బెంగళూరు : బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు సుంకం విధించలేదన్న ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు నరసింహస్వామి, సుందరం, విశ్వేశ్వరభట్, ప్రేమ్‌కుమార్, సోమసుందర్, వీరికి సహకరిస్తున్న మరో ముగ్గురు విమానాశ్రయ సిబ్బందిని అరెస్ట్ చేశారు.
వీరి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులతో పాటు రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇండియా కార్గో కాంప్లెక్స్, ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌ల ద్వారా దిగుమతి అయిన వస్తువులను దిగుమతి సుంకం నుంచి తప్పించి బయటకు పంపేవారన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.
బెంగళూరు విమానాశ్రయంలో సీబీఐ దాడులు
Published Sat, Mar 19 2016 7:51 PM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM
Advertisement
Advertisement