
బెంగళూరు విమానాశ్రయం
దొడ్డబళ్లాపురం (బెంగళూరు): కోవిడ్ థర్డ్‌వేవ్ నేపథ్యంలో బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాలన్నా, రావాలన్నా అక్కడి ల్యాబ్‌లో ర్యాపిడ్ ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరి. అయితే ఈ టెస్టులు చేసే సిబ్బంది ఇష్టానుసారం రిపోర్టులు ఇస్తున్నారని మొదటి నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటిదే మరో సంఘటన గత గత గురువారం జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దుబాయ్‌కి వెళ్లాల్సిన ఒక యువకుడు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని నివేదిక ఇచ్చారు. అంతకుముందే అతడు బయట టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. మళ్లీ బయట టెస్టు చేస్తే నెగెటివ్‌గా తేలింది. దీంతో ఆ యువకుడు తన కుటుంబ సభ్యులతో ఎయిర్‌పోర్టుకు వచ్చి తనకు టెస్టు చేసిన సిబ్బందిని నిలదీశాడు. ఆ సమయంలో సిబ్బంది మద్యం మత్తులో ఉండడంతో గొడవ పెరిగింది. తప్పుడు నివేదిక వల్ల దుబాయ్‌కి వెళ్లలేకపోయానని, ఆ నష్టాన్ని ఎవరు తీరుస్తారని బాధిత యువకుడు వాపోయాడు. ఈ గొడవ వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, అడిగినంత డబ్బులను ముట్టజెబితే ల్యాబ్ సిబ్బంది ఎలా కావాలంటే అలా నివేదిక ఇస్తారని ఆరోపణలు ఉన్నాయి.
చదవండి: (అర్ధరాత్రి పార్టీ.. మద్యం మత్తులో చిందులు.. నటులపై కేసు)
Comments
Please login to add a commentAdd a comment