
బెంగళూరు: హీరో మాధవన్ పోస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కర్ణాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపై మాధవన్ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే అక్కడ ప్రారంభమైన రెండవ టెర్మినల్ పనులను ప్రస్తావించారు. అద్భుతంగా ఉన్నాయంటూ ట్విట్టర్ వేదికగా ఎయిర్‌పోర్టు దృశ్యాలను అభిమానులతో పంచుకున్నారు.
'దేశంలో మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. కెంపెగౌడ అయిర్‌పోర్టులో ఉన్నాను. నమ్మశక్యం కావడం లేదు. ప్రపంచంలోనే అద్భుతమైన మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయి. ఇందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది' అని మాధవన్ అన్నారు.
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు నాలుగు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ పోస్టుపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. 'భారత్ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు' అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ఎంతో అద్భుతమైనదని మోదీ అన్నారు. ప్రపంచ దేశాల విమానాశ్రయాలకు పోటీగా నిలుస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: మీడియా ముందు నోరు జాగ్రత్త.. నేతలకు సోనియా హితవు
Comments
Please login to add a commentAdd a comment