Most Expensive Liquor Bottles In The World, Even Single Sip Is In Lakhs - Sakshi
Sakshi News home page

వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్‌.. ఖాళీ బాటిల్‌ కూడా ఖరీదే గురూ!

Published Tue, Mar 28 2023 3:26 PM | Last Updated on Tue, Mar 28 2023 4:01 PM

Most Expensive Liquor Bottles In The World, Even Single Sip Is In Lakhs - Sakshi

మద్యం తాగితే తెలియని కిక్ వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని లిక్కర్ బ్రాండ్‌ల ధరలు వింటే మాత్రం ఎక్కిన కిక్కు కూడా దిగిపోతుంది. ప్రపంచంలో ఖరీదైన ఆల్కహాల్ బ్రాండ్‌లు ఎవరు ఎక్కువగా వినియోగిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే కొంతమంది ఎంత ఖరీదైన పర్లేదు గానీ ఈ కాస్ట్లీ లిక్కర్‌ను ఒక్కసారైన తాగాలని ఆసక్తి చూపుతారట. దీంతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాలపై ఓ లుక్కేద్దాం!

టెకీలా లీ 925 (Tequila Lee .925) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్‌గా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మద్యాన్ని సేవిస్తే ఎంత మత్తు ఎక్కుతుందో తెలీదు దీన ధర వింటే మాత్రం తాగింది దిగిపోతుంది. దీని ధర దాదాపు రూ. 25 కోట్లట. ఈ లిక్కర్‌ ఎందుకంత ఖరీదంటే..  సీసాలో 6400 వజ్రాలు పొదిగినవి ఉండడమే. హెన్రీ IV డుడోగ్నే కాగ్నాక్ ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన వైన్. ఈ బ్రాండ్ మద్యం బాటిల్ ఖరీదు 56 లక్షల 93 వేల రూపాయలు. దాని బాటిల్ కూడా 24 క్యారెట్ల బంగారం అమరిక ఉండగా దీన్ని ప్లాటినంతో తయారు చేస్తారట. దీంతో ఈ  తరహావి.. మద్యం లేకపోయినా కేవలం ఖాళీ సీసాలు కూడా ఎక్కువ ధరకే పలుకుతాయట.

ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపైన్ అంటే.. అమండా డి బ్రిగ్నాక్ మిడాస్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ షాంపైన్ ఒక్క బాటిల్ ధర దాదాపు రూ.1 కోటి 40 లక్షల రూపాయలు ఉంటుంది. అత్యంత ఖరీదైన రెడ్‌ వైన్‌ ధర తెలిస్తే షాక్ అవుతారు. పెన్ఫోల్డ్స్ ఆంపౌల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెడ్ వైన్. ఈ బ్రాండ్‌ రెడ్‌ వైన్‌ ఒక బాటిల్ రేటు వచ్చేసి కోటి రూపాయలు పై మాటే ఉంటుందట. ఈ ఖరీదైన మద్యం ధరలు వింటే మద్యం మత్తులో ఉన్న జనం షాక్ అవ్వాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement