సాక్షి, విశాఖపట్నం: మీకు తెలుసా కాకినాడ కాజాకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కాజాను దక్షిణ భారతంలో ప్రసిద్ధి వంటకంగా పేరుంది. 1891లో తొలిసారిగా ఈ గొట్టం కాజా తయారీ జరిగింది. కోటయ్య అనే ఆయన తొలిసారి ఈ కాజాను తయారు చేశారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది.
ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల ద్వారా కాకినాడ గొట్టం కాజా చరిత్రను తపాలా శాఖ మరోసారి నేటి తరానికి అందించింది. దీంతో పాటు మాడుగుల హల్వా విశిష్టతను సైతం ప్రత్యేక పోస్టల్ కవర్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసిన ఈ హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గోధుమపాలు, నెయ్యి, జీడిపప్పు, బాధం పప్పుS సమాహారంగా మాడుగుల వాసులు ఈ రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఈ హల్వా లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం ఉంది. దీంతో పాటు ఆత్రేయపురం పూతరేకుల విశిష్టతపైనా తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ముంద్రించి ఆ విశిష్టతలను ప్రస్తుత తరానికి అందించింది.
Comments
Please login to add a commentAdd a comment