ఈ ఇంట్లో ఉన్న నలుగురు మహిళలూ బీడీలు చుడుతున్నారు. వారికి ఈ వృత్తే జీవనాధారం. ఒకప్పుడు నెలలో 25 రోజులు పని దొరికేది. ఇప్పుడు10 రోజులకు పడిపోయింది. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే ఒక్కొక్కరికీ వచ్చేది వంద రూపాయల లోపే. జూలై ఒకటి తర్వాత మారిన ముఖచిత్రం ఇది. వారి మాటల్లో ఆవేదన ప్రస్ఫుటమవుతుంది. ‘‘గిప్పుడేమో బీడీలకు లవుగోస అచ్చిపడ్డది. ఏదో జీఎస్టీనట అదొచ్చినంక పని దొరుకుడు కష్టమైంది. మేమంతా బీడీలు సుడితేనే తిండికి పైసలు. పిల్లలను ఎలా సాదుకునుడో ఏమో. మేము మొత్తం 12 మందిమి ఉన్నం. మా ఖర్సులు ఎట్లా ఎల్లాలే దేవుడా అని మొక్కుకుంటున్నం’’ అన్నారు దీనంగా. ఇది శశికళ ఇంటి ఆవేదన. మరో గడపలో అడుగుపెడితే... అది దొంత కమల ఇల్లు. కోడలు శిరీషతో కలిసి కమల బీడీలు చుడుతోంది. ఈ ఇంట్లో మొత్తం ఎనిమిది మంది ఉంటారు. బీడీల పని దొరికితేనే ఈ కుటుంబానికి మూడు పూటల ముద్ద నోట్లోకి వెళ్లేది. ‘‘ఇప్పడి దాకా కిందికి మీదికో నెట్టుకొచ్చినమ్ గానీ.. ఈ జీఎస్టీ వచ్చినాక పని ఎక్కువ రోజులు దొరుకత లేదు, గిట్టుబాటు అయిత లేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అత్తాకోడళ్లు. ఈ రెండు కుటుంబాలే కాదు, బీడీలు చుట్టి బతికే మహిళాకార్మికులను ఎవరిని కదిలించినా ఇదే వేదన. ఇందూరు నుంచి బీడీ పరిశ్రమ పూర్వ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ తదితర జిల్లాల్లో బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటారు. వ్యవసాయం, చేనేత తర్వాత ఎక్కువ కుటుంబాలు ఆధారపడింది బీడీ పరిశ్రమపైనే. వ్యవసాయ, చేనేత రంగాల్లో పని లేకపోవడంతో మగవాళ్లు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. ఏడాదిలో పది నెలల వరకు బయటే ఉంటారు. మగవాళ్లు వచ్చే వరకు మహిళలు బీడీలు చుట్టి ఇంటిని నడుపుతుంటారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ 1901 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం(ఇందూరు) లో మొదలైంది. కిషాన్లాల్ రామ్ సురూప్ బీడీ కంపెనీ మొదట ప్రారంభమైంది. ఇక్కడి నుంచి బీడీ పరిశ్రమ ఇతర జిల్లాలకు విస్తరించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 8.50 లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలే బీడీ పనిని నమ్ముకుని బతుకుతున్నారు. రాష్ట్రంలో రోజుకు దాదాపు 100 కోట్ల బీడీలు ఉత్పత్తి అవుతాయి. 40 నుంచి 50 కంపెనీలు పనిచేస్తున్నాయి. అయితే బీడీ కట్టపై పుర్రె గుర్తు పెట్టాలని గత యూపీఎ ప్రభుత్వం నిర్ణయంతో బీడీ పరిశ్రమపై అప్పట్లోనే తీవ్ర ప్రభావం పడింది. పుర్రెగుర్తు జీవోకు వ్యతిరేకంగా బీడీకార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. దీంతో పుర్రె బొమ్మ స్థానంలో ఊపిరితిత్తుల బొమ్మను ముద్రించారు. తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం బీడీ కట్టలపై రెండు వైపులా 85 శాతం మేర గొంతు క్యాన్సర్ బొమ్మ వేయాలని 2016 ఆగస్టులో జీవో 727(ఈ) ని తీసుకువచ్చింది. కొత్తగా జీఎస్టీ పన్నుల భారం మహిళ కార్మికుల ఉపాధిని అగాధంలోకి నెట్టింది. బీడీ కార్మికులకు మిగిలేది జబ్బులే... బీడీల ఉత్పత్తి ద్వారా ఇంత టర్నోవర్ ఉన్నా బీడీలు చుట్టే వారికి జబ్పులు తప్ప మరేమీ మిగలడం లేదు. బీడీలు చుట్టడమంటే ఆరోగ్యాన్ని రోజుకింత కుళ్లపొడుచుకోవడమే. రోజుకు 12 నుంచి 16 గంటల శ్రమిస్తే తప్ప ఇల్లు గడవదు. మెడ, భుజం, వెన్ను, నడుం, కాళ్లనొప్పులు, టీబీ, క్యాన్సర్, గర్భకోశ, శ్వాసకోశ వ్యాధులు, జలుబు, దగ్గు, గ్యాస్ ట్రబుల్, నీరసం, నిస్సత్తువ, మలబద్దకం, రక్తహీనత, చూపు మందగించడం... ఇలాంటి సవాలక్ష అనారోగ్యాలే వీరు కూడబెట్టుకుంటున్న ఆస్తులు. బీడీలు చుట్టే తల్లులకు తొలికాన్పు గర్భశోకాన్నే మిగులుస్తుంది. ఎవరింట్లోనైనా తొలిబిడ్డ బతికితే పూర్వజన్న సుకృతంగా కళ్లకు అద్దుకుంటారు. తమకు పుట్టే శిశువు బరువు అతితక్కువగా ఉండటం మరో శాపం. బీడీ పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం... బీడీ పరిశ్రమపై బీడీలకు 2.8 శాతం, తునికాకుపై 18 శాతం, పాగాకుపై ఐదు శాతం జీఎస్టీ నిర్ణయించారు. గతంలో అన్ని కలిపితే వెయ్యి బీడీలకు సెంట్రల్ ఎకై ్సజ్ టాక్స్ రూ.16లు ఉండేది. ఇప్పుడు జిఎస్టీ అమలుతో రూ.193ల వరకు అవుతోంది. ఫలితంగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న బీడీ కార్మికులు, ప్యాకింగ్ కార్మికులు, బట్టీ కార్మికులు, చాటన్ కార్మికులు, టేకేదార్లు, పొగాకు రైతులు, తునికాకు కూలీల బతుకులపై తీవ్ర ప్రభావం చూపనుంది. బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించడం మూలంగా ప్రత్యక్షం, పరోక్షంగా దీనిపై ఆధారపడ్డ 8.50 లక్షల మంది కార్మికుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎవరికి లాభం? బీడీలు తాగే వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బీడీలు చుట్టే వాళ్ల ఆరోగ్యమూ పాడవుతుంది. మరి ఇంత పెద్ద పరిశ్రమలో లాభపడుతున్నదెవరంటే... ముమ్మాటికీ ప్రభుత్వమే, దానితోపాటు కంపెనీ యాజమాన్యాలు. కేంద్రానికి ఆదాయం కోట్లలో... నిజమే. పేదోడీ సిగిరెట్టుగా పేరున్న బీడీ ప్రభుత్వానికి భారీ ఆదాయమే సమకూర్చి పెడుతున్నది. గల్ఫ్ దేశాల్లో మంచి క్రేజ్ సంపాదించిన మన బీడీలు విదేశీమారక ద్రవ్యం ఆర్జించిపెడుతున్నాయి. మన దేశంలో రోజుకు సుమారు 150 కోట్ల బీడీలు తయారవుతుండగా, వాటిమీద ప్రభుత్వాలకు సెస్ రూపంలో రెండు కోట్ల రూపాయలు లభిస్తుందని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ప్రతిరోజూ ఇంత సొమ్మును ఖజానాలో జమ చేసుకుంటున్న ప్రభుత్వాలు... పొగుచూరిపోతున్న బతుకుల గురించి పట్టించుకోకపోవడమే బాధాకరం. మనదేశంలో ఏటా లక్ష నుంచి లక్షన్నర కోట్ల బీడీ వ్యాపారం జరుగుతోంది. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి, కరీంనగర్ -
కొత్తగా బీడీ కార్మికుల పింఛన్లు నిలిపివేత
ముకరంపుర: ప్రభుత్వం కొత్తగా బీడీ కార్మికుల పింఛన్ల మంజూరు నిలిపివేసిందని డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు బీడీ కార్మికులు కొత్తగా పెన్షన్ మంజూరు కొరకు ఆర్జీలు సమర్పించకూడదని సూచించారు. ప్రభుత్వం తిరిగి ఉత్తర్వులిచ్చిన వెంటనే పత్రికాముఖంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. -
క్యాన్సర్ రాదనడానికి ఆధారాల్లేవు: మోదీ
బీడీ, సిగరెట్ కట్టలపై హెల్త్ వార్నింగ్ లోగో సైజు 65 శాతానికి పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి జేఎన్ నద్దాను తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించినట్టు సమాచారం. బీజేపీ మంత్రుల వరుస వివాదాస్సద కామెంట్ల తరువాత ప్రధానమంత్రి స్పందించారు. పొగాకు లాబీకి తలొగ్గేది లేదని ప్రధాని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంటరీ కమిటీ సూచించినట్టుగా పొగతాగడం వల్ల కాన్సర్ రాదనడానికి ఆధారాలు లేవని ఆయనన్నారు. బెంగళూరులో జరుగుతున్న పార్టీ జాతీయ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రధాని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా సిగరెట్ తాగితే కేన్సర్ వస్తుందని భారత్‌లో ఏ పరిశోధన కూడా ధ్రువీకరించలేదని, అలా అనుకోవటం మూర్ఖత్వమని పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, బీజేపీ ఎంపీ దిలీప్ కుమార్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలహాబాద్ ఎంపీ శ్యామ చరణ్ గుప్తా, మరో బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ కూడా సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ రాదంటూ, వార్నింగ్ లోగో సైజు పెంచడాన్ని వ్యతిరేకించారు. దీంతో బీజేపీ సర్కారు చిక్కుల్లో పడింది. పొగాకు ఉత్పత్తులన్నింటిపైనా హెచ్చరిక చిహ్నాలు 85శాతం మేర ముద్రించాలంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఏప్రిల్ ఒకటి నుంచే ఈ ఆదేశాలు అమలు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ దాన్ని 65 శాతమే చేయడంతో పొగాకు లాబీకి తలొగ్గారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. -
మండే గుండెలు