
ఓ పైలట్ తన లంచ్‌బాక్స్‌ను కడగమని జూనియర్ సిబ్బందిని ఆదేశించడంతో పైలట్- సిబ్బంది మధ్య తీవ్ర వాదనకు తెర లేపింది. దీంతో బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం ఏఐ772 సోమవారం గంటకు పైగా ఆలస్యం అయింది. ఈ సంఘటన బెంగళూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పైలట్ మరియు సిబ్బంది ప్రయాణికుల ముందే గోడవకు దిగారు. ఫలితంగా బెంగళూరు-కోల్‌కతా విమానం 77 నిమిషాలు ఆలస్యం అయింది.
ఈ ఘటనపై వైమానిక సంస్థ వెంటనే చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియా ప్రతినిధి ఈ సంఘటనను 'ధృవీకరించి, ఈ విషయం దర్యాప్తులో ఉంది' అన్నారు. ‘కెప్టెన్లు తరచూ క్యాబిన్ సిబ్బందిని మెనియల్ ఉద్యోగాలు చేయమని నెట్టివేస్తారు. కెప్టెన్ మీ యజమాని అయినప్పుడు ఏమి చెప్పగలము. వారిపై ఫిర్యాదులు ఎటువంటి ప్రభావం చూపవు‘ అని క్యాబిన్ సిబ్బంది అన్నారు.