![Most expensive wine in the world Leon Verres masterpiece details - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/3/expensive-wine-in-the-world.jpg.webp?itok=p9Am3VNk)
మనం ఇప్పటి వరకు మునుపటి కథనాల్లో ఖరీదైన కారు గురించి, ఖరీదైన బైకు గురించి తెలుసుకున్నాం. అయితే ఈ కథనంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం (వైన్) ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం వోడ్కా అంటే చాలా మంది నమ్మక పోవచ్చు. దీని ధర రూ. 30 కోట్లు వరకు ఉంటుంది. భారతదేశంలో ఖరీదైన మద్యం అంటే సుమారు రూ. 30 నుంచి రూ. 40 వేలు వరకు ఉంటుంది. అలాంటిది 'లియోన్ వెర్రెస్ మాస్టర్‌పీస్' (Leon Verres Masterpiece) 3.7 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది.
నిజానికి ఈ మద్యం బాటిల్ కొనుగోలు చేసే ధరతో కొన్ని జీవితాలు సెటిల్ అయిపోతాయి అంటే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మద్యం ఇంత ధర ఉండటానికి ప్రధాన కారణం బాటిల్ 3000 వజ్రాలతో ఉంటుంది. అంతే కాకుండా ఈ బాటిల్ ఆకర్షణీయకంగా కనిపించేందుకు వైలెట్ హ్యూడ్ హెవీ గ్లాస్‌తో ఒక ప్రత్యేకమైన పూత ఉంటుంది.
(ఇదీ చదవండి: రైల్వే స్టేషన్‌లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?)
బాటిల్ లోపల ఉండే మద్యం ధర కంటే కూడా బాటిల్ ధర ఎక్కువ కావడం గమనార్హం. ఇది ఖరీదైన ప్లాటినం, రోడియం వంటి విలువైన లోహాల కలయికతో అందంగా తాయారు చేసి దానికి గోల్డ్ లేబుల్ అందించడం జరిగింది. బాటిల్ మొత్తం ఖరీదైన వజ్రాలతో తయారై ఉంటుంది కావున ధర భారీగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment