
గోమతి చిత్రంతో కూడిన తపాలా బిళ్ల
తిరువొత్తియూరు: దోహాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీలో బంగారం పతకం సాధించిన గోమతి పేరుతో తపాళా బిళ్లను బుధవారం విడుదల చేశారు. తిరుచ్చి ముడి కన్నడం గ్రామానికి చెందిన గోమతి ఖతర్‌లోని దోహాలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలో 800 మీటర్ల పరుగు పందెం విభాగంలో బంగారు పతకం సాధించారు. ఈ పోటీలో భారతదేశానికి దక్కిన మొదటి బంగారు పతకం ఇదే కావడం విశేషం. భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టిన క్రీడాకారిణి గోమతికి ప్రోత్సాహకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోమతి విజయానికి చిహ్నంగా ఆమె ఫొటోతో కూడిన రూ.5 విలువ గల తపాలా బిళ్లను విడుదల చేశారు. ఆ తపాలా బిళ్లలో బంగారం పతకం చూపిస్తున్న గోమతి, పక్కన ఎర్రకోట ముద్రింపబడి ఉంది. ఆ తపాలా బిళ్లను తిరుచ్చి తపాలా ప్రధాన కేంద్రం అధికారులు క్రీడాకారిణి గోమతికి అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment