
ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూతురు జన్మించిన విషయం అందరికి తెలిసిందే. లిటిల్ ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అపోలో హాస్పిటల్‌లో జన్మించిన ఈ చిన్నారిని చూడటానికి చిరంజీవి, వారి కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. అయితే వైద్యశాల నుంచి ఇంటికెళ్లే సమయంలో రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎంతోమందిని ఆకర్శించింది. ఇందులో చెప్పుకోదగ్గది ఆయన ఖరీదైన వాచ్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రిచర్డ్ మిల్లే బ్రాండ్
రామ్ చరణ్ కట్టుకున్న వాచ్ ధర రిచర్డ్ మిల్లే బ్రాండ్ అని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ. 1.62 కోట్లు కావడం గమనార్హం. అత్యంత ఖరీదైన వస్తువులను ఇష్టపడే చరణ్ వద్ద ఇప్పటికే యోహాన్ బ్లేక్, రోలెక్స్, పటేక్ ఫిలిప్, ఆర్ఎమ్ 61-01 యోహాన్ బ్లేక్ రిచర్డ్ మిల్లె వంటి మరిన్ని కాస్ట్లీ వాచ్‌లు ఉన్నాయి. వీటి ధర కూడా చాలా ఎక్కువని సమాచారం.
(ఇదీ చదవండి: ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! టాప్ 5 జాబితాలో ఎవరున్నారంటే?)
కేవలం వాచ్‌లు మాత్రమే కాకూండా కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ పోర్టోఫినో ఉన్నాయి. వీటితో పాటు చరణ్ ఒక సొంత ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నట్లు చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment