ఒక సాధారణ సైకిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 20,000 రూపాయలు ఉండొచ్చు. కానీ ఇక్కడ కనిపించే సైకిల్ ధర మాత్రం ఏకంగా రూ. 32 లక్షలు. సైకిల్ ఏంటి? రూ. 32 లక్షలు ఏంటి? అని చాలామంది ఒక్కసారిగా షాకవొచ్చు! అయితే మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూసెయ్యండి.
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'బుగాటీ' (Bugatti) కంపెనీ 'పీజీ ఎక్స్' తయారు చేసింది. ఇది చూడటానికి సాధారణ సైకిల్ మాదిరిగా అనిపించినప్పటికీ ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది బుగాటీ చిరోన్ కారు నుంచి ప్రేరణ పొంది ఖరీదైన మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి తయారైంది.
2017 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో కనిపించిన ఈ పీజీ ఎక్స్ బుగాటీ కేవలం 667 యూనిట్లకు మాత్రమే పరిమితం. దీని ధర రూ. 39000 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 32 లక్షల కంటే ఎక్కువ).
ఈ సైకిల్ తయారీలో అగ్రశ్రేణి స్పోర్ట్స్ ఆటోమొబైల్స్, నాసా, ఏరోనాటిక్ దిగ్గజాలలో ఉపయోగించే హై-ఎండ్ మెటీరియల్స్ ఉపయోగించారు. ఈ సైకిల్‌ను 95 శాతం అధిక శక్తి కలిగిన కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు, కాబట్టి ఇది ఐదు కిలోల కంటే తక్కువ బరువును కలిగి ఉంది.
ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్‌చల్ చేశాడు - వీడియో
ప్రపంచంలో అత్యంత ఖరీదైన, తక్కువ బరువున్న సైకిల్ బహుశా ఇదే అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఒక సీటు కలిగిన ఈ సైకిల్ సింగిల్ వీల్ బ్రేక్ మాత్రమే కలిగి ఉంటుంది. పీజీ బుగాటీ సైకిల్ కార్బన్ ఫ్రేమ్‌ను ఫార్ములా వన్ కార్లను తయారు చేసే అదే కార్మికులు తయారు చేశారు. ఈ కారణంగానే దీని ధర చాలా ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment