వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయన్ని పాన్ ఇండియా స్టార్‌గా చూడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పవన్-రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లానాయక్‌ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని కోరారు. ఇటీవలె విడుదల పుష్ప హిందీలో భారీ వసూళ్లు రాబట్టి మంచి సక్సెస్ సాధించిందని, మరి భీమ్లానియక్ ఇంకెంత కలెక్ట్ చేయాలి అంటూ ప్రశ్నించారు.
ఇటీవలె అల్లు అర్జున్ గురించి పెట్టిన ట్వీట్స్ అన్నీ వోడ్కా టైంలో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్‌ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు పాన్ ఇండి స్టార్లుగా అయిపోతుంటే, మీరు ఇంకా తెలుగులోనే సినిమాలు చేయడం మాకు బాధగా ఉంది. దయచేసి భీమ్లానాయక్‌ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయండి అని వర్మ వరుస ట్వీట్లతో హీటెక్కించారు. ప్రస్తుతం పవన్‌పై వర్మ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999 , @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
… @allu_arjun గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి @PawanKalyan
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
. @pawankalyan గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి.
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
Comments
Please login to add a commentAdd a comment