పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లకు ప్రాధాన్యమిస్తున్న యువత
పరిమితికి మించి వేల నుంచి లక్షల దాకా ఖర్చు
తల్లిదండ్రులకు అదనపు ఆర్థిక భారంగా మారుతున్న వైనం
పెళ్లంటే..పందిళ్లు, బాజాలు, భజంత్రీలు, బంధువుల, విందు భోజనాలు...ఇది ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది. వివిధ రకాల ఫోటోషూట్లు వీటి స్థానాన్ని ఆక్రమించాయి. నేటి యువత పెళ్లి కంటే ప్రీ వెడ్డింగ్‌కే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. వీటితోపాటు పెళ్లి, రిసెప్షెన్ డ్రస్సులకు కూడా వేలు, ఒక్కోసారి లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు తమ చుట్టుపక్కల చూడదగిన రమణీయమైన ప్రాంతాలకు వెళ్లడం లేదా ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం చేస్తున్నారు.
కాబోయే జంటలను తీసుకెళ్లడానికి కార్లు, భోజనం మొదలుకుని బస చేయడానికి హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో గదుల బుకింగ్ పనులన్నిటినీ ఫొటోగ్రాఫర్లే చూసుకుంటారు. కొందరు ప్రీ వెడ్డింగ్‌కు రూ.25 వేల నుంచి 35 వేలు చార్జీలు తీసుకుంటుండగా మరికొందరు రూ.50–75 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంత హై ఫై సౌకర్యా లు కావాలంటే ఏకంగా రూ.90 వేల వరకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్‌మేనేజర్లకు డిమాండ్ పెరిగింది.
(ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!)
ఎంతైనా తగ్గేదేలే...
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. వారానికి కనీసం మూడు, నాలుగు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి. సాయంత్రమైందంటే చాలు భాజాభజంత్రీలు, బ్యాండ్‌ల మోతలతో బారాత్‌లు(పెళ్లి ఊరేగింపులు) తీస్తున్న దశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లంటే ఇంటి గుమ్మం ముందు లేదా ఖాళీ స్థలాల్లో జరిగేవి. కాని కాలం మారడంతో వాటికి స్వస్తి పలికి ఏసీ, నాన్ ఏసీ పంక్షన్ హాళ్లలో చేస్తున్నారు. ఫలితంగా హాళ్లకు డిమాండ్ పెరిగింది.ఇందుకోసం ఫొటోగ్రాఫర్లకు ఎంత చార్జీలు చెల్లించేందుకైనా వెనకాడడం లేదు. అయితే ఇది తమ తల్లిదండ్రులకు అదనపు భారంగా పరిణమిస్తుందని వధూవరులు గ్రహించలేక పోతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫొటోగ్రాఫర్లు, మ్యూజిక్ బ్యాండ్లు, సంప్రదాయ సంగీత వాద్య బృందాలకు కూడా డిమాండ్ పెరిగింది.
డిమాండ్‌కు తగ్గట్లుగా....
అమ్మాయిల కొరత కారణంగా గత రెండు, మూడేళ్లుగా పెళ్లిళ్లు ఎక్కువ శాతం జరగలేదు. దీనికి తోడు ముహూర్తాలు కూడా ఎక్కువగా లేకపోవడంవల్ల చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువ ఉండడంవల్ల ఎక్కడ చూసిన పెళ్లి సందడి కనిపిస్తోంది. ఫంక్షన్ హాళ్లన్నీ ఇప్పటికే రిజర్వై పోయి ఉండటంతో అందుబాటులో ఉన్న స్కూళ్లు, కాలేజీ గ్రౌండ్లు, క్రీడా మైదానాలలో కూడా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఒకప్పుడు ముహూర్తాలు చూసుకుని ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకునేవారు.
(చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!)
కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఏ రోజు హాలు ఖాళీ ఉందో ఆరోజు ముహూర్తం పెట్టుకోవల్సిన పరిస్ఠితి వచి్చంది. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, బాంక్వేట్ హాళ్లలో వేడుకలకు ఖర్చు తక్కువ కావడంతోపాటు బంధువులకు భద్రత, విలువైన వస్తువులకు రక్షణ ఎక్కువ. కానీ గ్రౌండ్లలో, ఖాళీ మైదానాలలో పెళ్లి చేయాలంటే చాలా ఖర్చు చేయాల్సిఉంటుంది. భారీ వేదిక, చుట్టుపక్కల, పైన టెంట్లు నిర్మించడం, గాలికి దుమ్ము, ధూళి లేవకుండా మైదానంలో కార్పెట్లు వేయడం, కళ్లు జిగేల్‌మనిపించే విద్యుత్ దీపాలు, సిరీస్ లైట్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్ధలం కేటాయించడం, విలువైన వస్తువులు దొంగతనానికి గురికాకుండా కాపాడుకునేందుకు, బిచ్చగాళ్లు, బయట వ్యక్తులు వచ్చి భోజనం చేయకుండా చూసేందుకు ప్రైవేటు సెక్యురిటీ గార్డులను నియమించడం... ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని.
మరోపక్క డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని లౌడ్‌స్పీకర్ల యజమానులు, బ్రాస్ బ్యాండ్ నిర్వాహకులు, బారాత్‌లకు అద్దెకిచ్చే ఓపెన్ టాప్ కార్లు, మెర్సిడీస్ బెంజ్ వాహనాలు, గుర్రపు బండ్ల యజమానులు అడ్డగోలుగా చార్జీలు పెంచేశారు.
మేకప్‌కు కూడా లక్షల్లోనే...
ఈ ఖర్చులన్నీ ఒక ఎత్తైతే వధూవరులు అనవసరంగా చేస్తున్న ప్రీ వెడ్డింగ్, మేకప్ ఖర్చులు హద్దులు దాటుతున్నాయి. వధూవరులతోపాటు బంధువుల మేకప్‌కు సైతం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment