Vodka
-
ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?
మనం ఇప్పటి వరకు మునుపటి కథనాల్లో ఖరీదైన కారు గురించి, ఖరీదైన బైకు గురించి తెలుసుకున్నాం. అయితే ఈ కథనంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం (వైన్) ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం వోడ్కా అంటే చాలా మంది నమ్మక పోవచ్చు. దీని ధర రూ. 30 కోట్లు వరకు ఉంటుంది. భారతదేశంలో ఖరీదైన మద్యం అంటే సుమారు రూ. 30 నుంచి రూ. 40 వేలు వరకు ఉంటుంది. అలాంటిది 'లియోన్ వెర్రెస్ మాస్టర్‌పీస్' (Leon Verres Masterpiece) 3.7 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది. నిజానికి ఈ మద్యం బాటిల్ కొనుగోలు చేసే ధరతో కొన్ని జీవితాలు సెటిల్ అయిపోతాయి అంటే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మద్యం ఇంత ధర ఉండటానికి ప్రధాన కారణం బాటిల్ 3000 వజ్రాలతో ఉంటుంది. అంతే కాకుండా ఈ బాటిల్ ఆకర్షణీయకంగా కనిపించేందుకు వైలెట్ హ్యూడ్ హెవీ గ్లాస్‌తో ఒక ప్రత్యేకమైన పూత ఉంటుంది. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) బాటిల్ లోపల ఉండే మద్యం ధర కంటే కూడా బాటిల్ ధర ఎక్కువ కావడం గమనార్హం. ఇది ఖరీదైన ప్లాటినం, రోడియం వంటి విలువైన లోహాల కలయికతో అందంగా తాయారు చేసి దానికి గోల్డ్ లేబుల్ అందించడం జరిగింది. బాటిల్ మొత్తం ఖరీదైన వజ్రాలతో తయారై ఉంటుంది కావున ధర భారీగా ఉంటుంది. -
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై మహిళా నేత సంచలన ఆరోపణలు
దిస్పూర్: కాంగ్రెస్ యూత్ వింగ్(ఐవైసీ) జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేశారు అసోం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అంగ్కితీ దత్తా. ఆయన తనను ఆరు నెలలుగా వేధిస్తున్నాడని తెలిపారు. ఏం మందు తాగుతావ్, వొడ్కానా లేక టెకీలానా? అంటూ సందేశాలు పంపాడని చెప్పారు. జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సొంత పార్టీ నేతపై ఇలాంటి ఆరోపణలు చేయడం హస్తం పార్టీలో దుమారం రేపింది. అంగ్‌కితా దత్తా అసోం యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే అప్పటి అధ్యక్షుడు బీజేపీలో చేరడంతో ఈమెకు ఆ అవకాశం లభించింది. కానీ ఉన్నట్టుండీ ఈమెను బీవీ శ్రీనివాస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దీంతో అసలు ఏం జరిగిందో ఆమె వివరించారు. యూత్ కాంగ్రెస్ అసోం కార్యదర్శి వర్ధన్ యాదవ్ ద్వారా కూడా బీవీ శ్రీనివాస్ తనను అవమానించే వారని అంగ్‌కితా ఆరోపించారు. తన గురించి చులకనగా మాట్లాడేవారని చెప్పారు. అవినీతి చరిత్ర ఉన్న వర్ధన్‌కు అసలు ఆ పదవి ఎలా ఇచ్చారో అర్థంకావడం లేదన్నారు. ఓ కేసులో అతడు తిహార్ జైలుకు కూడా వెళ్లాడని చెప్పారు. వర్ధన్ తనతో అమర్యాదగా ప్రవర్తించిన విషయాన్ని బీవీ శ్రీనివాస్‌కు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన కూడా మెసేజ్‌లో అభ్యంతరకర సందేశాలు పంపేవారన్నారు. బీవీ శ్రీనివాస్ గురించి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లానని, అప్పటి నుంచి శ్రీనివాస్ వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అంగ్‌కితా ఆరోపణలను కాంగ్రెస్ యూత్ వింగ్ ఖండించింది ఆమె బీజేపీతో టచ్‌లో ఉందని చెప్పింది. తన ఆరోపణలు తప్పు అయితే విచారణకు పిలవచ్చు కదా? అని అంగ్‌కితా అన్నారు. బీవీ శ్రీనివాస్ సందేశాలు తన వద్ద ఉన్నాయన్నారు. అలాగే తాను సీఎం హిమంత బిశ్వ శర్మను కలిసినట్లు కూడా ఆమె అంగీకరించారు. ఓ మెంటల్ హెల్త్ కేర్ ప్రాజెక్టు కోసమే ఆయనతో సమావేశమైనట్లు తెలిపారు. దీన్ని అదునుగా తీసుకుని బీవీ శ్రీనివాస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని కమలం పార్టీ ఎంపీ ఫైర్.. -
పవన్‌కల్యాణ్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ట్వీట్స్ వైరల్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయన్ని పాన్ ఇండియా స్టార్‌గా చూడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పవన్-రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లానాయక్‌ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని కోరారు. ఇటీవలె విడుదల పుష్ప హిందీలో భారీ వసూళ్లు రాబట్టి మంచి సక్సెస్ సాధించిందని, మరి భీమ్లానియక్ ఇంకెంత కలెక్ట్ చేయాలి అంటూ ప్రశ్నించారు. ఇటీవలె అల్లు అర్జున్ గురించి పెట్టిన ట్వీట్స్ అన్నీ వోడ్కా టైంలో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు పాన్ ఇండి స్టార్లుగా అయిపోతుంటే, మీరు ఇంకా తెలుగులోనే సినిమాలు చేయడం మాకు బాధగా ఉంది. దయచేసి భీమ్లానాయక్‌ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయండి అని వర్మ వరుస ట్వీట్లతో హీటెక్కించారు. ప్రస్తుతం పవన్‌పై వర్మ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999 , @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 … @allu_arjun గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి @PawanKalyan — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 . @pawankalyan గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి. — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 -
1.5 లీటర్ల వోడ్కా ఛాలెంజ్.. చివరికి
మాస్కో : వోడ్కా ఛాలెంజ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. రష్యాకు చెందిన 60 ఏళ్ల యూరి దుషెచ్కిన్ అనే వ్యక్తి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి వోడ్కాను తాగడం ప్రారంభించాడు. అయితే 1.5లీటర్ల వోడ్కా తాగిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. యూట్యూబ్ లైవ్‌లో అందరూ చూస్తుండగానే ఇతను కన్నుమూశాడు. దీంతో ఈ సరదా ఛాలెంజ్ విషాదంగా ముగిసింది. వివరాల ప్రకారం.. లైవ్‌లో హాట్ సాస్ లేదా, వోడ్కాను తాగాల్సిందిగా ఓ యూట్యూబర్ సవాల్ విసిరాడు. ఈ ఛాలెంజ్ పూర్తిచేసిన వారికి రివార్డ్‌గా పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయని ప్రకటించాడు. దీంతో ఈ పోటీలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. ప్రత్యేకంగా ఏజ్ లిమిట్ ఏదీ విధించకపోవడంతో 60 ఏళ్ల వృద్ధుడు సైతం ఈ పోటీలో పాల్గొన్నాడు. (వైరల్: గుడిసెకు కాళ్లు వచ్చాయా?) లైవ్ స్ట్రీమింగ్‌లో అప్పటిదాకా ఎంతో హుషారుగా కనిపించిన ఆయన వోడ్కా సేవిస్తూ చనిపోవడం నెటిజన్లను షాక్‌కి గురిచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. రష్యన్ సెనేటర్ అలెక్సీ పుష్కోవ్ సైతం ఇలాంటి ప్రాణాంతకమైన ఛాలెంజ్‌లపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కొత్తగా ఎన్నోరకాల ఛాలెంజ్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సరదా సంగతి అటుంచితే, కొన్ని ప్రాణాల మీదకి తెస్తున్నాయి. దీంతో ఇలాంటి ఛాలెంజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. (53 ఏళ్లకు దొరికిన పర్స్, ఏదీ మిస్ అవ్వలేదు!) -
న్యూ ఇయర్ వేడుకల్లో ఆ కిక్కే లేదప్పా !
-
ఆ కిక్కే లేదప్పా!
నూతన సంవత్సర వేడుకల్లో తగ్గిన లిక్కర్ కిక్కు సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గ్రేటర్ పరిధిలో సుమారు రూ. వంద కోట్ల అమ్మకాలు సాగించాలని ఆబ్కారీ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా ఈ ఏడాది లిక్కర్ కిక్కు కాస్త తగ్గింది. న్యూ ఇయర్ వేడుకల్లో లిక్కర్ అమ్మకాలు భారీగా తగ్గాయి. పెద్ద నోట్ల రద్దు.. అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో మందుబాబులు.. కుర్రకారు వెనక్కి తగ్గడంతో ‘హాఫ్’ అమ్మకాలు మాత్రమే జరిగాయి. మొత్తంగా గ్రేటర్ పరిధిలో ఈసారి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో సుమారు రూ.55 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. గతేడాది ఈ రెండు తేదీల్లోనే ఏకంగా రూ.100 కోట్ల మద్యం అమ్ముడవడం విశేషం. గ్రేటర్ పరిధిలోని సుమారు 400 మద్యం దుకాణాలు, 500 బార్లు, మరో వంద పబ్‌లు, మరో వంద ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన కొత్త సంవత్సర వేడుక(ఈవెంట్స్)ల్లో గతంతో పోలిస్తే మద్యం, బీర్ల అమ్మకాలు భారీగా తగ్గాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు విశ్లేషించారు. వీటిలో 1,25,843 కేసుల ఐఎంఎల్ మద్యంను మందు బాబులు స్వాహా చేయగా.. ఏకంగా 1,76,293 కేసుల బీర్లను కుర్రకారు హాంఫట్ చేశారు. కిక్కు తగ్గడానికి కారణాలివే... పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో చాలా మంది న్యూ ఇయర్ ఈవెంట్స్‌కు దూరంగా ఉన్నారు. ఇళ్లలోనే సింపుల్‌గా వేడుకలు జరుపుకున్నారు. ఈవెంట్స్‌లో పాల్గొన్న వారు సైతం అడుగడుగునా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో ‘ఫుల్లు’ కొట్టలేదు. దీంతో మద్యం అమ్మకాలు తగ్గముఖం పట్టాయి. ఇక ఐఎంఎల్ మద్యం కంటే ఈసారి ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్న బీర్లు, వోడ్కా, బ్రీజర్ వంటి డ్రింక్లనే కుర్రకారు అధికంగా సేవించడం గమనార్హం. -
ఎలుక తల కొరికి.. మూడు పెగ్గులేశాడు!
సిడ్నీ: బతికివున్న తెల్ల ఎలుక తలను కొరికి తిన్న వీడియోను చిత్రించుకుని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన వ్యక్తిని మూడేళ్ల పాటు పెంపుడు జంతువులను పెంచకూడదని, బదులుగా సామాజిక సేవ చేయాలని ఆ దేశ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో మాథ్యూ మలోనీ(25) ఎలుకను కొరికి చంపిన వీడియోను ఆన్ లైన్ లో పోస్టు చేశాడు. ఆ వీడియోలో మలోనీ గదిలోకి ఓ తెల్ల ఎలుక తీసుకుని వెళ్లాడు. ఎలుకను తన నోట్లో పెట్టుకుని గట్టిగా దాని తల తెగిపోయేవరకూ కొరికాడు. ఆ తర్వాత నోటికి అంటుకున్న రక్తాన్నికడిగేందుకు మూడు పెగ్గులు వాడ్కాను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఫేస్ బుక్ లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ కోర్టులో హజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తులు మూగజీవాలపై రాక్షసత్వాన్ని ప్రదర్శించిన అతనికి 100 గంటలపాటు సామాజిక సేవ చేయాలని శిక్షను విధించారు. -
వోడ్కాకు సరిసాటి వేరొండు యేముండు?
కమ్యునిస్టుల డ్రింకు కల్లగాదు! దానిలోన నిమ్మ దానిమ్మ కలుపంగ వైనుతేయ! రుచిని వదలలేము! ‘మధు’రోక్తి తాగుతున్నప్పుడు వోడ్కా రుచిరహితం... తలకెక్కాకనే అది చిరస్మరణీయం - గ్యారిసన్ కీలర్, అమెరికన్ రచయిత విగర్ స్పిరిట్ వోడ్కా : 45 మి.లీ. వైట్ రమ్ : 15 మి.లీ. దానిమ్మరసం : 90 మి.లీ. లెమనేడ్ : 100 మి.లీ. గార్నిష్ : నిమ్మచెక్క, నిలువునా చీల్చిన పచ్చిమిర్చి ‘సిటీ’జనులను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కొందరు ‘స్పిరిటెడ్’, మరికొందరు ‘స్పిరిచ్యువల్’. వీరు కాకుండా, ఇంకొందరు ‘స్పిరిచ్యువల్లీ స్పిరిటెడ్’. ‘స్పిరిటెడ్’ పీపుల్ మాంచి ‘స్పిరిట్’ను మనసారా ప్రేమిస్తారు. ‘స్పిరిచ్యువల్ పీపుల్’ దానిని పూజిస్తారు. ‘స్పిరిచ్యువల్లీ స్పిరిటెడ్’ పీపుల్ తీరే వేరు. వారిదంతా అద్వైతం. తామే ‘స్పిరిట్’గా, ‘స్పిరిటే’ తాముగా తత్వ‘సారా’న్ని తలకెక్కించుకుంటారు. ప్రపంచంలో ఎందరు రాజకీయ సిద్ధాంతులున్నా, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత గల వారు కమ్యూనిస్టులేనని ఇప్పటికీ ప్రతీతి. నిజానికి కమ్యూనిస్టుల సామ్యవాద సిద్ధాంతం మధుశాలలోనే పుట్టి ఉంటుందని కొందరి నమ్మకం. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు వంటి పబ్లిక్ ప్లేసులెన్ని ఉన్నా, అలాంటి ప్రదేశాల్లో మనుషుల మధ్య వర్గ భేదాలు కొట్టొచ్చినట్టు బట్టబయలైపోతూనే ఉంటాయి. మధుశాలల్లో మాత్రమే అలాంటి శషభిషలేవీ ఉండవు. పెగ్గు మీద పెగ్గు ఖాళీ అవుతున్న కొద్దీ, సామ్యవాద సాంద్రత గాఢతరమవుతూ ఉంటుంది. సామ్యవాదం పరిఢవిల్లే తూర్పు యూరోపియన్ దేశాల్లో వోడ్కాకే అగ్రతాంబూలం. ఎనిమిది లేదా తొమ్మిదో శతాబ్దిలో ఇది రష్యాలో పుట్టిందా లేక పోలండ్‌లో పుట్టిందా అనేదానిపై కొంత గందరగోళం ఉంది. అయితే, సోవియట్ జమానా నుంచి రష్యన్ వోడ్కానే ప్రపంచ ప్రసిద్ధి పొందింది. పరబ్రహ్మ స్వరూపంలా దేనిలోనైనా విలీనమైపోగల వోడ్కాతో ఈవారం మీకోసం... - వైన్‌తేయుడు