న్యూఢిల్లీ: ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుతున్న నేపథ్యంలో వ్యాపార దిగ్గజం ఐటీసీ, తపాలా శాఖ కలిసి మిల్లెట్స్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించాయి. ఐటీసీ హెడ్ (అగ్రి బిజినెస్) ఎస్ శివకుమార్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరి, తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ మంజు కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా చిరుధాన్యాలపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ స్టాంపును తీర్చిదిద్దారు. మిల్లెట్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు ఎస్ శివకుమార్ తెలిపారు. ‘శ్రీ అన్న’ను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కైలాశ్ చౌదరీ ఈ సందర్భంగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment