లాస్‌ఏంజిల్స్: ‘నువ్వు గే అంటూ తోటి స్నేహితులు ఏడిపించడమే కాకుండా, ‘గే’లకు సమాజంలో జీవించే హక్కు లేదు.. చనిపో అంటూ బెదిరింపులకు దిగడంతో తొమ్మిదేళ్ల జేమెల్ మైల్స్ ఆత్మహత్య చేసుకున్నాడు’. ఈ ఘటన అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో చోటు చేసుకుంది. ప్రసుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బిజీ లైఫ్‌కు అలవాటుపడిన తల్లిదండ్రులు పిల్లల మనస్థత్వాలను గమనించాలని, మంచిచెడులు వివరించాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.
అసలేం జరిగిందంటే..
అందరి పిల్లల్లా స్కూల్‌లో చదువుకోవాలి, ఆడుకోవాలని తొమ్మిదేళ్ల జేమెల్ మైల్స్ పదిరోజుల క్రితం స్కూల్‌లో చేరాడు. కానీ తను ఒక గే అని స్కూళ్లో నిర్భయంగా స్నేహితులకు చెప్పాడు. అప్పటినుంచి మైల్స్‌ను గేలి చేస్తూ హింసించేవారు. వేదింపులు హద్దులు దాటి ‘గే’లు సమాజంలో జీవించే హక్కు లేదు చనిపో అంటూ బెదిరించారు. దీంతో గత కొద్ది రోజులుగా డిప్రెషన్‌లోకి వెళ్లిన మైల్స్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అండగా ఉంటారనుకున్నాడు
తాను ఒక గే అయినా స్నేహితులు అండగ ఉంటారని మైల్స్ భావించాడని అతని తల్లి లియా పేర్కొన్నారు. స్నేహితులు వేధించే విషయం తమకు చెబితే బాధ పడతామనే ఉద్దేశంతో చెప్పెవాడు కాదని, కానీ తన అక్కతో చెప్పుకొని బాధపడేవాడని వివరించారు. మైల్స్ ఆత్మహత్యతోనైనా లింగ భేదం లేకుండా అందరూ సమానమనమే భావన వస్తే తన కొడుకు ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment