'మత్తు' బంధం బహిర్గతం | Chandrababu And Daggubati Families Caught In Visakha Drug Bust, Know Details Inside - Sakshi
Sakshi News home page

Vizag Drugs Case: 'మత్తు' బంధం బహిర్గతం

Published Sun, Mar 24 2024 3:09 AM | Last Updated on Sun, Mar 24 2024 6:02 PM

Chandrababu and Daggubati families caught in Visakha drug bust - Sakshi

డ్రగ్స్‌ కుతంత్రం అంతా పచ్చ నేతలదే..  

పాత్రధారి సంధ్యా ఆక్వా ఎండీ కోటయ్య చౌదరి.. 

సూత్రధారులు టీడీపీ నేతలే

వ్యాపార, వ్యక్తిగత బంధం అంతా వారితోనే.. ఆధారాలతో అడ్డంగా దొరకడంతో చంద్రబాబు బెంబేలు

ఫ్లెక్సీ చూపిస్తూ వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారానికి టీడీపీ కుట్ర

బెడిసికొట్టిన పన్నాగం.. టీడీపీ నేతల్లో తీవ్ర ఆందోళన 

బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు కోటయ్య చౌదరితో సాన్నిహిత్యం

ఆలపాటి రాజాతోనూ చౌదరి ఆర్థిక బంధం బట్టబయలు

2019లోనే సంధ్యా ఆక్వా దరఖాస్తును తిరస్కరించిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌

అప్పట్లో ఈ నిర్ణయంపై రచ్చ చేసిన టీడీపీ, ఎల్లో మీడియా

కిలో కాదు.. రెండు కిలోలు కాదు.. ఏకంగా 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కలగలిసిన డ్రగ్స్‌ పట్టుబడిన వ్యవహారం చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ వ్యాపార పునాదులను కదిలిస్తోంది. డ్రగ్స్‌ కంటైనర్‌ బ్రెజిల్‌ నుంచి నౌకలో బయలు దేరడం.. ఆ సమాచారం  ఇంటర్‌పోల్‌ చెవిన పడటం.. వారు సీబీఐకి చేరవేయడం.. హుటాహుటిన సీబీఐ బృందం విశాఖ పోర్ట్‌కు రావడం.. ఆ కంటైనర్‌ను గుర్తించి సోదాలు, పరీక్షలు చేయడం.. అందులో కొకైన్‌ తదితర డ్రగ్స్‌ ఉన్నట్లు స్పష్టం కావడం.. అంతా సస్పెన్స్, థ్రిల్లర్‌ సినిమాను తలపించింది. ఇంత భారీ పరిమాణంలో డ్రగ్స్‌ పట్టుబడిన ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ చంద్రబాబు, ఆయన బంధుగణంపైనే చూపిస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.  

సాక్షి, అమరావతి:  విశాఖ డ్రగ్స్‌ దందాలో అడ్డంగా దొరికిన చంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్రెజిల్‌ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్‌ దిగుమతి చేయించిన సంధ్యా ఆక్వా కంపెనీ కూనం కోటయ్య చౌదరి వెనుక ఉన్నది తమ కోటరీయేనని ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుట్రకు పదును పెడుతున్నాయి. అందుకే వాస్తవాలను వక్రీకరిస్తూ తమ అనుకూల మీడియా, టీడీపీ సోషల్‌ మీడియా ద్వారా అవాస్తవాలను, అభూతకల్పనలను ప్రచారంలోకి తెస్తు­న్నా­యి. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా.. ఫ్లెక్సీలను పట్టుకుని రాద్ధాంతం చేసేందుకు యత్నిస్తున్నాయి.

ఆ సాకుతో కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరిలతో దగ్గుబాటి కుటుంబ వ్యాపార బంధాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. సంధ్యా ఆక్వా కంపెనీతో టీడీపీ నేతల వ్యాపార లావాదేవీలు, బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు ఏమీ తెలీనట్లుగా ఓ వర్గం మీడియా నటిస్తోంది. కానీ కోటయ్య చౌదరి డ్రగ్స్‌ దందాచంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాల మెడకు ఇప్పటికే చుట్టుకుందన్నది బహిరంగ రహస్యం. మసిపూసి మారేడుకాయ చేయాలన్న కుతంత్రాలు బెడిసి కొడుతుండటంతో చంద్రబాబు ఆత్మరక్షణలోపడిపోయారు.  

అంతా చౌదరి కుటుంబమే..  
డ్రగ్స్‌ దందాలో పాత్రధారులు కూనం కోటయ్య చౌదరి కుటుంబం కాగా, సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ సభ్యులేనన్నది బట్టబయలైంది. బ్రెజిల్‌ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్‌ దిగుమతి చేయించిన వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్‌ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. కాగా ఈ దందాకు ఆర్థిక, రాజకీయ అండదండలు అందించడం, డ్రగ్స్‌ భారత్‌కు చేరుకున్నాక మార్కెటింగ్‌ వ్యూహం అమలు సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ నేతలే కావడం గమనార్హం.

ముఖ్యంగా ఈ వ్యవహారంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యుల వైపే వేళ్లన్నీ చూపుతున్నాయి. అసలు సంధ్యా ఆక్వా కంపెనీ ఏర్పాటులోనే దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం కీలక పాత్ర పోషించింది. ఆమె కుమారుడు దగ్గుబాటి చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగానే ఆ కంపెనీని స్థాపించారు. అనంతరం ఆ  కంపెనీని మూడుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తు­న్నారు. కాగా ఆ అంతర్జాతీయ స్థాయి వ్యాపారం వెనుక డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ లోగుట్టు దాగుందన్నది తాజాగా సీబీఐ సోదాల్లో వెల్లడైంది.

మరోవైపు చంద్ర­­బాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ ముఖ్య నేతలు, వారి వారసులతో సంధ్యా ఆక్వా కంపెనీ కోటయ్య చౌదరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. దామచర్ల సత్య (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌ సోదరుడు), రాయపాటి జీవన్‌ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లతో ఓ కోటరీగా గూడుపుఠాణి నిర్వహించారన్నది వెలుగులోకి వచ్చింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు దామచర్ల జనార్ధన్‌ అత్యంత సన్నిహితుడు కాగా, ఆయన సోదరుడు దామచర్ల సత్య ప్రస్తుతం లోకేశ్‌ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ పచ్చ ముఠా సభ్యులంతా తరచూ విదేశీ పర్యటనలు చేస్తారని.. ఆ ముసుగులో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారని.. కలసి ఎంజాయ్‌ చేస్తారనే ఫొటోలు సోషల్‌ మీడియాలో రెండు రోజులుగా హల్‌చల్‌ చేస్తున్నాయి.  

ఆలపాటి రాజాకూ లింకు 
చంద్రబాబు గీచిన గీత జవదాటరనే పేరున్న ఆల­పాటి రాజాకు సంధ్యా ఆక్వా కంపెనీ కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరీలతో ఆరి్థక బంధం ఉందని నిరూపించే పత్రాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ కలసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు నిగ్గు తేలింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లో తమ దందాను విస్తరించిన సంధ్యా ఆక్వా కంపెనీతో నంద­మూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం.

బాలయ్య చిన్న అల్లుడు, నారా లోకేశ్‌ తోడల్లుడు, విశాఖపట్నం టీడీ­పీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్‌ కుటుంబం విశాఖలో సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం కోటయ్య చౌదరికి పలు వ్యవహారాల్లో సహకారం అందించింది. భరత్‌ కుటుంబ సహకారంతోనే విశాఖపట్నంలో సంధ్యా ఆక్వా వ్యాపార కార్యకలాపాలు విస్తరించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి కూడా భరత్‌ కుటుంబంతో మొదటి నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న తరుణంలోనే భరత్‌ కుటుంబానికి చెందిన గీతం విద్యా సంస్థలకు డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా లభించిందన్నది గమనార్హం. ఈ వాస్తవాలు, పరిణామాలన్నీ కూడా డ్రగ్స్‌ దందాలో పాత్రధారి అయిన సంధ్యా ఆక్వా కంపెనీతో చంద్రబాబు, పురందేశ్వరి కుటుంబాలు, కోటరీలకు సన్నిహిత సంబంధాలున్నాయని స్పష్టంచేస్తున్నా­యి. 

పచ్చ గ్యాంగ్‌ నాడు అలా.. నేడు ఇలా
భారీ డ్రగ్స్‌ను విశాఖ పోర్టుకు తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోయిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే కొరడా ఝుళిపించింది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పాటించకుండానే కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సీఎఫ్‌ఈ) కోసం విజయవాడలోని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ జోనల్‌ కార్యాలయానికి సంధ్యా ఆక్వా దరఖాస్తు చేసింది. దీనిపై విచారణ జరపగా ఆ కంపెనీ నిబంధనలేమీ పాటించలేదని తేలింది. దీంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు 2019 సెపె్టంబర్‌ 18న ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలియ­జేసింది.

నిజానికి అంతకు ముందు కూడా దర­ఖాస్తు చేయగా తిరస్కరించామని, ఇదే కం­పెనీ అదే మళ్లీ అలానే దరఖాస్తు చేసినందున తిరస్కరిస్తున్నామని స్పష్టం చే­సింది. సంధ్యా ఆక్వాలో నీరు, గాలి సమస్యలు ఎ­క్కువగా వచ్చే అవకాశం ఉందని, వ్య­ర్థాలను శుద్ధి చేయడానికి తగినంత భూమి వారి వద్ద అందుబాటులో లేదని తెలిపింది. వ్యర్థాలను సమీపంలోని కాలువలో వదిలేస్తున్నట్లు తా­ము గుర్తించామని ఆర్డర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పొల్యూషన్‌ బోర్డు అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణ, అభివృద్ధి పను­లు చేపట్టకూడదని ఆదేశించింది. అప్పటికే ఏవైనా కార్యకలాపాలు ప్రారంభించి ఉంటే వెంటనే వాటన్నింటినీ నిలిపివేయాలని కూడా హెచ్చరించింది.

దీనిని బట్టి సంధ్యా ఆక్వా అక్రమాలకు ఆదిలోనే అడ్డు­కట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందనేది సుస్పష్టం అవుతోంది. అలాంటప్పుడు ఇంతలా చర్యలు తీసుకున్న ప్రభుత్వంపై బురదజల్లడానికి పచ్చ గ్యాంగ్, పచ్చ మీడియా విఫలయత్నం చేస్తోంది. తమ సన్నిహిత సంస్థ అని ఆ రోజు భుజానకెత్తు­కుని, ఈ ప్రభు­త్వం అనుమతులు ఇవ్వడం లేదంటూ రచ్చ చేసిన టీడీపీ, ఎల్లో మీడియా.. ఇప్పుడు డ్రగ్స్‌ కుంభకోణం బయట పడేసరికి ప్లేటు ఫిరాయించాలని చూస్తోంది. కానీ నిందితులంతా టీడీపీ పెద్దలకు అత్యంత ఆప్తులనే విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది.
 
ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నది టీడీపీ యత్నం 
డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంలో తమ వ్యవహారం బట్టబయలు కావడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు తానేం చేస్తున్నారో గుర్తించలేకపోతున్నారు. అయోమయానికి గురై వైఎస్సార్‌సీపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ తానే అడ్డంగా దొరికిపోతున్నారు. కూనం ప్రభాకర్‌ చౌదరి ఫొటోలు ఉన్న ఓ ఫ్లెక్సీని చూపిస్తూ వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేసేందుకు యత్నిస్తున్నారు. ఆయన ఈ ఏడాది సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామంప్రకాశం జిల్లాలోని  ఈదుమూడి వెళ్లారు.

ఆ సందర్భంగా పార్టీలకు అతీతంగా కుటుంబ వ్యవహారంగా ఆ గ్రామస్తులు వేసిన ఫ్లెక్సీలో కూనం ప్రభాకర్‌ చౌదరి ఫొటోలు వేశారు. అదేమీ వైఎస్సార్‌సీపీ రాజకీయ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం అంత కంటే కాదు. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ గ్రామస్తులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అది. అందులో ఎక్కడా వైఎస్సార్‌సీపీ పేరు కూడా లేదు.

అయినా ఆ ఫ్లెక్సీలో ఫొటో ఉంది కాబట్టి కూనం ప్రభాకర్‌ చౌదరి వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తి అంటూ టీడీపీ దు్రష్పచారం చేస్తుండటం విడ్డూరం. డ్రగ్స్‌ దందాలో నిండా మునిగిన చంద్రబాబు ఈ ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా భావిస్తుండటం హాస్యాస్పదంగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement