టెక్నాలజీ పెరగడంతో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఉబర్, ఓలా యాప్‌లలో వెహికల్స్ బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో క్యాబ్ చార్జీలు చూసి వినియోగదాదారులు తప్పకుండా ఖంగుతింటారు. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వైరల్ అయినప్పటికీ.. తాజాగా ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
రాజేష్ భట్టాడ్ అనే వ్యక్తి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెచ్ఎస్ఆర్ లేఔట్ వెళ్లాలనుకున్నారు. ఆ సమయంలో ఉబర్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే దాదాపు రూ.2000 చూపించింది. ఇది చూసిన రాజేష్ ఒక్కసారిగా షాకయ్యారు. దీనిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చివరకు రాజేష్ భట్టాడ్ బస్సులో కేవలం రూ. 265లతో గమ్యస్థానం చేరుకుని BMTCకి కృతజ్ఞతలు చెప్పారు. 40 కిలోమీటర్ల దూరానికి రూ. 2000 చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనిపైన పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. విమానాశ్రయం దగ్గర చార్జీలు ఎక్కువగా ఉంటాయని, బస్సులో వెళితే చార్జీలు బాగా తగ్గుతాయని కామెంట్స్ చేశారు.
గత ఏడాది కూడా బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి ఉబెర్ క్యాబ్ ఎక్కువ ఛార్జీలను వసూలు చేసిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 50 కిలోమీటర్ల రైడ్‌కు రూ. 4,000 వరకు వసూలు చేసినట్లు ఇందులో తెలిసింది. స్క్రీన్‌షాట్ వైరల్ కావడంతో, క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీకు నగర రవాణా శాఖ నోటీసులు అందించింది.
The Uber pricing past midnight from Bengaluru Airport to HSR🥲
— 📊 Rajesh Bhattad | theRevOpsGuy (@theRevOpsGuy) February 28, 2024
Thank you BMTC🙏 pic.twitter.com/gWAHgXbtpD
Comments
Please login to add a commentAdd a comment