
ఈ ఫొటోలో కూర్చుని ఉన్న అమ్మాయి జోయా అగర్వాల్. ఎయిర్ ఇండియా కెప్టెన్. ఆమె పక్కనే నిలబడి ఉన్నది రతన్ టాటా. న్యూయార్క్ నుండి ఢిల్లీ వస్తున్న బోయింగ్ 777 విమానాన్ని అప్పుడు ఆమె నడుపుతున్నారు. అదే ఫ్లయిట్ లో రతన్ టాటా ఉన్నారు. ఫ్లయిట్ ఢిల్లీ లో దిగగానే ఆయనతో ఒక ఫొటో కావాలని అడిగారు జోయా. ఆయన అంగీకరించారు. ఫొటో కోసం ఆమె లేవబోతుంటే ఆయన వారించారు. ‘ఇది నీ సింహాసనం కెప్టెన్. నువ్వు సంపాదించుకున్నది‘ అని అన్నారు. అలా ఆమె కూర్చొని ఉండగా, ఆమె పక్కన ఆయన నిలబడి ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ అపురూపమైన జ్ఞాపకాన్ని జోయా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ఆ సంఘటన తనను ఎలా ఇన్స్పైర్ చేసిందో రాశారు.
Comments
Please login to add a commentAdd a comment