KOTAIAH
-
'మత్తు' బంధం బహిర్గతం
కిలో కాదు.. రెండు కిలోలు కాదు.. ఏకంగా 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కలగలిసిన డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారం చంద్రబాబు అండ్ గ్యాంగ్ వ్యాపార పునాదులను కదిలిస్తోంది. డ్రగ్స్ కంటైనర్ బ్రెజిల్ నుంచి నౌకలో బయలు దేరడం.. ఆ సమాచారం ఇంటర్‌పోల్ చెవిన పడటం.. వారు సీబీఐకి చేరవేయడం.. హుటాహుటిన సీబీఐ బృందం విశాఖ పోర్ట్‌కు రావడం.. ఆ కంటైనర్‌ను గుర్తించి సోదాలు, పరీక్షలు చేయడం.. అందులో కొకైన్ తదితర డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం కావడం.. అంతా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఇంత భారీ పరిమాణంలో డ్రగ్స్ పట్టుబడిన ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ చంద్రబాబు, ఆయన బంధుగణంపైనే చూపిస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, అమరావతి: విశాఖ డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరికిన చంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన సంధ్యా ఆక్వా కంపెనీ కూనం కోటయ్య చౌదరి వెనుక ఉన్నది తమ కోటరీయేనని ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుట్రకు పదును పెడుతున్నాయి. అందుకే వాస్తవాలను వక్రీకరిస్తూ తమ అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలను, అభూతకల్పనలను ప్రచారంలోకి తెస్తున్నాయి. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా.. ఫ్లెక్సీలను పట్టుకుని రాద్ధాంతం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఆ సాకుతో కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరిలతో దగ్గుబాటి కుటుంబ వ్యాపార బంధాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. సంధ్యా ఆక్వా కంపెనీతో టీడీపీ నేతల వ్యాపార లావాదేవీలు, బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు ఏమీ తెలీనట్లుగా ఓ వర్గం మీడియా నటిస్తోంది. కానీ కోటయ్య చౌదరి డ్రగ్స్ దందాచంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాల మెడకు ఇప్పటికే చుట్టుకుందన్నది బహిరంగ రహస్యం. మసిపూసి మారేడుకాయ చేయాలన్న కుతంత్రాలు బెడిసి కొడుతుండటంతో చంద్రబాబు ఆత్మరక్షణలోపడిపోయారు. అంతా చౌదరి కుటుంబమే.. డ్రగ్స్ దందాలో పాత్రధారులు కూనం కోటయ్య చౌదరి కుటుంబం కాగా, సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ సభ్యులేనన్నది బట్టబయలైంది. బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. కాగా ఈ దందాకు ఆర్థిక, రాజకీయ అండదండలు అందించడం, డ్రగ్స్ భారత్‌కు చేరుకున్నాక మార్కెటింగ్ వ్యూహం అమలు సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ నేతలే కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ వ్యవహారంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యుల వైపే వేళ్లన్నీ చూపుతున్నాయి. అసలు సంధ్యా ఆక్వా కంపెనీ ఏర్పాటులోనే దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం కీలక పాత్ర పోషించింది. ఆమె కుమారుడు దగ్గుబాటి చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగానే ఆ కంపెనీని స్థాపించారు. అనంతరం ఆ కంపెనీని మూడుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాగా ఆ అంతర్జాతీయ స్థాయి వ్యాపారం వెనుక డ్రగ్స్ స్మగ్లింగ్ లోగుట్టు దాగుందన్నది తాజాగా సీబీఐ సోదాల్లో వెల్లడైంది. మరోవైపు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ ముఖ్య నేతలు, వారి వారసులతో సంధ్యా ఆక్వా కంపెనీ కోటయ్య చౌదరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. దామచర్ల సత్య (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లతో ఓ కోటరీగా గూడుపుఠాణి నిర్వహించారన్నది వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు దామచర్ల జనార్ధన్ అత్యంత సన్నిహితుడు కాగా, ఆయన సోదరుడు దామచర్ల సత్య ప్రస్తుతం లోకేశ్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ పచ్చ ముఠా సభ్యులంతా తరచూ విదేశీ పర్యటనలు చేస్తారని.. ఆ ముసుగులో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారని.. కలసి ఎంజాయ్ చేస్తారనే ఫొటోలు సోషల్ మీడియాలో రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. ఆలపాటి రాజాకూ లింకు చంద్రబాబు గీచిన గీత జవదాటరనే పేరున్న ఆలపాటి రాజాకు సంధ్యా ఆక్వా కంపెనీ కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరీలతో ఆరి్థక బంధం ఉందని నిరూపించే పత్రాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ కలసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు నిగ్గు తేలింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లో తమ దందాను విస్తరించిన సంధ్యా ఆక్వా కంపెనీతో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. బాలయ్య చిన్న అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్ కుటుంబం విశాఖలో సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం కోటయ్య చౌదరికి పలు వ్యవహారాల్లో సహకారం అందించింది. భరత్ కుటుంబ సహకారంతోనే విశాఖపట్నంలో సంధ్యా ఆక్వా వ్యాపార కార్యకలాపాలు విస్తరించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి కూడా భరత్ కుటుంబంతో మొదటి నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న తరుణంలోనే భరత్ కుటుంబానికి చెందిన గీతం విద్యా సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించిందన్నది గమనార్హం. ఈ వాస్తవాలు, పరిణామాలన్నీ కూడా డ్రగ్స్ దందాలో పాత్రధారి అయిన సంధ్యా ఆక్వా కంపెనీతో చంద్రబాబు, పురందేశ్వరి కుటుంబాలు, కోటరీలకు సన్నిహిత సంబంధాలున్నాయని స్పష్టంచేస్తున్నాయి. పచ్చ గ్యాంగ్ నాడు అలా.. నేడు ఇలా భారీ డ్రగ్స్‌ను విశాఖ పోర్టుకు తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోయిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే కొరడా ఝుళిపించింది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పాటించకుండానే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్(సీఎఫ్ఈ) కోసం విజయవాడలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జోనల్ కార్యాలయానికి సంధ్యా ఆక్వా దరఖాస్తు చేసింది. దీనిపై విచారణ జరపగా ఆ కంపెనీ నిబంధనలేమీ పాటించలేదని తేలింది. దీంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు 2019 సెపె్టంబర్ 18న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేస్తూ కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. నిజానికి అంతకు ముందు కూడా దరఖాస్తు చేయగా తిరస్కరించామని, ఇదే కంపెనీ అదే మళ్లీ అలానే దరఖాస్తు చేసినందున తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. సంధ్యా ఆక్వాలో నీరు, గాలి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, వ్యర్థాలను శుద్ధి చేయడానికి తగినంత భూమి వారి వద్ద అందుబాటులో లేదని తెలిపింది. వ్యర్థాలను సమీపంలోని కాలువలో వదిలేస్తున్నట్లు తాము గుర్తించామని ఆర్డర్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పొల్యూషన్ బోర్డు అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. అప్పటికే ఏవైనా కార్యకలాపాలు ప్రారంభించి ఉంటే వెంటనే వాటన్నింటినీ నిలిపివేయాలని కూడా హెచ్చరించింది. దీనిని బట్టి సంధ్యా ఆక్వా అక్రమాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందనేది సుస్పష్టం అవుతోంది. అలాంటప్పుడు ఇంతలా చర్యలు తీసుకున్న ప్రభుత్వంపై బురదజల్లడానికి పచ్చ గ్యాంగ్, పచ్చ మీడియా విఫలయత్నం చేస్తోంది. తమ సన్నిహిత సంస్థ అని ఆ రోజు భుజానకెత్తుకుని, ఈ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదంటూ రచ్చ చేసిన టీడీపీ, ఎల్లో మీడియా.. ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం బయట పడేసరికి ప్లేటు ఫిరాయించాలని చూస్తోంది. కానీ నిందితులంతా టీడీపీ పెద్దలకు అత్యంత ఆప్తులనే విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నది టీడీపీ యత్నం డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో తమ వ్యవహారం బట్టబయలు కావడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు తానేం చేస్తున్నారో గుర్తించలేకపోతున్నారు. అయోమయానికి గురై వైఎస్సార్సీపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ తానే అడ్డంగా దొరికిపోతున్నారు. కూనం ప్రభాకర్ చౌదరి ఫొటోలు ఉన్న ఓ ఫ్లెక్సీని చూపిస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేసేందుకు యత్నిస్తున్నారు. ఆయన ఈ ఏడాది సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామంప్రకాశం జిల్లాలోని ఈదుమూడి వెళ్లారు. ఆ సందర్భంగా పార్టీలకు అతీతంగా కుటుంబ వ్యవహారంగా ఆ గ్రామస్తులు వేసిన ఫ్లెక్సీలో కూనం ప్రభాకర్ చౌదరి ఫొటోలు వేశారు. అదేమీ వైఎస్సార్సీపీ రాజకీయ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం అంత కంటే కాదు. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ గ్రామస్తులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అది. అందులో ఎక్కడా వైఎస్సార్సీపీ పేరు కూడా లేదు. అయినా ఆ ఫ్లెక్సీలో ఫొటో ఉంది కాబట్టి కూనం ప్రభాకర్ చౌదరి వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అంటూ టీడీపీ దు్రష్పచారం చేస్తుండటం విడ్డూరం. డ్రగ్స్ దందాలో నిండా మునిగిన చంద్రబాబు ఈ ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా భావిస్తుండటం హాస్యాస్పదంగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆ కంటెయినర్‌ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్‌పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్‌ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్‌తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్‌నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్‌ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్‌బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్‌ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్‌ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్‌తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్‌ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్‌ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్‌ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్‌ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్‌ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్‌ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్‌లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్‌ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్‌ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్‌ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
'మత్తు' చుట్టూ చుట్టాలే
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఒంగోలు/గాంధీ నగర్ (విజయవాడ సెంట్రల్)/ పిఠాపురం/ చీరాల/ విశాఖ సిటీ/ సాక్షి ప్రతినిధి,గుంటూరు: విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ దందాలో వేళ్లన్నీ టీడీపీవైపే చూపుతున్నాయి. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్‌ను దిగుమతి చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, అధిపతి కూనం కోటయ్య చౌదరి టీడీపీలో ప్రముఖులైన నారా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామచర్ల, లావు కుటుంబాలకు అత్యంత సన్నిహితులన్నది బహిర్గతమైంది. డ్రగ్స్ మాఫియా బండారం బట్టబయలు కావడంతో బెంబేలెత్తిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి దిగి విషయాన్ని పక్కదారి పట్టించాలని కుట్ర పన్నారు. ఈ అంకంలో భాగంగా ఒకపక్క సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతుండగానే గురువారం రాత్రే చంద్రబాబు, లోకేశ్ వరుస ట్వీట్లు చేస్తూ టీడీపీ శ్రేణులతోపాటు టీడీపీ అనుకూల మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలు, అభూత కల్పనలు జోడిస్తూ దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా డ్రగ్స్ దందా వెనుక తాము ఉన్నామనే విషయాన్ని కప్పిపుచ్చవచ్చని చంద్రబాబు భావించారు. అయితే కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతల వ్యాపార బంధం వెలుగు చూడటంతో బాబు కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబంతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. రాయపాటి, దామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు ఉన్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదురుతుందనే సంకేతాలు అందిన వెంటనే బ్రెజిల్ నుంచి భారీగా డ్రగ్స్ దిగుమతికి తెర తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం గమనార్హం. కింగ్ పిన్ కోటయ్య చౌదరి.. డ్రగ్స్ దందాలో కీలక పాత్రధారులైన సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితులని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆయన సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల జాబితాను చూస్తే ఆ విషయం తేలిపోతోంది. దామచర్ల సత్యం (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారంతా ఓ కోటరీగా పెద్ద ఎత్తున వ్యవహారాలు సాగించారన్నది వెల్లడైంది. వారు విదేశాల్లో అత్యంత సన్నిహితంగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దామచర్ల సత్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం ఉంది. సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరితోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆలపాటి రాజాకు వ్యాపార బంధం ఉంది. వారిద్దరూ సంతకాలు చేసిన పలు పత్రాలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాఖ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న సంధ్యా ఆక్వా కంపెనీకి నందమూరి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్‌కు కూనం కోటయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు. ఆయన కుటుంబం సహకారంతోనే విశాఖ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సంధ్యా ఆక్వా కంపెనీతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్నది ఇప్పటికే బయటపడింది. పురందేశ్వరి కుమారుడు చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగా కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి ఆక్వా వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో డ్రగ్స్ దందాలో తీగ లాగితే చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి కోటరీ అక్రమాల డొంకంతా కదులుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ.. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో మద్యం కుంభకోణానికి పాల్పడిన సిండికేట్‌లో ఆ కంపెనీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఆ కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు విశాఖ డ్రగ్స్ దందాను కూడా కలిపి మొత్తంగా మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో నిమగ్నమైంది. పొత్తుతోనే బరితెగింపు.. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎప్పుడో సిద్ధపడ్డారు. అందుకోసం కాళ్ల బేరానికి కూడా దిగజారతానని గతేడాదే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తును అవకాశంగా చేసుకుని భారీగా డ్రగ్స్ దందాకు పచ్చ మాఫియా బరితెగించింది. ఎన్నికల ముందు భారీగా డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తరలించేందుకు పథకం వేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సంధ్యా ఆక్వా కంపెనీ ద్వారా బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల ఈస్ట్ దిగుమతి ముసుగులో భారీగా డ్రగ్స్‌ను చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రెండు నెలల్లో డ్రగ్స్ విశాఖ చేరుకునేలా అంతా సిద్ధమైంది. అటు దగ్గుబాటి ఇటు చంద్రబాబు కుటుంబాలు సహకారం ఉండటంతో తమ దందాకు అడ్డు ఉండదని భావించారు. డ్రగ్స్ మాఫియాపై అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌కు ఉప్పందడంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం విశాఖ పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ బాగోతం బట్టబయలైంది. పచ్చ కుట్ర బెడిసికొట్టింది. ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ తక్షణమే ప్రతి స్పందించింది. డ్రగ్స్ దందాతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు ఉన్న బంధాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నియమావళిని ఉల్లంఘిస్తూ చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో నివేదించింది. దీనిపై జాతీయ ప్రెస్ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. డ్రగ్స్ దందాపై సత్వరం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి పాత్రధారులతోపాటు సూత్రధారులను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసింది. కూనం కుటుంబం కథ... విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులైన సంధ్యా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అధినేతలు కూనం వీరభద్ర చౌదరి, కుమారుడు కూనం కోటయ్య చౌదరి స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి. ఆక్వా రంగంలో ఉత్థాన పతనాలను చూసిన వీరభద్ర చౌదరి డ్రగ్స్ వ్యాపారంలో కాలు మోపాడు. కాకినాడ ప్రధాన కేంద్రంగా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్ల ముసుగులో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అటు టీడీపీ ఇటు రాష్ట్ర బీజేపీ అగ్రనేతల అండదండలతో తన కార్యకలాపాలను విస్తరించాడు. కూనం కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంధ్యా ఆక్వా ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్లతో పాటు ఆక్వా కల్చర్ చెరువులు కూడా ఉన్నాయి. వీరి వ్యాపార లావాదేవీలు కొండపి, ఒంగోలు, కందుకూరు, పర్చూరు నియోజకవర్గాల్లోనూ సాగుతున్నాయి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్యనారాయణ(సత్య)తో కూనం కుటుంబానికి వ్యాపార లావాదేవీలున్నాయి. టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో దామచర్ల సత్యకు చెందిన పొగాకు గోడౌన్లో సంధ్యా ఆక్వా పేరుతో ప్రీ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటైంది. కూనం కుటుంబానికి విజయవాడకు చెందిన సౌమ్యుడిగా పేరున్న ఓ టీడీపీ నేతతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. కోటయ్య చౌదరి, టీడీపీ నేత తనయుడు తనయుడు విదేశాల్లో మంచి సన్నిహితులని తెలిసింది. కాకినాడ తీరంలో కలకలం డ్రగ్స్ తీగ లాగితే కాకినాడ జిల్లా కొత్తపల్లి తీరంలోని మూలపేటలో డొంక కదిలింది. మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 10 మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు జరిపారు. సీబీఐ ఇన్స్పెక్టర్ బల్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం ఈ తనిఖీలు చేసింది. జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి సమీపాన ఉన్న సంధ్య ఆక్వా సీడ్ తయారీ కంపెనీ, కృష్ణా జిల్లా పామర్రు తదితర ప్రాంతాల్లో ఉన్న సంధ్య ఆక్వా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెబుతున్నారు. కత్తిపూడి సమీపంలోని సంధ్య ఆక్వా సీడ్ కంపెనీని ఇటీవలే ప్రారంభించారు. దీనిలో ఆక్వా సీడ్ తయారీకి అవసరమైన ముడి సరుకును బ్రెజిల్ నుంచి దిగుమతి చేయడంతో ఆ సరకు నౌక ద్వారా విశాఖకు కంటైనర్లలో చేరింది. వాటిలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు సంధ్య కంపెనీలన్నింటిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించి మందులు, ఇతర శాంపిల్స్ సేకరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అధికారులు తిరిగి సోదాలు చేస్తామని తెలిపారు. చీరాలకు లింకు? డ్రగ్స్ దందాకు చీరాలతో కూడా లింకులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సంధ్యా ఆక్వా పేరుతో వాడరేవులో గత రెండేళ్లుగా కంపెనీ నడుస్తోంది. దీన్ని పురందేశ్వరి అల్లుడు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. గత పది రోజులుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయని సమాచారం. మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్ పరీక్ష డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం మరికొన్ని శాంపిల్స్‌ను పరీక్షించగా ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో న్యాయమూర్తి సమక్షంలో 25 వేల కేజీల సరుకుతో కూడిన కంటైనర్‌ను సీజ్ చేశారు. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి రవాణా నౌక ద్వారా విశాఖకు వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19, 20వ తేదీల్లో 49 బ్యాగుల్లో శాంపిల్స్‌ను పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో ఈ నెల 21వ తేదీన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం మరోసారి వీసీటీపీఎల్కు వెళ్లి మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్‌ను పరీక్షించారు. వాటి ఫలితాలు కూడా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. న్యాయమూర్తి సమక్షంలో రికార్డులతో పాటు శాంపిల్స్‌ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి సమక్షంలోనే బ్యాగులను సీజ్ చేశారు. మరికొన్ని సీబీఐ బృందాలు సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోమరిన్ని ఆధారాలతో సీబీఐ అధికారులు త్వరలోనే అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘ఆలపాటి’ ఆర్థిక బంధం విశాఖ డ్రగ్స్ కేసులో కీలక పాత్రధారి కూనం వీరభద్ర చౌదరి(వీరభద్రరావు)తో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఉన్న ఆర్థిక సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఆలపాటి రుణాలకు కూనం సెక్యూరిటీ ఇవ్వడంతోపాటు ఎన్ఆర్ఐ అకాడమీతో భాగం పంపిణీ చేసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. 2015 అక్టోబరు 31న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు అరండల్‌పేట విజయా బ్యాంకు బ్రాంచ్‌లో రూ.2 కోట్లు రుణం (దస్తావేజు నంబరు 11158/2015) తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 9న మరో రూ.12 కోట్లు అదే బ్యాంకు నుంచి రుణాన్ని పొందారు. దీనికి ఆలపాటి రాజా భార్య ఆలపాటి మాధవితోపాటు కూనం వీరభద్రరావు, ఎన్ఆర్ఐ అకాడమీ ఆస్తులను (దస్తావేజు నంబరు 12521/2015) తనఖా పెట్టారు. 2021లో కూనం వీరభద్రరావుకు ఎన్నారై అకాడమీకి సంబంధించి పార్టీషన్ దస్తావేజు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. కూనం వీరభద్రరావు తమ ఆస్తులను తనఖా పెట్టి 2017లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు రుణాన్ని ఇప్పించారు (దస్తావేజు నంబరు 4581/2017). ఇదే దస్తావేజును 2021లో (నంబరు 12205/2021) రద్దు చేసుకున్నారు. దీంతోపాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా వీరిద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. -
విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్...'కేరాఫ్ కోటయ్య చౌదరి'
విశాఖ సిటీ/ సాక్షి, అమరావతి: అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎవరిదీ కంటైనర్.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన ‘జిన్ లియన్ యన్ గ్యాంగ్’ కంటైనర్ నౌక ఈ నెల 16వ తేదీ రాత్రి 9.30 గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది. అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డ్‌లో అన్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ షిప్‌లోని ఎస్‌ఈకేయూ 4375380 నంబర్ గల కంటైనర్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్‌పోల్ నుంచి ఒక ఈ–మెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్ శర్మకు అప్పగించారు. సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఉమేష్‌కుమార్‌తో పాటు మరో డీఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్‌తో ఈ నెల 19వ తేదీ ఉదయం 8.15 గంటలకు విశాఖ చేరుకుంది. విశాఖ సీబీఐ డీఎస్పీ సంజయ్‌కుమార్ సమల్‌తో కలిసి విశాఖ పోర్టు విజిలెన్స్, కస్టమ్స్ అధికారుల సహకారంతో పోర్టులో తనిఖీ చేపట్టారు. ఇంటర్‌పోల్ సమాచారమిచ్చిన నంబర్ గల కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎన్.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్ కుమార్‌ను రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. కంటైనర్‌లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగ్‌లు మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని చెప్పారు. దీంతో కంటైనర్ తెరిచి చూడగా లోపల 20 బాక్సులలో వెయ్యి బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బాక్స్ నుంచి ఒక్కో బ్యాగ్‌ను కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే బయటకు తీశారు. ఆ బ్యాగుల్లో పచ్చ రంగులో ఉన్న పౌడర్‌ను నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించారు. 20 బ్యాగుల్లో పౌడర్‌ను పరీక్షించిన సీబీఐ అధికారులు విస్తుపోయారు. ఈ పౌడర్‌లో కొకైన్, మెథాక్వాలోన్, ఓపియం, మారిజోనా, హాషిష్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లు రెండు వేర్వేరు పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. తాము తొలిసారిగా వీటిని దిగుమతి చేసుకున్నామని, అందులో ఉన్న పదార్థాల గురించి తమకు తెలియదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తిరిగి సీబీఐ బృందం 20వ తేదీ ఉదయం 10.15 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకొని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కూనం హరికృష్ణ, ఇతరుల సమక్షంలో మరికొన్ని బ్యాగులను పరీక్షించారు. అన్నింటిలోను మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించగా.. వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంధ్యా ఆక్వా అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించింది. అనుమతి లేకుండా ఈక్విడార్ దేశం నుంచి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేశారని తేలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత చట్టాలు అనుమతించవు. కానీ ఆ చట్టాన్ని సంధ్యా ఆక్వా ఎండీ కూనం వీరభద్రరావు చౌదరి బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. దాంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కూడా ఉల్లంఘించినట్టు తనిఖీల్లో వెల్లడైంది. ఏకంగా 16 ఉల్లంఘనలను గుర్తించి కేసు నమోదు చేసి సంధ్యా ఆక్వా కంపెనీని సీజ్ చేశారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఆ ఏడాది జూలై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. -
ఆ స్వీటుకు అంతర్జాతీయ గుర్తింపు, వందేళ్లకు పైగా చరిత్ర.. తాజాగా మరో గుర్తింపు!
సాక్షి, విశాఖపట్నం: మీకు తెలుసా కాకినాడ కాజాకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కాజాను దక్షిణ భారతంలో ప్రసిద్ధి వంటకంగా పేరుంది. 1891లో తొలిసారిగా ఈ గొట్టం కాజా తయారీ జరిగింది. కోటయ్య అనే ఆయన తొలిసారి ఈ కాజాను తయారు చేశారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది. ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల ద్వారా కాకినాడ గొట్టం కాజా చరిత్రను తపాలా శాఖ మరోసారి నేటి తరానికి అందించింది. దీంతో పాటు మాడుగుల హల్వా విశిష్టతను సైతం ప్రత్యేక పోస్టల్ కవర్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసిన ఈ హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గోధుమపాలు, నెయ్యి, జీడిపప్పు, బాధం పప్పుS సమాహారంగా మాడుగుల వాసులు ఈ రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఈ హల్వా లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం ఉంది. దీంతో పాటు ఆత్రేయపురం పూతరేకుల విశిష్టతపైనా తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ముంద్రించి ఆ విశిష్టతలను ప్రస్తుత తరానికి అందించింది. చదవండి: కాళ్లకు తాడు కట్టుకుని బావిలో ఈత.. ఎలా సాధ్యం? -
రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి
కోట/నెల్లూరు (అర్బన్): కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు తీసుకుని కరోనా నుంచి కోలుకున్నానని చెప్పిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడికి చెందిన విశ్రాంత హెచ్ఎం బైనా కోటయ్య(62) సోమవారం మృతి చెందారు. ఆ మందు కరోనాకు బాగా పని చేస్తుందంటూ కోటయ్య మాటల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఈ నెల 22న ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్ల సూచనల మేరకు కుటుంబ సభ్యులు నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ‘ఊపిరితిత్తులు క్షీణించడంతోనే.. ’ కోటయ్యకు ఆస్పత్రికి వచ్చేటప్పటికే ఊపిరితిత్తులు 80 శాతం వరకు దెబ్బతిన్నాయని పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ సోమవారం చెప్పారు. ఆనందయ్య మందు తీసుకున్న తరువాత నాలుగు రోజులకు కోటయ్య ఆరోగ్యం బాగలేదంటూ పెద్దాస్పత్రిలో చేరాడని చెప్పారు. అప్పటికే కోటయ్య మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా ఉండటంతో తాము మరింత కేర్ తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో తాము చేసిన వైద్యం వల్ల కొంత మెరుగైనప్పటికీ మళ్లీ ఆరోగ్యం విషమించి మృతి చెందాడని తెలిపారు. -
కోటయ్య కేసు.. నీరుగారుస్తున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: పోలీస్ శాఖ, ప్రభుత్వంపై మచ్చ తెచ్చే ఏ కేసునైనా ప్రభుత్వ పెద్దలు రాజకీయం చేసి నీరుగారుస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొండవీడు ఉత్సవాల్లో భాగంగా సీఎం సభ నేపథ్యంలో మృతి చెందిన బీసీ కౌలు రైతు కోటేశ్వరరావు కేసు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం నిలిచింది. పోలీసుల దాడిలోనే కోటేశ్వరరావు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘రైతు మృతికి పోలీసుల తప్పో లేక ఇంకోటో కావచ్చు. ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తాం’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రకటించారు. సాక్షాత్తూ సీఎం నోటి నుంచి రైతు మృతుకి పోలీసుల ప్రవర్తన కారణం కావచ్చు అని వచ్చినప్పటికీ పోలీసులు పారదర్శకంగా కేసు దర్యాప్తు చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు చేయకుండానే ఆత్మహత్యని ప్రకటన ఓ వైపు రైతు కోటేశ్వరరావు పోలీసుల దాడిలో మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఘటన స్థలంలో గొడవ జరిగినట్టు బొప్పాయి చెట్లు విరిగిపోయి కనిపిస్తున్నాయి. బొప్పాయి తోటలోనే పోలీసులు మద్యం తాగి, పేకాడినట్టు పేక ముక్కలు, మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ కేసు దర్యాప్తు మాత్రం పోలీసుల తప్పులేదన్న కోణంలోనే సాగుతోంది. ఎటువంటి దర్యాప్తూ చేయకముందే కోటేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని సాక్షాత్తూ జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు నిర్ధారించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించిన తరువాత డీఎస్పీతో విచారణ చేయిస్తామని ఎస్పీ ప్రకటించి ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ ఉన్నతాధికారే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించిన తరువాత డీఎస్పీ నిస్పక్షపాతంగా దర్యాప్తు ఎలా చేస్తారని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల రాజకీయం.. సీఎం పర్యటన సందర్భంగా కోటేశ్వరరావు పోలీసుల దాడిలో మరణించాడని విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలుగుతుందని టీడీపీ పెద్దలు భావించారు. వెంటనే రైతు మృతిని రాజకీయం చేయడం మొదలుపెట్టారు. దీనికితోడు కేసులో ప్రత్యక్ష సాక్షి, కౌలు రైతు కోటేశ్వరరావు పాలేరు పున్నారావు ఘటన జరిగిన మరుక్షణం నుంచి మాయమై, మంత్రి ప్రెస్మీట్లో ప్రత్యక్షమవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ప్రెస్‌మీట్ అనంతరం పున్నారావు తిరిగి కనిపించడంలేదు. ఈ తీరు చూస్తుంటే పున్నారావును బెదిరించి కేసును తొక్కిపట్టే ప్రయత్నాల్లో భాగంగానే టీడీపీ నాయకులు అతడిని నిర్బంధించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.(కోటయ్య ఫోన్ ఎందుకు మాయం చేశారు?) బాధ్యత గల మంత్రి ప్రత్తిపాటి సైతం తన నియోజకవర్గంలో జరిగిన రైతు మృతిపై పూర్తి విచారణ జరపాల్సిందిపోయి, హెలీప్యాడ్ స్థలం అతనిది కాదంటూ కేసును పక్కదారి పట్టిం చేలా మాట్లాడటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తండ్రి పురుగుమందు తాగినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదని కోటేశ్వరరావు కుమారుడు వీరాంజనేయులు మొత్తుకుంటున్నారు. అయితే పోలీసులు మా త్రం కోటేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు అతని కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో వెపు ఈ ఘటనపై ఎస్పీ స్పందించిన తీరుకు, సిబ్బంది చెబుతున్న మాటలకు పొంతన కుదురడంలేదు. రైతును రక్షించే సమయంలో అతని కుమారుడు ఘటన స్థలంలో ఉన్నాడని పోలీసులు చెబుతుంటే, మృతుని కుమారుడు మాత్రం పోలీసులే తన తండ్రి మృతదేహాన్ని రోడ్డుపైకి ఎదురు తెచ్చిచ్చారని స్పష్టంచేస్తున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు సర్వత్రా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కోటేశ్వరరావు భార్య ప్రమీలను ఓదార్చుతోన్న వైఎస్సార్సీపీ చిలకలూరి పేట సమన్వయకర్త విడదల రజని(ఫైల్) కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది? -
రైతు ఉసురు తీసిందెవరు?
చేనుకు చీడ పడితే రైతు కలత పడతాడు. నెత్తురును చెమటచుక్కలుగా మార్చి సాదుకుంటున్న పంట పొలాన్ని రక్షించుకోవడానికి తాపత్రయపడతాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొత్త పాలెం గ్రామంలో తన పొలం మీదికి పోలీసులొచ్చారని విన్నప్పుడు రైతు కోటేశ్వరరావు అంతే కంగారుపడ్డాడు. ఆదరాబాదరాగా అక్కడికెళ్లిన ఆ రైతు కాసేపటికే తన కుమారుడికి ఫోన్ చేసి ‘పోలీసులు కొడుతున్నార’ంటూ ఆర్తనాదాలు చేశాడు. అటు తర్వాత కొద్దిసేపటికే విగతజీవుడిగా మారాడు. ల్యాండ్ పూలింగ్తో మొదలుపెట్టి గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎదుర్కొం టున్న వేధింపుల పరంపరలో ఈ ఉదంతం అత్యంత క్రూరమైనది. ముక్కారు పంటలతో, పచ్చని పరిసరాలతో మెరిసే ప్రాంతాన్ని రాజధాని అమరావతి పేరు చెప్పి కాంక్రీటు కీకారణ్యంగా మార్చ డానికి అంకురార్పణ చేసింది మొదలు ఆ రాష్ట్రంలో రైతు కంట కన్నీరు తప్పడం లేదు. ఇంతకూ రైతు కోటేశ్వరరావు చేసిన నేరమేమిటి? సోమవారం కొండవీడు కోటలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పాల్గొన్న బహిరంగసభకు వాహనాల పార్కింగ్ కోసం పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా తీసుకున్న పోలీసులు అందులోని బొప్పాయి తోటను నాశనం చేశారు. దీన్ని ప్రత్య క్షంగా చూసి తట్టుకోలేక ‘ఇదేం అన్యాయమ’ని నిలదీయడమే ఆ రైతు చేసిన నేరం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన ప్రజాప్రస్థానాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ‘యాత్ర’ చిత్రంలో ఒక దృశ్యం అందరినీ కదిలించింది. పంటకు గిట్టుబాటు ధర లభించక నిరాశ చెందిన ఒక రైతు తన కంఠానికి ఉరి బిగించుకున్నప్పుడు అక్కడున్నవారంతా అతడిని ఆదరా బాదరాగా ఆసుపత్రికి చేరుస్తారు. అతడి ప్రాణాలు నిలబడినా మాట పడిపోతుంది. ఏదో చెప్పాలని తాపత్రయపడి చెప్పలేకపోతున్న ఆ రైతుకు వైఎస్ పాత్రధారి ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ ‘నేను విన్నాను... నేను ఉన్నాను’ అని భరో సాగా మాట్లాడతాడు. కానీ చంద్రబాబు రాజ్యంలో రైతు కోటేశ్వరరావుకు ఆ అదృష్టం లేక పోయింది. నిక్షేపంలా ఎంతో ఆరోగ్యంతో ఉన్న కోటేశ్వరరావు పోలీసుల చేతుల్లో దెబ్బలు తినడమే కాదు... అయినవారు వచ్చేసరికి కొన ఊపిరితో మిగిలాడు. ఆయన్ను వాహనంలో ఆసుపత్రికి తర లించడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా పోలీసులు వమ్ము చేశారు. సకాలంలో వైద్యం అందివుంటే ఆయన జీవితం నిలబడేదేమో! కానీ అందుకు ప్రభుత్వమే అవరోధంగా నిలబడింది. తండ్రికి వైద్యం చేయించేందుకు తీసుకెళ్తామని ప్రాధేయపడిన అతడి కుమారుడితో ‘సీఎం వచ్చే సమ యమైంది కనుక ఇప్పుడు కుదరద’ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా చెప్పారు. అంతా అయ్యాక కోటేశ్వ రరావు ఆత్మహత్య చేసుకున్నాడని బహిరంగసభ వేదికపై నుంచి చంద్రబాబు ప్రకటించడమే కాదు... అందుకు పోలీసుల వైఖరో, కుటుంబసమస్యలో కారణం కావొచ్చునని కూడా చెప్పారు. పనిలో పనిగా– సమస్యలుంటే పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవద్దని హితవు కూడా పలికారు! ఆయన ఎంతో ఉదారంగా రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించడానికి చాలాముందే అధి కారులు రూ. 3 లక్షలిస్తామని కుటుంబంతో బేరసారాలకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు చేస్తున్న తర్కం వింతగా ఉంది. ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే భుజంపై మోసుకెళ్లి రక్షించేందుకు ప్రయత్నించామని, ఇందుకు తమపైనే అభాండాలు వేస్తున్నారని వారు వాపోతున్నారు. వారికి ఉద్యోగం చేయాలంటేనే భయంగా ఉందట! పోలీసుల నైతిక సై్థర్యం దెబ్బతింటే సమాజమే కుప్పకూలుతుందని కూడా వారు సెల విస్తున్నారు. కానీ ఏది చెప్పినా అతికినట్టుండాలి. 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో బొప్పాయి, మునగ, కనకాంబరం తోటల్ని సాగుచేస్తూ అప్పులే లేని కోటేశ్వరరావుకు ఉన్నట్టుండి జీవితంపై ఎందుకు విరక్తి కలిగింది? తన పొలం పాడుచేస్తున్నారన్న కబురందుకుని వెళ్లినవాడు పోలీసులు కొడుతున్నారంటూ ఎందుకు ఫోన్ చేయాల్సివచ్చింది? పురుగుమందు తాగినవారి నోటివెంబడి నురుగలొస్తాయి. కానీ కోటేశ్వరరావు భౌతికకాయంపై నోటివద్ద పురుగుమందు పోసి నట్టుగా ఎందుకుంది? కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఆయనతోపాటున్న జీత గాడు పున్నారావు వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారం ఎందుకీయలేకపోయాడు? అతడిని పోలీసులు తమ వాహనంలో ఎందుకు బంధించాల్సివచ్చింది? అసలు చావుబతుకుల్లో ఉన్న కోటేశ్వరరావును ఆసుపత్రి వరకూ తరలించకుండా మధ్యలోనే ఒక చెక్‌పోస్టు దగ్గర పోలీ సులు ఎందుకు విడిచిపెట్టారు? పక్కనే ఉన్న హెలిపాడ్ సమీపంలో అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది ఉండగా... దూరంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులు ఎందుకునుకున్నారు? ఇంతకూ బాధితుడి సెల్‌ఫోన్ ఏమైంది? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. అడిగితే ‘మా ఆత్మసై్థర్యం దెబ్బతిం టుందిసుమా’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులకు కొత్త కావొచ్చుగానీ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రాంత పల్లెలు అనునిత్యం ఇలాంటి దౌర్జన్యాలనే చవిచూశాయి. పీపుల్స్‌వార్ పార్టీని అణిచివేసే పేరిట పోలీసులు, వారి మద్దతుతో నయీముద్దీన్ వంటి ప్రైవేటు గూండాలు ఆరోజుల్లో సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. గత నాలుగేళ్లుగా ఏపీలో ఈ పోకడలే కనిపిస్తున్నాయి. అందుకే ‘గుర్తు తెలియని వ్యక్తులు’ అరటి తోటలకు నిప్పు పెట్టడం మొదలుకొని అన్ని రకాల వింతలూ అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రైతు ఉసురు తీసిన ఉదంతంలో సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు. అది నిష్పాక్షికంగా సాగాలంటే ఆరోపణలొచ్చినవారందరినీ సస్పెన్షన్‌లో ఉంచాలి. రైతు మరణంపై మర్కట తర్కం చేస్తున్న ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇంతకుమించిన దోవ లేదు. -
కోటయ్య ఫోన్ ఎందుకు మాయం చేశారు?
సాక్షి, గుంటూరు : బీసీ రైతు కోటయ్యను చంపేశారనడానికి వంద ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది. చంద్రబాబు సర్కారే కోటయ్యను చంపేసిందని, ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ, మంత్రి నారా లోకేష్ చెబుతున్నదానికి పొంతన లేదని వ్యాఖ్యానించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్థారణ కమిటీ బుధవారం పుట్టకోటలో పర్యటించిన.. కోటయ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించింది. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ...‘వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీని పర్యటించకుండా అడ్డుకుంటున్నారు. కోటయ్య కుటుంబసభ్యులపై సామ,దాన,భేద, దండోపాయాలు ప్రయోగించారు. రైతుల పొలానికి, సీఎం హెలీపాడ్‌కు సంబంధం లేదని లోకేష్ అంటున్నారు. మరోవైపు కోటయ్య అనుమతితోనే పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టామని నిన్న ఎస్పీ చెప్పారు. లోకేష్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో వివరణ ఇవ్వాలి. కోటయ్యను రక్షించే క్రమంలో విద్యుత్ విభాగానికి చెందిన వాహనం పొలంలో కొద్దిమేర తొక్కిందని ఎస్పీ చెప్పారు. బొప్పాయి తోటలో పోలీసులు కాయలు కోస్తే కోసుండొచ్చని ఎస్పీ చెప్పారు. దీన్నిబట్టి పోలీసులు పొలంలోకి ప్రవేశించారని అర్థం అవుతోంది. లోకేష్ మాత్రం కోటయ్యకు పొలమే లేదంటున్నారు. పంట నష్టపోతే రైతు ప్రశ్నించకుండా ఉంటాడా?. కోటయ్య మద్యానికి బానిసని, మరో మహిళతో పరిచయం ఉందని, అందుకే మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు. కోటయ్యను కొట్టారని కుటుంబసభ్యులు నిన్న మీడియాకు చెప్పారు. పోలీసుల భుజాలపై తీసుకెళ్లింది కోటయ్య శవాన్ని మాత్రమే. బతికున్న మనిషిని ఎవరైనా పరిగెత్తుకుంటు తీసుకెళ్తారా?. ముఖ్యమంత్రి సభ ఉంటే..అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరి పోలీసులు భూజాన వేసుకుని పరిగెత్తాల్సిన అవసరం ఏంటి?. కోటయ్య మృతదేహాన్ని పోలీసు జీపులోనే ఎందుకు పెట్టారు?. అతడిని తీసుకెళ్లిప్పుడు దుస్తులు.. గ్రామస్తులకు అప్పగించిన దుస్తులు మధ్య తేడా ఉంది. కోటయ్య దగ్గర పనిచేస్తున్న పున్నారావును పోలీసులు ఎందుకు బెదిరించారు. కోటయ్య, పున్నారావు ఫోన్లు ఎందుకు మాయం చేశారు. కోటయ్య అర ఎకరం ఇచ్చారని ఓసారి, 4 ఎకరాలు ఇచ్చారని మరోసారి పోలీసులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. జ్యుడీషియల్ విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు. -
ఇంతకీ శవం ఎవరిదయ్యా లోకేష్?
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం సభ సందర్భంగా పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఓ అన్నదాత బలైపోతే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ వర్గాలు నిస్సిగ్గుగా సాగిస్తున్న దుష్ప్రచారంపై విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా నిప్పులు చెరిగారు. ‘కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్లాలా?. హెలిప్యాడ్ కోసం రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు హెలిపాడ్ కోసం కోటయ్య అనే రైతును దారుణంగా కొట్టి చంపిన ఘటనపై పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి. ఇది ప్రభుత్వం చేసిన క్రూర హత్య. చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలి. మృతుడు పిట్టల కోటయ్య కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. సిఎం, డిజిపిలను బాధ్యులుగా చేసి దర్యాప్తుకు ఆదేశించాలి. రాజకీయ అవసరాల కోసం రోజుకో రాష్ట్రం తిరిగే బాబు గంట సేపు రోడ్డుపై ప్రయాణించలేరా?. కొండవీడు రోడ్డు ప్రారంభానికి ఇంత హంగామా ఎందుకు చంద్రబాబు? అమరావతికి 50 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి హెలికాప్టర్లో వెళ్లాలా? హెలిపాడ్ కోసం చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? చంద్రబాబు పాలనలో పేదల ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోయింది అని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో రైతు కోటేశ్వరరావు మృతి ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. సర్కారు పెద్దల తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. అన్నదాత ప్రాణాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్కారు పెద్దలు, పోలీసులే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు పొలాన్ని ఆక్రమించడం, చేతికొచ్చిన బొప్పాయి తోటను ధ్వంసం చేయడం, ప్రశ్నించిన పాపానికి చితకబాదడం.. ఇవీ కోటేశ్వరరావు మృతికి ప్రధాన కారణమయ్యాయి. దీనికి అదనంగా పోలీసులు చివరి సమయంలో అనుసరించిన తీరు కూడా వివాదదస్పదమవుతోంది. అప్పుల బాధతో పురుగు మందు తాగి చనిపోయాడంటూ బుకాయిస్తున్న తీరును చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు మరణిస్తే కనీసం కనికరం చూపని పాలకుల వైఖరిని ఈసడించుకుంటున్నారు. -
గనులను మింగిన ఆత్మలు!
సాక్షి, గుంటూరు: దశాబ్దాల క్రితమే చనిపోయిన వారి ఆత్మలు తెల్లరాయి గనులను అక్రమంగా తవ్వేస్తూ కోట్లాది రూపాయలు దోచుకున్నాయట! ఆత్మలు అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన స్వామి రామకోటయ్య అనే వ్యక్తి 2013లో అక్రమంగా గనులు తవ్వేశాడని, జరిమానా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు ఆయన పేరుతో నోటీసు ఇచ్చారు. నిజానికి రామకోటయ్య 1998లోనే కన్ను మూశాడు. తన 20 ఏళ్ల కిందటే తండ్రి చనిపోయాడని, 2013లో అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావు నెత్తీనోరూ బాదుకున్నా అధికారులు లెక్కచేయలేదు. ఆయనకు నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అసలు దోషులను క్షేమంగా పక్కకు తప్పించి, అమాయకులను బలిపశువులను చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పకడ్బందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసానుపల్లిలో పలువురికి మైనింగ్, విజిలెన్స్ అధికారులు నోటీసులిచ్చారు. రూ.1.55 కోట్ల జరిమానా చెల్లించాలని ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చారు. దాచేపల్లికి చెందిన మరో ఐదుగురికి నోటీసులు అందాయి. విలువైన గనులను పట్టపగలే అడ్డంగా దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, దాంతో ఎలాంటి సంబంధంలేని తమకు నోటీసులు జారీ చేయడం ఏమిటని బాధితులు మండిపడుతున్నారు. సర్వే పేరిట అధికారుల హడావుడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి గ్రామాల పరిధిలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రూ.వందల కోట్ల విలువైన ఖనిజ సంపదను అక్రమంగా దోచేస్తూ, ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టడంపై న్యాయస్థానం మండిపడింది. దీంతో హైకోర్టుకు సమాధానం చెప్పుకోవడానికి ఆయా ప్రాంతాల్లో అధికారులు మూడు రోజులపాటు సర్వే పేరిట హడావుడి చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి, అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని అమాయకుల మెడకు చుట్టేందుకే నోటీసులు జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించడానికేనా? దాచేపల్లి పట్టణంతోపాటు కేసానుపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు 2013 నుంచి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, పెనాల్టీ చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మైనింగ్ అంటే ఏమిటో కూడా తెలియని తమకు నోటీసులు అందడంతో భయాందోళనకు గురయ్యారు. నోటీసుల్లో పేర్కొన్న సర్వే నంబర్లలో తమ పేర్లు ఏమైనా ఉన్నాయా అనే దానిపై మీ–సేవా కేంద్రాల్లో ఆరా తీశారు. ఎక్కడా తమ పేర్లు లేనట్లుగా గుర్తించి ఈసీలు తీసుకున్నారు. కేసానుపల్లికి చెందిన స్వామి రామకోటయ్య సర్వే నంబరు 336/6లో 16 సెంట్ల విస్తీర్ణంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడి, మొజాయిక్ చిప్స్ 5,834 మెట్రిక్ టన్నులు దోచుకున్నాడని, దాని విలువకు పది రెట్లు పెనాల్టీ వేసి మొత్తం రూ.28.23 లక్షలు చెల్లించాలంటూ 2013 ఆగస్టు 16 తేదీతో ఉన్న నోటీసును అధికారులు జారీ చేశారు. ఈ నోటీసును రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావుకు అందించారు. 1998లో తన తండ్రి రామకోటయ్య చనిపోయినట్లుగా పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రామలింగేశ్వరరావు చూపినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. నోటీసు తీసుకోకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. అదే గ్రామానికి చెందిన గుదె పేరయ్య సర్వే నంబరు 244లో 66 సెంట్ల విస్తీర్ణంలో 2015లో అక్రమ మైనింగ్‌కు పాల్పడి 32 వేల మెట్రిక్ టన్నుల మొజాయిక్ చిప్స్‌ను అక్రమంగా దోచేశాడని, పెనాల్టీ రూ.1.56 కోట్లు చెల్లించాలని 2017 మే 19 తేదీతో నోటీసు ఇచ్చారు. వ్యవసాయం చేసుకునే తాను అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని పేరయ్య ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అలాగే మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. సదరు సర్వే నంబర్లలో మైనింగ్ జరిగిన దాఖలాలు లేవని, ఆ ప్రాంతంలో ఎస్టీ కాలనీ ఉందని చెబుతున్నారు. సర్వే నంబరు 244 సమీపంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న అక్రమ క్వారీ ఉంది. మైనింగ్ మాఫియాను వదిలిపెట్టి, అమాయకులకు నోటీసులు జారీ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులపాటు సర్వే నిర్వహించిన మైనింగ్ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించేందుకే అమాయకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చనిపోయిన తర్వాత గనులు తవ్వుతారా? ‘‘మా నాన్న స్వామి రామకోటయ్య 1998లో మరణించారు. సర్వేనంబర్ 336/6లో ఉన్న 16 సెంట్లలో మా నాన్న అక్రమంగా గనులు తవ్వారని, రూ.28,23,843 జరిమానా చెల్లించాలని అధికారులు నోటిసు ఇచ్చారు. ఈ నోటీసు 2013 ఆగస్టు 16న జారీ అయినట్లు ఉంది. మా నాన్న చనిపోయిన 20 ఏళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారో అర్థం కావట్లేదు. – స్వామి రామలింగేశ్వరరావు, కేసానుపల్లి అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు ‘‘అధికారులు 3 రోజుల క్రితం ఇంటికి వచ్చి మా నాన్న పేరయ్య పేరిట నోటీసులిచ్చారు. సర్వే నంబర్ 244లో ఉన్న 66 సెంట్ల స్థలంలో అక్రమంగా మైనింగ్ చేసినందుకు రూ.1.55 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. ఆ సర్వే నంబర్లో మాకు సెంటు స్థలం కూడా లేదు. గనుల కేసులో అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు’’ – గుదె అనంతరామయ్య, కేసానుపల్లి చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం ‘‘కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల ఆధారంగా పెనాల్టీలు చెల్లించాలని నోటీసులు పంపాం. 2013, 2017లో కేసులు నమోదు కావడంతో ఆ తేదీలతోనే నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ కేసు విచారణకు, ఈ నోటీసులకు సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం’’ – పాపారావు, మైనింగ్ డీడీ, ఇన్చార్జి విజిలెన్స్ ఏడీ -
పథకం ప్రకారమే కోటయ్య హత్య
ఆర్థికలావాదేవీలే మిత్రులను విడదీశాయి అదును చూసి అంతమొందించిన∙వైనం కొండవీడులో సంచలనం రేపిన ఘటన యడ్లపాడు(గుంటూరు): ప్రశాంతంగా ఉండే పల్లెలో జరిగిన హత్య అక్కడివారిని ఉలికిపాటుకు గురిచేసింది. మండలంలోని కొండవీడులో బుధవారం రాత్రి మాజీ సర్పంచ్ తనయుడు బొప్పూడి బాలకోటయ్య, అతని బంధువర్గం కలిసి అదేగ్రామంలో నివసిస్తున్న వేల్పూరి కోటయ్య (45)ను కాపుగాసి దారుణంగా హత్య చేశారని భావిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, వాదనలు ఇద్దరు మిత్రులను శత్రువులుగా మార్చడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్న కోటయ్యను అతని మిత్రుడే హత్య చేశాడనే ఆరోపణ సంచలనమైంది. ఆర్థిక లావాదేవీలతోనే స్పర్థలు... బొప్పూడి బాలకోటయ్య, వేల్పూరి కోటయ్యలు సన్నిహితంగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. దానికి సంబం«ధించిన ఆర్థికS వ్యవహారంలో ఇద్దరి మధ్య స్పర్థలు వచ్చాయి. పలుమార్లు బహిరంగంగానే వాదులాడుకున్నారు. సుమారు 5 నెలల కిందట స్థానిక రైస్‌మిల్లు వద్ద ఇద్దరి మధ్య వాదులాట ఘర్షణకు దారితీసింది. తనను కొట్టబోయిన బాలకోటయ్యను రాయితో వేల్పూరి కోటయ్య కొట్టాడని తెలిసింది. దీంతో బాలకోటయ్యకు తీవ్రంగా గాయమై 20 రోజుల పాటు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వచ్చింది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన బాలకోటయ్య.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హత్యకు పథకం రచించాడు. అదేచోట హత్య... రోజు మాదిరిగానే గుంటూరులో రాడ్‌బెండింగ్ పనులను ముగించుకుని సాయంత్రం కొండవీడుకు బైక్‌పై వస్తున్న వేల్పూరి కోటయ్యపైకి రాళ్లను విçసిరారు. ఊహించని సంఘటనకు బైక్‌ను వదిలి రేపూడి మార్గం వైపు పరుగుదీశాడు. వాహనం వెనుక కటింగ్ మిషన్‌తో కూర్చుని ఉన్న వేల్పూరి కోటయ్య అల్లుడు దావల కిరణ్‌కుమార్ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అప్పటికే కత్తులు, కొడవళ్లు, గడ్డపలుగులతో వేల్పూరి కోటయ్యను వెంబడించి విచక్షణ రహితంగా గాయపరిచారు. తీవ్రగాయాలైన అతను అక్కడికక్కడే మృతి చెందగా, నిందితులు పరారయ్యారు. పోలీసులు ఏం చెబుతున్నారంటే.. మృతుని అల్లుడు దావల కిర ణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన్నట్టు ఎసై ్స రమేష్‌బాబు తెలిపారు. తన మామను బాలకోటయ్యతో పాటు మరో పదిమంది కత్తులతో, కొడవళ్లు, గడ్డపలుగులతో హత్య చేసినట్టు కిరణ్‌కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. మృతదేహానికి గురువారం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. కేసును సీఐ శోభన్‌బాబు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని సైకిలిస్ట్ మృత్యువాత
అద్దంకి - నార్కట్‌పల్లి అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు. కోదాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు నల్లగొండ మండలం చర్లపల్లి వద్ద సైకిలిస్ట్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మోసంగి కోటయ్య(60)ను ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా- ఒకరి మృతి
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరు గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో రామావత్ కోటయ్య అనేయువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులను నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. పొలం పనులకు వెళుతుండగా ట్రాక్టర్ బొల్తాపడినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రమావత్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
బావిలో పడి ముగ్గురు మృతి
నీరు తాగటానికి బావిలోకి దిగి జారిపడ్డ భర్తను రక్షించబోయి భార్య కూడా పడిపోయింది. వారిని కాపాడేందుకు యత్నించిన మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం మాధవరం సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన కొరకుప్పల కోటయ్య(50), నాగేంద్రమ్మ(45) దంపతులు తమ గొర్రెలను తోలుకుని బుధవారం మాధవరం సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. సాయంత్రం సమయంలో కోటయ్య మంచినీరు తెచ్చేందుకని సమీపంలోని నేలబావిలోకి దిగాడు. అయితే, కాలుజారి నీటిలో పడిపోయిన కోటయ్య కేకలు వేయటంతో నాగేంద్రమ్మ వచ్చి భర్తను రక్షించేందుకు చీర కొంగును అందించింది. కోటయ్యను పైకి లాగే క్రమంలో నాగేంద్రమ్మ కూడా పడిపోయింది. వారి కేకలు విని సమీపంలోనే ఉన్న మాధవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(60) పరుగున అక్కడికి చేరుకుని, రక్షించేక్రమంలో అతడు కూడా పట్టుతప్పి నీళ్లలో పడిపోయాడు. ముగ్గురూ నీట మునిగి చనిపోయారు. గురువారం ఉదయం వరకు వారి జాడ లేకపోవటంతో కుటుంబసభ్యులు వెతకగా.. బావిలో వారి శవాలు తేలియాడుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న సీఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సన్నగిల్లుతున్న ఆశలు
రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన కోటయ్య కమిటీకీ గడువు కావాలనడంపై ఆగ్రహం ఖరీఫ్ పెట్టుబడుల కోసం అన్నదాతల తంటాలు రుణమాఫీ కథ కంచికి చేరేటట్టు కనిపించడం లేదు. అమలు విషయంలో కాలయాపనతో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నమ్మించి మోసం చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బకాయిలను నగదు రూపేణా ప్రభుత్వమే చెల్లించాలని ఆర్బీఐ పేర్కొనడం, కోటయ్య కమిటీకి మరింత గడువు కావాలని ఆర్థిక మంత్రి ఆదివారం ప్రకటించడంతో అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమలవుతుందో లేదోనన్న బెంగ పట్టి పీడిస్తోంది. చోడవరం/నర్సీపట్నం: రుణమాఫీపై స్పష్టత కొరవడడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకులు అప్పులివ్వకపోగా ఉన్నవి తీర్చాలంటూ ఒత్తిడి చేయడం అన్నదాతలకు మింగుడు పడడం లేదు. మరోపక్క మాఫీపై విధివిధానాల అధ్యయనానికి నియమించిన కోటయ్య కమిటీ నివేదికకు మరికొంత సమయం పడుతుందంటూ ఆర్థిక శాఖ మంత్రి ఆదివారం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఖరీఫ్ రుణాల కోసం బ్యాంకులను ఒప్పించే ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2013-14 ఖరీఫ్, రబీల్లో జిల్లాలోని 2,10,881 మంది రైతులు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారు రూ. 894 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీటిని ఇప్పటికే చెల్లించి, ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడికి రుణాలు తీసుకోవా ల్సి ఉంది. గతేడాది సాగు అనుకూలించక పోవడంతో పాటు చంద్రబాబు రుణ మాఫీ హామీ తో ఈ బకాయిలు పేరుకుపోయాయి. వాస్తవానికి వర్షాలు అనుకూలిస్తే ఇప్పటికే ఖరీఫ్ పనులు ప్రారంభించాలి. వరుణుడు ముఖం చాటేయడంతో వ్యవసాయపనులు పెద్దగా ప్రారంభం కాలేదు. కానీ అదను ముంచుకురావడంతో అప్పుల కోసం వెంపర్లాడుతున్నారు. కమిటీ నివేదిక పేరుతో మాఫీపై ప్రభుత్వం జాప్యం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క గతేడాది అప్పులు తీర్చాలంటూ కొన్ని బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేశాయి. నెలాఖరులోగా చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేస్తామంటూ హెచ్చరిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి షరతుల్లేకుండా రుణమాఫీ అమలు చేస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం కోటయ్య కమిటీ ఏర్పాటుకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మాఫీ విధానంతో బ్యాంకులు ఆర్థికంగా నష్టపోతాయంటూ ఆర్బీఐ అభిప్రాయపడింది. ఈమేరకు ఈ నెల 11న ప్రభుత్వానికి లేఖ రాసింది. మాఫీ తప్పనిసరిగా అమలు చేయాలంటే బకాయిలను నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించాలంటూ అందులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను తాము ఆమోదించబోమని స్పష్టం చేసింది. ఆర్థికస్థితి నామమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో మాఫీ అమలు సాధ్యమా అన్న అనుమానాన్ని మేథావులు సైతం వ్యక్తం చేస్తున్నారు. రుణాలు మాఫీ చేయాలి నాది కె.కోటపాడుమండలం వారాడ సంతపాలెం. నాకు 3ఎకరాలు పొలం ఉంది. ఇందులో ఏటా వరి పంట వేస్తుంటాను. మదుపుల కోసం ఏపీజీవీబీలో రెండేళ్ల కింద రూ.50వేలు అప్పుతీసుకున్నాను. పంట కలిసిరాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాను. టీడీపీ రుణమాఫీ ప్రకటనతో సంబరపడ్డాను. కానీ ఇప్పుడు ఇంకా సమయం పడుతుందని మంత్రి ప్రకటించడం రైతులను మోసగించడమే. ఇలాంటి మాటలు కాకుండా వెంటనే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి. - వేచలపు సింహాద్రప్పడు, రైతు, వి.సంతపాలెం. మంత్రి ప్రకటనతో భయంగా ఉంది నాది చోడవరం మండలం మైచర్లపాలెం గ్రామం. నాకు రెండెకరాల భూమి ఉంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం చోడవరం ఆంధ్రాబ్యాంకులో రెండు తులాల బంగారు ఆభరణాలు గతేడాది కుదువ పెట్టి రూ.30వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుం దని ఎదురు చూస్తున్నాను. ఇంతలో బ్యాంక్ నుంచి నోటీసు వచ్చింది. నెలాఖరులోగా అప్పు తీర్చకుంటే ఆభరణాలు వేలం వేస్తామంటున్నారు. ఆర్థిక మంత్రి ప్రకటనతో ఆందోళనకరంగా ఉంది. - నానుబిల్లి అర్జునరావునాయుడు, రైతు, మైచర్లపాలెం. ప్రభుత్వం మోసం చేస్తోంది నాది దేవరాపల్లి మండలం కొత్తపెంట. నాకు రెండెకరాల పొలం ఉంది. వరి,చెరకు పంటలు వేస్తున్నాను. గతేడాది కె.కోటపాడు స్టేట్బ్యాం క్లో ఆరు తులాల బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి పంట రుణంగా రూ.1.2లక్షలు తీసుకున్నాను. కోటయ్య కమిటీ నివేదికకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం రైతులను మోసం చేయడమే. -రొంగలి వెంకట్రావు, రైతు, కొత్తపెంట.