స్టాంపుల్లో మోనాలిసా..! | Rare stamp known as the Mona Lisa sets new record at auction | Sakshi
Sakshi News home page

స్టాంపుల్లో మోనాలిసా..!

Published Fri, Jun 20 2014 2:43 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

స్టాంపుల్లో మోనాలిసా..! - Sakshi

స్టాంపుల్లో మోనాలిసా..!

న్యూయార్క్: స్టాంపుల ప్రపంచంలో ‘మోనాలిసా’గా అభివర్ణించే ఒక సెంటు విలువ(సుమారు 60 పైసలు) అయిన ఈ బ్రిటిష్ గయానా పోస్టల్ స్టాంపు.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి ప్రపంచంలోనే అతి ఖరీదైన స్టాంప్‌గా రికార్డు సృష్టించింది.

1856 నాటి ఈ స్టాంపును న్యూయార్క్‌లో సోత్‌బైస్ సంస్థ వేలం వేయగా.. రూ.59 కోట్ల ధర పలికింది. అలాగే సైజు పరంగా ప్రపంచంలోనే అతివిలువైన వస్తువుగా కూడా ఇది రికార్డు సృష్టించింది. అన్నట్టూ.. దీని అసలు ముఖ విలువతో పోలిస్తే.. ఇది అమ్ముడుపోయిన ధర ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా..? జస్ట్ వంద కోట్ల రెట్లు మాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement