కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు | Maharashtra Stamps Left Hand Of Coronavirus Suspects | Sakshi
Sakshi News home page

కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు

Published Tue, Mar 17 2020 2:37 PM | Last Updated on Tue, Mar 17 2020 2:38 PM

Maharashtra Stamps Left Hand Of Coronavirus Suspects - Sakshi

ముంబై : భారత్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లలోనే క్వారంటైన్‌ చేయబడిన కరోనా అనుమానితుల ఎడమ చేతిపై సిరాతో స్టాంపులను వేస్తోంది. ఆ స్టాంప్‌లో ‘ముంబై ప్రజలను రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నాను’ అని రాసి ఉంచారు. అలాగే వారి ఎప్పటివరకు క్వారంటైన్‌లో ఉండాలో కూడా పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా అనుమానితులను గుర్తించడం సులభతరం అవుతుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. 

ఎన్నికల సమయంలో ఓటర్ల వేలిపై ఎలానైతే సిరా చుక్క అంటించిన విధంగానే కరోనా అనుమానితుల చేతిపై చెరగని సిరాతో స్టాంప్‌ వేస్తున్నామని చెప్పారు. కరోనా అనుమానితులు ఒకవేళ స్వీయ నిర్బంధాన్ని ఉల్లంఘిస్తే ఇతరులు వారిని గుర్తించేందుకు తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నుట్ట చెప్పారు. కాగా, గతంలో కొందరకు కరోనా అనుమానితులు ఆస్పత్రుల నుంచి పారిపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 126 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు మంగళవారం మృతిచెందడంతో.. భారత్‌లో కరోనా మృతుల సంఖ్య మూడుకి చేరింది.

చదవండి : కరోనా: వివాదం రేపిన ట్రంప్‌ ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement