పథకం ప్రకారమే కోటయ్య హత్య
-
ఆర్థికలావాదేవీలే మిత్రులను విడదీశాయి
-
అదును చూసి అంతమొందించిన∙వైనం
-
కొండవీడులో సంచలనం రేపిన ఘటన
యడ్లపాడు(గుంటూరు): ప్రశాంతంగా ఉండే పల్లెలో జరిగిన హత్య అక్కడివారిని ఉలికిపాటుకు గురిచేసింది. మండలంలోని కొండవీడులో బుధవారం రాత్రి మాజీ సర్పంచ్ తనయుడు బొప్పూడి బాలకోటయ్య, అతని బంధువర్గం కలిసి అదేగ్రామంలో నివసిస్తున్న వేల్పూరి కోటయ్య (45)ను కాపుగాసి దారుణంగా హత్య చేశారని భావిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, వాదనలు ఇద్దరు మిత్రులను శత్రువులుగా మార్చడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్న కోటయ్యను అతని మిత్రుడే హత్య చేశాడనే ఆరోపణ సంచలనమైంది.
ఆర్థిక లావాదేవీలతోనే స్పర్థలు...
బొప్పూడి బాలకోటయ్య, వేల్పూరి కోటయ్యలు సన్నిహితంగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. దానికి సంబం«ధించిన ఆర్థికS వ్యవహారంలో ఇద్దరి మధ్య స్పర్థలు వచ్చాయి. పలుమార్లు బహిరంగంగానే వాదులాడుకున్నారు. సుమారు 5 నెలల కిందట స్థానిక రైస్‌మిల్లు వద్ద ఇద్దరి మధ్య వాదులాట ఘర్షణకు దారితీసింది. తనను కొట్టబోయిన బాలకోటయ్యను రాయితో వేల్పూరి కోటయ్య కొట్టాడని తెలిసింది. దీంతో బాలకోటయ్యకు తీవ్రంగా గాయమై 20 రోజుల పాటు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వచ్చింది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన బాలకోటయ్య.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హత్యకు పథకం రచించాడు.
అదేచోట హత్య...
రోజు మాదిరిగానే గుంటూరులో రాడ్‌బెండింగ్ పనులను ముగించుకుని సాయంత్రం కొండవీడుకు బైక్‌పై వస్తున్న వేల్పూరి కోటయ్యపైకి రాళ్లను విçసిరారు. ఊహించని సంఘటనకు బైక్‌ను వదిలి రేపూడి మార్గం వైపు పరుగుదీశాడు. వాహనం వెనుక కటింగ్ మిషన్‌తో కూర్చుని ఉన్న వేల్పూరి కోటయ్య అల్లుడు దావల కిరణ్‌కుమార్ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అప్పటికే కత్తులు, కొడవళ్లు, గడ్డపలుగులతో వేల్పూరి కోటయ్యను వెంబడించి విచక్షణ రహితంగా గాయపరిచారు. తీవ్రగాయాలైన అతను అక్కడికక్కడే మృతి చెందగా, నిందితులు పరారయ్యారు.
పోలీసులు ఏం చెబుతున్నారంటే..
మృతుని అల్లుడు దావల కిర ణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన్నట్టు ఎసై ్స రమేష్‌బాబు తెలిపారు. తన మామను బాలకోటయ్యతో పాటు మరో పదిమంది కత్తులతో, కొడవళ్లు, గడ్డపలుగులతో హత్య చేసినట్టు కిరణ్‌కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. మృతదేహానికి గురువారం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. కేసును సీఐ శోభన్‌బాబు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.