సాక్షి, హైదరాబాద్: నిర్లక్ష్యం నిప్పుగా మారుతోంది. ఆ అగ్గి అమాయకుల ప్రాణాలను బుగ్గి చేస్తోంది. మానవతప్పిదాలే పెనుముప్పునకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో బాణాసంచా కాల్చడంలో చిన్న పొరపాటు నలుగురిని బలితీసుకుంది. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇదేరీతిలో చాలావరకు అగ్నిప్రమాదాలకు మానవతప్పిదాలే కారణమవుతున్నాయి.
అత్యంత నిర్లక్ష్యపు ప్రవర్తనే ప్రధాన కారణంగా నిలుస్తోందని అగి్నమాపక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2021, 2022లో నమోదైన అగ్నిప్రమాదాల కారణాలు విశ్లేషిస్తే ఇదే స్పష్టమవుతోంది. కాల్చి పడేసిన సిగరెట్, బీడీల వల్లే అత్యధిక అగి్నప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు తేల్చారు. ఈ తరహా ప్రమాదాలు 2021లో 3,610, 2022లోనూ 3,969 జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అగ్ని ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు
తెలిపారు.
చదవండి: కరెంట్ ఉద్యోగులకు 7% ఫిట్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment