సౌరవిద్యుత్తు వాడుక ఇప్పుడిప్పుడే వ్యాప్తిలోకి వస్తోంది. ఇంటికి సౌరవిద్యుత్తు అమర్చుకోవాలంటే, పైకప్పులో చాలాభాగం సౌరఫలకాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండేవారికి ఇదంతా కుదిరే పనికాదు. అందువల్ల సౌరవిద్యుత్తుపై ఆసక్తి ఉన్నా, నగరాల్లో అపార్ట్‌మెంట్లలో ఉండే జనాలు సౌరవిద్యుత్తు జోలికి పోవడం లేదు.
ఈ సమస్యను గమనించి, జపాన్‌కు చెందిన ‘ఇకో ఫ్లో’ బాల్కనీలో కూడా అమర్చుకోవడానికి వీలైన కాంపాక్ట్ పోర్టబుల్ సోలార్ పవర్ జెనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పవర్ జెనరేటర్‌తో పాటు ఉండే నాలుగు సౌరఫలకాలను బాల్కనీలో ఎండ సోకే ప్రదేశంలో పెట్టుకుంటే చాలు.
(ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!)
దీని ద్వారా ఏడాదికి దాదాపు 1040 కిలో వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే, ఒక ఇంటి అవసరాలకు ఈ విద్యుత్తు పూర్తిగా సరిపోతుంది. దీనిని అరగంట లోపే కోరుకున్న చోట అమర్చుకోవచ్చు. ఆరుబయట పిక్నిక్‌లకు తీసుకువెళ్లేందుకు కూడా ఇది చాలా అనువుగా ఉంటుంది. దీని ధర 2,049 పౌండ్లు (రూ.2.10 లక్షలు) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment