జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్‌కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు.
నెలకు రూ. 45,000..
వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్‌కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్‌షిప్.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment