Most Expensive Ganesha Idol: వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ప్రజలు తమ స్తోమతను బట్టి విగ్రహాలను కొనుగోలు చేసి ఆరాధిస్తూ ఉంటాడు. అయితే సూరత్ వ్యాపారవేత్త వద్ద ఉన్న గణేష్ ప్రతిమ మాత్రం చాలా ప్రత్యేకం, అంతే కాకుండా ఇది చాలా ఖరీదైనది కూడా. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి ఇది ఒక వజ్రం ముక్క. వినాయకుడిని పోలి ఉండటం వల్ల ప్రతి ఏటా దీనికి పూజలు చేసి, నిమజ్జం కార్యక్రమంలో భాగంగా తాపీ నది జలాలను విగ్రహం మీద చల్లుతారు. దీనిని 2005వ సంవత్సరంలో రూ. 29,000లతో కాంగోలోని మ్బుజీ గని నుంచి వేలంలో భాగంగా రాజేష్ పాండవ్ అనే వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసాడు.
ఈ వజ్రం ఇండియాకు తీసుకువచ్చిన తరువాత వినాయకుని రూపంలో ఉండటం గమనించి దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విగ్రహం పొడవు 24.11 మిమీ, వెడల్పు 16.49 మిమీ వరకు మాత్రమే ఉంది. ఇది 27.74 క్యారెట్స్ డైమండ్. దీనిని 2016లో వజ్రాల పరిశ్రమకు సంబంధించిన వార్షిక ప్రదర్శనలో కూడా ప్రదర్శించాడు. అప్పటి నుంచి దీనికి విస్తృత ప్రచారం లభించింది.
ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే..
ఈ ప్రతిమను కొనుగోలు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారని. అయితే దానిని విక్రయించే ఆలోచన తనకు లేదని వజ్రాల వ్యాపారి స్పష్టం చేసాడు. సంవత్సరటం మొత్తం దానిని జాగ్రత్తగా ఉంచి, పండుగ సమయంలో మాత్రమే బయటకు తీస్తామని తెలిపాడు. దీని విలువ ఇప్పుడు సుమారు రూ. 500 కోట్లు వరకు ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment