గత నెలలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ఓపెన్ ఏఐ(OpenAI) సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' ఇటీవల ఓ ఖరీదైన కారులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో కనిపించే ప్రత్యేకమైన సూపర్‌కార్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథనంలో ఆ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
వెల్థినెక్స్‌జెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే వీడియోలో అత్యంత ఖరీదైన 'మెక్‌లారెన్ F1' సూపర్ కారును చూడవచ్చు. 1992లో ప్రారంభమైన ఈ కారు ధర భారతదేశంలో రూ. 167 కోట్ల కంటే ఎక్కువే. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన సూపర్ కార్ల జాబితాలో ఒకటి కావడం గమనార్హం.
శామ్ ఆల్ట్‌మాన్ తన మెక్‌లారెన్ ఎఫ్1 సూపర్‌కార్‌లో కాలిఫోర్నియాలోని ఫ్యూయెల్ స్టేషన్ వద్ద ఉంటడం వీడియోలో చూడవచ్చు. వెర్మిలియన్ రెడ్ కలర్‌లో కనిపించే ఈ కారు సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ కారుని స్వయంగా ఆల్ట్‌మాన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం గమనించవచ్చు.
మెక్‌లారెన్ ఎఫ్1
నిజానికి కారు అనగానే అందులో కనీసం నలుగురు కూర్చోవడానికి సీట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ కనిపించే మెక్‌లారెన్ ఎఫ్1 మూడు సీట్ల కారు. మధ్యలో డ్రైవర్ సీటింగ్ పొజిషన్‌తో కేవలం ఒకే సీటు ఉంటుంది. వెనుకవైపు ఇద్దరు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కారును 1992లో ప్రముఖ కార్ డిజైనర్ 'గోర్డాన్ ముర్రే' ప్రత్యేకంగా తయారుచేశారు. ఇవి కేవలం 106 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు.
మెక్‌లారెన్ ఎఫ్1 సూపర్ కారులో 6.1 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 627 పీఎస్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన ఈ కారు సుమారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు రూ. 386 కిమీ/గం కావడం గమనార్హం.
ఇదీ చదవండి: నాలుగు అపార్ట్‌మెంట్లను అమ్మేసిన శ్రీదేవి ఫ్యామిలీ!
మెక్‌లారెన్ ఎఫ్1 కారు ఇప్పటికే రోవాన్ అట్కిన్సన్ (మిస్టర్ బీన్), ఎలోన్ మస్క్ వద్ద కూడా ఉంది. అయితే రోవాన్ అట్కిన్సన్ కొన్ని రోజుల తరువాత ఈ కారుని విక్రయించినట్లు సమాచారం, మస్క్ మాత్రం ఈ కారును ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment