బెంగళూరు: సాధారణంగా మనం రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో భిక్షాటన చేసేవాళ్లను చూస్తుంటాం. కానీ ఓ యువకుడు ఏకంగా ఎయిర్ పోర్టులోని ప్రయాణికుల వద్ద భిక్షాటన చేస్తు కనిపించాడు. ఇది గమనించిన విమానాశ్రయ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విఘ్నేశ్ అనే 27 ఏళ్ల యువకుడు ఎయిర్ పోర్టులో ప్రవేశించేందుకు చెన్నై వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. విమానాశ్రయంలోకి వెళ్లి అక్కడ ఉన్న ప్రయాణికుల వద్ద.. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తక్షణ వైద్యం అందించాలని తప్పుడు కథనాన్ని సృష్టించాడు.
ఈ విధంగా చెబుతూ ప్యాసింజర్ల నుంచి రూ. 7వేలు, పదివేలు కావాలంటూ అభ్యర్థించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తన చూసిన కొందరు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని నుంచి 26 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకోగా.. అందులో 24 క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదంతా ఓ ముఠా పని అయ్యిండచ్చని.. విఘ్నేశ్ కూడా ఆ గ్యాంగ్‌లో ఒక్కడే అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో ఈ తరహా కార్యకలాపాలు జరగడం చాలా అరుదు. రెండేళ్ల క్రితం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనే జరగగా.. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఇటువంటి ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment