అరుదైన గౌరవం..మురిసిపోతున్న అనసూయ | Anchor Anasuya Gets Her Own Postal Stamps | Sakshi
Sakshi News home page

అరుదైన గౌరవం: అనసూయ ఫోటోతో పోస్టల్‌ స్టాంప్‌

Published Thu, Feb 11 2021 12:53 PM | Last Updated on Thu, Feb 11 2021 2:17 PM

Anchor Anasuya Gets Her Own Postal Stamps - Sakshi

టాలీవుడ్‌‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు అరుదైన గౌరవం లబించింది. ‘తెలంగాణ చిత్రపురి ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ఆమెను తన సొంత పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. అంతేగాక అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా అనసూయ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా అనసూయ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిత్రపురికి కృతజ్ఞతలు తెలియజేశారు.

స్టాంప్‌ అందుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘జీవితంలో అంతకు మించిన గౌరవం ఏం ఉంటుంది. నా సొంత పోస్టల్ స్టాంపులు. ఇందుకు అర్హురాలు అయ్యేందుకు నేనేం చేశానో నాకు తెలీదు. చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ !! ఈ విలాసానికి ముందే నేను మీ గురించి గర్వపడుతున్నాను. ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నమిది. మీరు చేస్తున్న గొప్ప పనుల కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని మాటిస్తున్నాను’ అని ఉద్వేగానికి లోనయ్యారు అనసూయ.

కాగా చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా స్పూర్తిని నింపే ఎంతో మంది మహిళల ఘనతకు సంబంధించిన కథలను వెల్లడించనుంది. అంతగా ఏం సాధించానో తెలియదని అనసూయ అనడం తన నిరాడంబరతను వ్యక్తం చేస్తోంది. అయితే ఓ సక్సెస్‌ఫుల్‌ వుమెన్‌గా అనసూయకు ఈ గౌరవం లభించడం సరైనదేనని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: నోరుపారేసుకున్న నెటిజన్‌.. అనసూయ గట్టి కౌంటర్‌
స్పెషల్‌ సాంగ్‌ కోసం అనసూయ భారీ రెమ్యునరేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement