గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరు గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు.
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరు గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో రామావత్ కోటయ్య అనేయువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులను నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. పొలం పనులకు వెళుతుండగా ట్రాక్టర్ బొల్తాపడినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రమావత్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.