kakinada kaja
-
యాంకర్ అనసూయకు బాహుబలి కాజాతో సత్కారం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): టీవీ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్‌కు శనివారం సురుచి పీఆర్వో వర్మ బాహుబలి కాజా అందించి సత్కరించారు. పెద్దాపురంలో షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు కాకినాడలోని ఒక హోటల్లో ఈ కాజా అందించినట్టు ఆయన వివరించారు. జిల్లాకు ప్రముఖులెవ్వరు వచ్చినా బాహుబలి కాజా అందివ్వడం సురుచి సంప్రదాయమన్నారు. కాగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది అనసూయ. రంగస్థలంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాల్లో నటించి సత్తాచాటింది. చివరగా దర్జా చిత్రంలో కనిపించింది. -
ఆ స్వీటుకు అంతర్జాతీయ గుర్తింపు, వందేళ్లకు పైగా చరిత్ర.. తాజాగా మరో గుర్తింపు!
సాక్షి, విశాఖపట్నం: మీకు తెలుసా కాకినాడ కాజాకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కాజాను దక్షిణ భారతంలో ప్రసిద్ధి వంటకంగా పేరుంది. 1891లో తొలిసారిగా ఈ గొట్టం కాజా తయారీ జరిగింది. కోటయ్య అనే ఆయన తొలిసారి ఈ కాజాను తయారు చేశారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది. ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల ద్వారా కాకినాడ గొట్టం కాజా చరిత్రను తపాలా శాఖ మరోసారి నేటి తరానికి అందించింది. దీంతో పాటు మాడుగుల హల్వా విశిష్టతను సైతం ప్రత్యేక పోస్టల్ కవర్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసిన ఈ హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గోధుమపాలు, నెయ్యి, జీడిపప్పు, బాధం పప్పుS సమాహారంగా మాడుగుల వాసులు ఈ రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఈ హల్వా లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం ఉంది. దీంతో పాటు ఆత్రేయపురం పూతరేకుల విశిష్టతపైనా తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ముంద్రించి ఆ విశిష్టతలను ప్రస్తుత తరానికి అందించింది. చదవండి: కాళ్లకు తాడు కట్టుకుని బావిలో ఈత.. ఎలా సాధ్యం? -
Tapeswaram Kaja: శర్వానంద్, రష్మికలకు బాహుబలి కాజా
మండపేట(తూర్పుగోదావరి): సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన సినీతారలను తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ బాహుబలి కాజాతో సత్కరించింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం షూటింగ్ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. షూటింగ్లో పాల్గొన్న హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మికలకు సురుచి పీఆర్ఓ వర్మ బాహుబలి కాజాలను అందజేశారు. శర్వానంద్ మాట్లాడుతూ తనకు మడత కాజా అంటే చాలా ఇష్టమని, గతంలో తాను సురుచిని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారని వర్మ తెలిపారు. చదవండి: పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ -
వహ్వా.. హల్వా!
కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ వరుసలోనే విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 128ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సాక్షి, మాడుగుల: విశాఖ జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన మిఠాయి వ్యాపారి దంగేటి ధర్మారావుకు 1890 ప్రాంతంలో కొత్తరకమైన మిఠాయి తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. అంతే.. బూడిద గుమ్మడి, కొబ్బరి కాయ రసంతో హల్వా తయారుచేశారు. దీని తయారీ ఎలాంటే.. ముందుగా మేలు రకం గోధుమలు 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీయాలి. వాటిని ఒక రోజు పులియబెట్టాలి. ఆ తరువాత గోధుమ పాలు, నెయ్యి కలిపి దగ్గరకు మరిగే వరకు కలపాలి. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్ కోసం జీడిపప్పు బాదం పప్పు వేయాలి. మాడుగుల హల్వా యవ్వన శక్తి పెంచడంతోపాటు శరీర స్థితిని నిలకడగా ఉంచుతుందని స్థానికుల నమ్మకం. పెరుగుతున్న షాపులు మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబంలో మాత్రమే హల్వా తయారీ జరిగేది. అయితే, తయారీ గుట్టు రట్టవ్వడంతో ప్రస్తుతం వ్యాపారం విస్తరించింది. ఇక్కడ తయారవుతున్న హల్వాను మొబైల్ వ్యాన్ల ద్వారా పార్శిళ్లు, కొరియర్ల ద్వారా ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాలకు పంపిస్తున్నారు. కాగా, ఇటీవల వరకు మేలు రకాన్ని కేజీ రూ.260 వరకు విక్రయించిన తయారీదారులు ముడిసరుకుల ధరలు పెరగడంతో దానిని రూ.400కు పెంచక తప్పలేదు. 1,500 కుటుంబాలకు ఆధారం మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా 1500 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుండి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు దళారులు తీసుకెళ్లి విక్రయిస్తారు. విదేశాల్లో ఉంటే స్థానికులు ఇక్కడకు వచ్చి వెళ్ళినపుడల్లా హల్వాను తీసుకెళ్లడం పరిపాటి. ఇలా దేశ విదేశాలకు మాడుగుల హల్వా పరిచయమైంది. అంతేకాక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు జరిగినా ఇది ఉండడం ఆనవాయితీ. ప్రముఖుల మెప్పు పొందిన హల్వా విశాఖ జిల్లా అరుకు షూటింగ్‌లకు వచ్చే సినీ ప్రముఖులు చాలామంది ఈ హల్వా రుచిచూసి వహ్వా అన్నవారే. దివంగిత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారు. అలాగే, ఇందిరాగాంధీ 40 ఏళ్ల కిందట ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హల్వా రుచి చూసిన వారేనని స్థానిక సీనియర్ వ్యాపారులు చెబుతున్నారు. ఇలా దంగేటి ధర్మారావు సృష్టించిన ఈ హల్వాను అతని కుమారుడు కొండలరావు, మనుమడు మూర్తి, ముని మనముడు మోహన్ వరకూ నాలుగు తరతరాలుగా మిఠాయి ప్రియుల మన్ననలు అందుకుంటున్నారు. మాడుగుల హల్వా రుచి అద్భుతం మాడుగుల వచ్చినపుడల్లా అమెరికాకు హల్వా తీసుకెళ్లి స్నేహితులుకు అందజేస్తుంటాను. పుట్టింది మాడుగుల మండలం సత్యవరం గ్రామం. కానీ, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నాను. ఫంక్షన్లకు, పండుగలకు కొరియర్ల ద్వారా అమెరికాకు తెప్పించుకుంటున్నాం. – గోకేడ వెంకటేశ్వర సత్యనారాయణ తరాలుగా ఒకటే రుచి తాతల నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, గోధుమలకు, కూలీలకు ధరలు పెరిగినా పెద్దగా లాభాలు ఆశించకుండా సామాన్యులుకు అందుబాటులో «ధరలో ఉంచుతున్నాం. మా హల్వా రుచికరంగా ఉండడానికి ఇక్కడి నీరే కారణం. – దంగేటి మోహన్, హల్వా వ్యాపారి, మాడుగుల -
తెలుగు ప్రేక్షకులను మరువలేను: కాజల్
‘పచ్చని పొలాలు... ఆహ్లాదం గొలిపే పర్యాటక ప్రాంతాలున్న తూర్పుగోదావరి జిల్లాకు రావడం ఇదే మొదటిసారి. కాకినాడ రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి అభిమానులు నాపై చూపుతున్న ఆప్యాయత మరువలేను.’ అని ప్రముఖ సినీనటి కాజల్‌అగర్వాల్ అన్నారు. మెయిన్‌రోడ్డులో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్ వరల్డ్’ను ప్రారంభించేందుకు వచ్చిన కాజల్ మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్ర: తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంది? జః చాలా బాగుంది. మళ్లీ రావాలనిపిస్తోంది ప్ర: కాకినాడ కాజా రుచి చూశారా? జః రుచి చూడలేదు. త్వరలోనే మళ్లీ వస్తా. ఈసారి తప్పకుండా కాజా తింటా. ప్రః తెలుగు ఇండస్ట్రీకి దూరమైనట్టున్నారు? జ: అబ్బే అదేం లేదు. తెలుగులో నటిస్తూనే ఉంటా. తెలుగు పరిశ్రమకు దూరమయ్యే ప్రసక్తే లేదు. ప్ర: బాలీవుడ్లో అవకాశాలు ఎలా ఉన్నాయి? జ : మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులు కూడా మంచి ఆదరణ చూపుతున్నారు. ప్రః ప్రస్తుతం ఏ సినిమాల్లోచేస్తున్నారు? జః ‘జో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి ఇది విడుదలవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్ర : నటిగా మీకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది ? జ : ముందు చందమామ.. ఆ తర్వాత మగధీర.. తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి. ప్రః తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు? జః తెలుగులో కూడా మంచి ప్రాజెక్టులు ఉంటాయి. తెలుగు ప్రజల ఆదరాభిమానాల వల్లనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. వారిని మరువలేను.