cbi raid
-
హైదరాబాద్‌లోని సుజనా గ్రూప్ కార్యాలయం సీజ్
-
ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్ ఇంటిపై సీబీఐ దాడులు
-
బెంగళూరు విమానాశ్రయంలో సీబీఐ దాడులు
బెంగళూరు : బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు సుంకం విధించలేదన్న ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు నరసింహస్వామి, సుందరం, విశ్వేశ్వరభట్, ప్రేమ్‌కుమార్, సోమసుందర్, వీరికి సహకరిస్తున్న మరో ముగ్గురు విమానాశ్రయ సిబ్బందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులతో పాటు రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇండియా కార్గో కాంప్లెక్స్, ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌ల ద్వారా దిగుమతి అయిన వస్తువులను దిగుమతి సుంకం నుంచి తప్పించి బయటకు పంపేవారన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. -
కేజ్రీవాల్ కేబినెట్ మీటింగ్ ఫైల్స్ కూడా..
ఢిల్లీ: సీబీఐ దాడుల్లో తమ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్‌కు సంబంధించిన దస్త్రాలను సైతం సీజ్ చేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు. డీడీసీఏ ఫైల్స్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను సీబీఐ సీజ్ చేసిందన్నారు. సీబీఐ తమకు అవసరం లేనటువంటి ఫైళ్లను ఎందుకు స్వాధీనం చేసుకుందని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ నిర్వహించిన దాడులతో కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం డీడీసీఏ పనితీరుపై దర్యాప్తు జరుపుతుండటం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి భయం కలిగిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అరుణ్ జైట్లీ రాజ్యసభలో సీబీఐ దాడులపై చేసిన ప్రకటన, సభను తప్పుదోవ పట్టించేలా ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజేంద్ర కుమార్ ఆఫీస్‌పై జరిగిన దాడులు కేవలం తనను లక్ష్యంగా చేసుకొనే జరిగాయని అన్నారు. -
'సోదాలకు ఇది సరైన సమయం కాదు'
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరోసారి ధిక్కారస్వరం వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయంపై సీబీఐ దాడులు చేయడాన్ని తప్పుపట్టారు. సీబీఐ సోదాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. దాడులు చేయాల్సిందిగా ఎవరు సలహా ఇచ్చారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో టైమ్ చాలా ముఖ్యమని, దాడులు చేసేందుకు ఇది కచ్చితంగా తగిన సమయం కాదని చెప్పారు. కేజ్రీవాల్‌కు పాపులారిటీనే కాదు మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అంటూ శత్రుఘ్న సిన్హా ప్రశంసించారు. కాగా సీబీఐ దాడుల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీపై కేజ్రీవాల్ వాడిన భాషను శత్రుఘ్న సిన్హా తప్పుపట్టారు. మోదీని పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ నిందించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో ఆప్, బీజేపీ నాయకుల మధ్య మాటలయుద్ధం ముదిరింది. -
ఎమ్మెల్యే ఇంట్లో సీబీఐ సోదాలు
బీహార్‌కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంట్లో సీబీఐ బృందం సోదాలు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం అనంత సింగ్ అధికారిక నివాసంలో సోదాలు చేసిందని పోలీసులు చెప్పారు. ఆయన ప్రస్తుతం ఓ కిడ్నాప్ - హత్య కేసులో జైల్లో ఉన్నారు. ఆయన ఇంట్లో సోదాలకు వచ్చేముందు సీబీఐ బృందం అనంత్ సింగ్‌ను జైల్లో ప్రశ్నించింది. సీబీఐ బృందం స్థానిక పోలీసులను సాయం కోరడంతో.. సీనియర్ ఎస్పీ వికాస్ వైభవ్ ఆ బృందానికి తమ సిబ్బందిని తోడుగా పంపారు. అయితే.. కిడ్నాప్ - హత్య కేసుకు, సీబీఐ సోదాలకు సంబంధం లేదు. అక్రమంగా కాంట్రాక్టులు ఇప్పించడంలోను, దోపిడీ రాకెట్ నడిపించడంలోను ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మీద సీబీఐ విచారణ జరుపుతోంది. బీహార్‌లో శక్తిమంతమైన భూమిహార్ వర్గానికి చెందిన అనంత్ సింగ్.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితుడని చెబుతారు. ఆయనపై డజన్లకొద్దీ క్రిమినల్ కేసులున్నాయి. వాటిలో చాలా హత్య, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. -
ఇన్‌కంట్యాక్స్ కార్యాలయం పై సీబీఐ దాడులు