పారాలింపియన్ కు అవమానం
పారాలింపియన్ కు అవమానం
Published Thu, Oct 13 2016 8:24 AM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM
బెంగళూరు: పారాలింపియన్ ఆదిత్యా మెహతాకు అవమానం జరిగింది. ఈ నెల 11వ తేదీన బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ)కు నుంచి హైదరాబాద్ బయల్దేరిన తనతో అధికారులు తప్పుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఆసియన్ పారా-సైక్లింగ్ చాంపియన్ షిప్-2013లో ఆదిత్యా మెహతా రెండు వెండి పతకాలు సాధించారు.
తన కృత్రిమ కాలును భద్రతా కారణాల రీత్యా పరిశీలించాలని చెప్పిన సీఐఎస్ఎఫ్ అధికారులు ఆ తర్వాత బలవంతంగా బట్టలు తీయించి తనను చూసి నవ్వుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ప్రయాణానికి అనుమతించినట్లు తెలిపారు. తనను ట్రీట్ చేస్తున్న విధానంపై అధికారులను ప్రశ్నించగా వారు అవేమీ పట్టించుకోలేదని అన్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఓ సీఐఎస్ఎఫ్ అధికారి పేరును చెబుతూ ఆయన తీవ్రంగా స్పందించారు. దివ్యాంగులను చెక్ చేసేందుకు డీజీసీఏ ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని లేఖ రాసినట్లు చెప్పారు. రెండు నెలల క్రితం కూడా ఓ ఎయిర్ పోర్టులో ఆదిత్యా మెహతా కృత్రిమ కాలును పరిశీలించారు. కాగా, కృత్రిమ అవయవాలను పరిశీలించడం చెకింగ్ లో భాగమని హైదరాబాద్ లోని డీజీసీఏ కార్యాలయం తెలిపింది.
Advertisement
Advertisement