ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది అమెరికాలోనే అత్యంత ఖరీదైన నివాసం భవనం. లాస్ ఏంజెల్స్‌లోని బెల్-ఎయిర్ ప్రాంతంలో ఉంది. ‘కాసా ఎన్‌కాంటాడా’ పేరిట 1930వ దశకంలో నిర్మించిన ఈ భవంతిని ఆర్కిటెక్ట్‌లు ఇంగ్లీష్ అక్షరం ‘హెచ్’ ఆకారంలో రూపొందించారు. స్వర్గతుల్యమైన సౌకర్యాలతో అలరారేలా ఉండటం వల్ల ‘హెవెన్’కు ప్రతీకగా దీన్ని ‘హెచ్’ ఆకారంలో నిర్మించినట్లు చెబుతారు. దీని విస్తీర్ణం 40వేల చదరపు అడుగులు. అరవై గదులు గల ఈ భవంతిలో స్మిమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, రంగురంగుల చేపల తటాకాలు, గులాబీల తోట సహా ఉద్యానవనాలు, గెస్ట్‌హౌస్, సినిమా థియేటర్ ఉన్నాయి. ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ స్థిరాస్తి విలువ 20 కోట్ల పౌండ్లు (రూ.1846.22 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment