Lamborghini Launched Expensive Cycles In Market, Check Price Details And Features - Sakshi
Sakshi News home page

Lamborghini: ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?

Published Mon, Jun 19 2023 3:23 PM | Last Updated on Mon, Jun 19 2023 4:09 PM

Lamborghini expensive cycles price variants and details - Sakshi

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) అనగానే మొదట గుర్తొచ్చేది లగ్జరీ కార్లు. అయితే ఈ సంస్థ ఖరీదైన కార్లను మాత్రమే కాకుండా సైకిల్స్ కూడా విడుదల చేస్తుందని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ఒక సైకిల్ విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

లంబోర్ఘిని విడుదల చేసిన ఈ సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి రేస్​మ్యాక్స్​ ఎక్స్​ ఆటోమొబిలి లంబోర్ఘిని, స్ట్రాడా ఎక్స్​ ఆటోమొబిలి లంబోర్ఘిని. వీటి ధరలు వరుసగా 9,899 డాలర్లు (రూ. 8,15,365), 8,999 డాలర్లు (రూ. 7,41,226). కంపెనీ ఈ సైకిల్స్ విడుదల చేయడానికి ప్రత్యేకంగా 3టి అనే సంస్థతో జత కట్టింది.

(ఇదీ చదవండి: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్ - ధర ఎంతో తెలుసా?)

ఈ లేటెస్ట్ లంబోర్ఘిని సైకిల్స్ 51, 54, 58 సెంటీమీటర్ల లిమిటెడ్ సైజుల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సైకిల్స్ డెలివరీకి సుమారు 16 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. రేస్​మ్యాక్స్​ ఎక్స్​ ఆటోమొబిలి​ లంబోర్ఘిని అనేది ఒక లైట్​వెయిట్​ మోడల్​. దీనిని 3టీ కార్బన్​ పరికరాలతో తయారు చేశారు. ఈ సైకిల్ ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఎక్స్​ప్లోరో రేస్​మ్యాక్స్​ ఎక్స్​ హరికెన్​ స్టెరెట్టో సైకిల్​ను పోలి ఉంటుంది.

రెండవ మోడల్​ స్ట్రాడా ఎక్స్​ ఆటోమొబిలిని ప్రత్యేకంగా కంఫర్ట్​, ఎయిరోడైనమిక్స్​ కోసం రూపొందించారు. ఇందులో ఎస్​ఆర్​ఏఎం ఫోర్స్​ పరికరాలు ఉంటాయి. 3టీతో జతకట్టి లంబోర్ఘిని విడుదల చేసిన మూడవ సైకిల్ ఇది కావడం గమనార్హం​. ఇప్పటికే సంస్థ 2018లో ఆర్​5 ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్ రూపొందించింది. అప్పట్లో ఇది కేవలం 63 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement