Diamond merchant
-
రూ.500 కోట్ల ఖరీదైన వినాయకుడు.. ఎక్కడుందో తెలుసా?
Most Expensive Ganesha Idol: వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ప్రజలు తమ స్తోమతను బట్టి విగ్రహాలను కొనుగోలు చేసి ఆరాధిస్తూ ఉంటాడు. అయితే సూరత్ వ్యాపారవేత్త వద్ద ఉన్న గణేష్ ప్రతిమ మాత్రం చాలా ప్రత్యేకం, అంతే కాకుండా ఇది చాలా ఖరీదైనది కూడా. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఇది ఒక వజ్రం ముక్క. వినాయకుడిని పోలి ఉండటం వల్ల ప్రతి ఏటా దీనికి పూజలు చేసి, నిమజ్జం కార్యక్రమంలో భాగంగా తాపీ నది జలాలను విగ్రహం మీద చల్లుతారు. దీనిని 2005వ సంవత్సరంలో రూ. 29,000లతో కాంగోలోని మ్బుజీ గని నుంచి వేలంలో భాగంగా రాజేష్ పాండవ్ అనే వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసాడు. ఈ వజ్రం ఇండియాకు తీసుకువచ్చిన తరువాత వినాయకుని రూపంలో ఉండటం గమనించి దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విగ్రహం పొడవు 24.11 మిమీ, వెడల్పు 16.49 మిమీ వరకు మాత్రమే ఉంది. ఇది 27.74 క్యారెట్స్ డైమండ్. దీనిని 2016లో వజ్రాల పరిశ్రమకు సంబంధించిన వార్షిక ప్రదర్శనలో కూడా ప్రదర్శించాడు. అప్పటి నుంచి దీనికి విస్తృత ప్రచారం లభించింది. ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. ఈ ప్రతిమను కొనుగోలు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారని. అయితే దానిని విక్రయించే ఆలోచన తనకు లేదని వజ్రాల వ్యాపారి స్పష్టం చేసాడు. సంవత్సరటం మొత్తం దానిని జాగ్రత్తగా ఉంచి, పండుగ సమయంలో మాత్రమే బయటకు తీస్తామని తెలిపాడు. దీని విలువ ఇప్పుడు సుమారు రూ. 500 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
వజ్రాల వ్యాపారం.. వందల కోట్ల సంపద- సన్యాసుల్లో కలిసిపోయారు!
అందరూ కస్టపడి సంపాదించి జీవితంలో కుబేరులు కావాలని, విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కంటూ ఉంటారు. అయితే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్యామిలీ మాత్రం కోట్ల సంపదను వదిలి సన్యాసుల్లో కలిసిపోయారు. ఇంతకీ వారెవరు? ఎందుకిలా చేశారు? వారి సంపాదన ఎలా ఉండేదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. కొంతమంది ఆస్తులు లేకున్నా జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మరి కొంతమంది ఎన్ని ఆస్తులున్నా మనశ్శాంతి లేకుండా జీవిస్తుంటారు. గుజరాత్ రాష్ట్రంలో ధనవంతులైన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య కోట్ల సంపదను.. విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. ఈ వజ్రాల వ్యాపారి కుమార్తె ఇప్పటికే తన తొమ్మిదవ ఏటనే సన్యాస దీక్షను తీసుకుంది. ఇదీ చదవండి: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ - అదేంటో తెలుసా? ఇప్పుడు ఆమె తల్లి తండ్రులు కూడా సన్యాసులుగా మారారు. సంవత్సరానికి రూ. 15 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే ఫ్యామిలీ అన్ని వదిలి సన్యాసిగా మారడంతో ఎంతోమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. షా కుమారుడు భాగ్యరత్న అతని దీక్షా వేడుకకు ఫెరారీలో, అతని తల్లిదండ్రులు దీపేష్ & పికా అదే జాగ్వార్లో ప్రయాణించారు. తమ కుమార్తె ఇప్పటికే సన్యాసంలో కలిసిపోవడం వల్ల వీరు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. సన్యాసంలో చేరకముందే వారు అలాంటి జీవితం గడపాలని నిర్ణయించుకుని దీపేష్ షా 350 కిమీ, అతని భార్య పికా షా 500 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. మా కుమార్తె సన్యాసంలో స్వీకరించినప్పుడే ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు దీపేష్ షా వెల్లడించారు. జీవితంలో ఎన్నెన్నో విజయాలను చూసాను, కానీ అంతిమంగా శాంతి, ఆనందం కోసం ఈ దీక్ష స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు? దీపేష్ షా తండ్రి ప్రవీణ్ బెల్లం, చెక్కర వ్యాపారం చేసేవాడు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తోంది. అయినప్పటికీ భౌతిక సుఖాలు, విలాసాలు శాశ్వతం కాదని ఇప్పుడు జైన మతంలో సన్యాసులుగా చేరి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. -
నీరవ్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నీరవ్ కంపెనీలకు చెందిన రత్నాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసినట్లు తెలిపింది. సుమారు రూ.16వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ప్రస్తుతం యూకేలో జైలు శిక్ష అనుభవిస్తున్న నీరవ్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొంది. తాజా జప్తుతో కలిపి నీరవ్‌కు చెందిన మొత్తం రూ.2,650 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లయిందని వివరించింది. -
మంచి పరిణామమేగానీ...
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ. 14,000 కోట్ల మేర కుచ్చు టోపీ పెట్టి హఠాత్తుగా 2018 ఫిబ్రవరిలో మాయమై చివరకు ఆ మరుసటి ఏడాది లండన్‌లో పట్టుబడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించవచ్చంటూ బ్రిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు కీలక మైనది. భారత్‌కు పంపితే తన మానవ హక్కులు హరించుకుపోతాయని నీరవ్ చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. తనను నిర్బంధించే జైలు సౌకర్యవంతంగా వుండదన్న వాదనను కూడా కొట్టిపారేసింది. బ్యాంకు సిబ్బంది తోడ్పాటుతో మోసపూరితంగా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్ఓయూ)లను అపహరించి, వాటి ఆధారంగా భారీ మొత్తంలో డబ్బు కైంకర్యం చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తుండగా... ఆ నిధులు సరిహద్దులు దాటిన వైనాన్ని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. సాక్ష్యాధారాలు మాయం చేయటం, సాక్షుల్ని బెదిరించటం, వేధించి ఒకరి మరణానికి కారకుడు కావటం వంటి ఆరోపణలు కూడా ఆయనగారిపై వున్నాయి. కేవలం బ్యాంకు సొమ్ము కొట్టేయాలన్న ఏకైక ఉద్దేశంతో వ్యాపారం పేరు చెప్పి నీరవ్ మోదీ ఏడేళ్ల వ్యవధిలో వేల కోట్లు కొట్టేశారు. అయినా సులభంగా దేశం విడిచి పారిపోగలిగాడు. అతనికి రెండేళ్ల ముందు మరో ఎగవేతదారు విజయ్ మాల్యా సైతం ఈ మాదిరే పరారయ్యాడు. మాల్యాను దేశం తీసుకు రావటానికి చేసిన ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదు. రకరకాల సాకులు చెబుతూ, ఏవేవో అభ్యంతరాలు లేవనెత్తుతూ మాల్యా అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. నీరవ్ మోదీ ఎప్పటికి వస్తాడన్నది ఎవరూ చెప్పలేరు. అయితే మాల్యా బెయిల్ తీసుకోగా, ప్రస్తుతానికైతే నీరవ్ మోదీ జైల్లో వున్నాడు. ఆయన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే వుంది. మన బ్యాంకుల చేతగానితనానికి, వాటిలో ఉన్నత స్థాయిలో పనిచేసేవారి చేతివాటుతనానికి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తదితరులు నిదర్శనం. ఒక సాధారణ వ్యక్తి రుణం తీసుకోవటానికి ప్రయత్నిస్తే సవాలక్ష య„ý ప్రశ్నలేసే బ్యాంకులు ఇలాంటి మోసగాళ్లముందు ఎంత సులభంగా మోకరిల్లుతాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2011లో నీరవ్ మోసపూరిత పనులకు పాల్పడటం మొదలుపెడితే 2018 వరకూ... అంటే ఏడేళ్లపాటు అవి యధేచ్ఛగా సాగిపోయాయి. రికార్డుల్లో ఎక్కడా చూపకుండా నీరవ్ మోదీ, ఆయన సంబంధీకులు ఎల్వోయూలను ఉపయోగించుకుని విదేశీ ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. తమ ఖాతాదారు చెల్లించాల్సిన మొత్తానికి పూచీపడుతూ బ్యాంకులు ఈ ఎల్ఓయూలు జారీ చేస్తాయి. వీటి ఆధారంగానే విదేశాల్లోని బ్యాంకులు రుణాలిస్తాయి. అలా ఇచ్చేముందు ఎల్ఓయూ జారీ చేసిన బ్యాంకును సంప్రదిస్తాయి. ఇవన్నీ ‘సజావుగానే’ పూర్తయ్యాయి! వేల కోట్లు నీరవ్ మోదీ చేతుల్లో వాలిపోయాయి. ఈ మొత్తం వ్యవహారమంతా మన బ్యాంకింగ్ వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెట్టింది. పకడ్బందీ తనిఖీ వ్యవస్థ అనుకున్నది సైతం ఏడేళ్లపాటు అక్కరకు రాకుండా పోయిందంటే...ఏటా జరిగితీరాల్సిన అంతర్గత ఆడిటింగ్‌లో కూడా ఇది దొరకలేదంటే ఏమను కోవాలి? ఈ లావాదేవీలు ఎక్కడా నమోదు కాకుండా నీరవ్ చూడగలిగాడు. అందుకే మొదట్లో బ్యాంకుకు రూ. 11,300 కోట్ల మేర నష్టం జరిగిందని లెక్కేయగా...తవ్వినకొద్దీ అది పెరగటం మొదలెట్టింది. నీరవ్ మోసాన్ని యధేచ్ఛగా సాగనీయటమే కాదు...‘మోసం బట్టబయలైంద’ని ఆ బ్యాంకులో కీలక బాధ్యతల్లో వున్నవారు ఉప్పందించారు. ఇది జరిగాకైనా బ్యాంకులు అప్రమత్తంగా వున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు 2019–20 సంవత్సరంలో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే బ్యాంకింగ్ మోసాలు రెండున్నర రెట్లు పెరిగాయి. నీరవ్ మోసం వెల్లడైన 2018–19లో ఈ మాదిరి మోసాల పరిమాణం మొత్తంగా రూ. 71,500 కోట్లు కాగా...2019–20లో అది రూ. 1.85 లక్షల కోట్లకు చేరుకుంది. మరి నీరవ్ కేసు బ్యాంకుల్ని ఏం అప్రమత్తం చేసినట్టు? మోసాలను నివారించటం సంగతలా వుంచి...వాటిని వెనువెంటనే గుర్తించటంలో, మాయగాళ్లను చట్టానికి పట్టివ్వటంలో బ్యాంకులు బాగా వెనకబడి వున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. నీరవ్ మోదీ ఇక్కడ కూడబెట్టిన ఆస్తుల్ని బ్యాంకులు స్వాధీనం చేసుకోగలిగాయి. కానీ ఈ కొట్టేసిన డబ్బంతా పెట్టి అంతకు అనేక రెట్లు విలువచేసే విలాసవంతమైన భవంతుల్ని, ఇతర ఆస్తుల్ని లండన్, న్యూయార్క్‌వంటి చోట్ల అతను కొనుగోలు చేశాడు. అతని ఆచూకీ రాబట్టడంలో మన నిఘా విభాగాలు విఫలమైనా, బ్రిటన్ దినపత్రిక ‘డైలీ టెలిగ్రాఫ్’ పాత్రికేయులు ముగ్గురు నీరవ్‌ను గుర్తించి బయటపెట్టారు. ఇప్పుడు బ్రిటన్ కోర్టులో నీరవ్ వాదన వీగిపోయేలా చూడ టంలో మన న్యాయవాదులు విజయం సాధించటం సంతోషించదగ్గదే. అయితే ఇదింకా అయి పోలేదు. నీరవ్ వినతిపై బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ నిర్ణయం తీసుకోవాలి. అందుకామెకు గరిష్టంగా రెండు నెలల సమయం పట్టొచ్చు. ఆమె నిర్ణయం తనకు ఆమోదయోగ్యం కానట్టయితే ఆ తర్వాత మరో 14 రోజుల్లో నీరవ్ హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అక్కడ విచారణ ఎన్నాళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇదంతా సాధ్యమైనంత త్వరగా పరిష్కారమై, నీరవ్‌ను ఇక్కడికి తీసుకొచ్చి విచారించి శిక్షించగలిగితే ఈ తరహా మోసగాళ్లకు అదొక గుణపాఠమవుతుంది. -
వజ్రాల వ్యాపారి కళ్లుగప్పి రంగురాయితో పరారీ
బంజారాహిల్స్: అరుదైన, ఖరీదైన ఎమరాల్డ్ స్టోన్‌ను అమ్మిస్తానంటూ వజ్రాల వ్యాపారి కళ్లుగప్పి రంగురాయితో సహా పరారైన ముగ్గురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి, సెక్టార్ ఎస్ఐ రామిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జునైద్ తన వద్ద ఉన్న 111 క్యారెట్ ఎమరాల్డ్ స్టోన్‌ను విక్రయించేందుకు అదే ప్రాంతానికి చెందిన బ్రోకర్ ప్రకాష్‌ను సంప్రదించాడు. సుమారు రూ. 25 లక్షల విలువైన ఈ అరుదైన వజ్రాన్ని హైదరాబాద్‌లో లాభంతో విక్రయించవచ్చని అక్కడ తమకు తెలిసినవాళ్లు ఉన్నారంటూ నర్సింహరావు అలియాస్ సంపత్, సురేష్‌కుమార్‌లను పరిచయం చేశారు. గత నెల 30న జునైద్ వజ్రాన్ని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి సురేష్‌ను కలిశాడు. ల్యాబ్‌టెస్ట్ తర్వాతే తీసుకుంటానని సురేష్ చెప్పడంతో బంజారాహిల్స్ రోడ్ నెం. 8లోని గోల్కొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైమండ్స్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. వజ్రాన్ని జునైద్ నుంచి తీసుకొని ల్యాబ్‌లోపలికి వెళ్లారు. పథకం ప్రకారం వైజాగ్‌కు చెందిన సంపత్, సురేష్ లోనికి వెళ్లి టెస్ట్‌లు చేస్తున్నట్లు నటిస్తూ గందరగోళం సృష్టించి పక్క గేటు నుంచి బయటకు ఉడాయించారు. అప్పటికే అక్కడ కారులో సిద్ధంగా ఉన్న రాంబాబు సంపత్, సురేష్లను ఎక్కించుకొని వజ్రంతో సహా పరారయ్యారు. బాధితుడు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు బృందంగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేస్తున్న సమయంలో సంపత్ తన వద్ద ఉన్న తుపాకీని పోలీసులపైకి ఎక్కిపెట్టి బెదిరింపులకు పాల్పడటంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి కంట్రీమేడ్ తుపాకీ, పది బుల్లెట్లు, గ్రీన్ కలర్ ఎమరాల్డ్ స్టోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంపత్, రాంబాబు, సురేష్‌లపై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద, సురేష్‌పై అక్రమ ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పోలీసుల అదుపులో ప్రముఖ నటి
సాక్షి, ముంబై : ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ ఉడాని అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసులో రాజకీయ నాయకుడు సచిన్ పవార్‌ను అరెస్టు చేసిన పోలీసులు, టీవీ నటి దెవోలినా భట్టాచార్యను విచారణ నిమిత్తం పోలీసు స్టేషనుకు పిలిపించారు. సుమారు రెండు గంటల పాటు ఆమెను విచారించారు. దెవోలినాతో పాటుగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీమణులను విచారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివరాలు... రాజేశ్వర్ ఉడాని గత వారం రోజులుగా కనిపించకుండా పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డిసెంబరు 5న ఆయన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో రాయ్‌గఢ్ జిల్లాలోని అడవుల్లో లభ్యమైంది. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేశ్వర్ కాల్‌డేటా ఆధారంగా అదృశ్యమవడానికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడన్న అంశాలపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే దెవోలినా భట్టాచార్యను విచారించినట్లు తెలుస్తోంది. కాగా, సచిన్ పవార్ ద్వారా పలువురు మహిళలతో రాజేశ్‌కు పరిచయం ఏర్పడింది. సినీ ఇండస్ట్రీ మహిళలు, బార్ డాన్సర్లతో అతడు రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండేవాడని కాల్‌డేటా ఆధారంగా వెల్లడైంది. ఇక ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న దెవోలినా.. ప్రముఖ హిందీ చానల్లో ప్రసారమైన ‘సాథ్ నిబానా సాథియా’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఈ సీరియల్లో నటనకు గానూ ఉత్తమ నటిగా అవార్డు కూడా దక్కించుకుంది. తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ ద్వారా ‘గోపిక’ గా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ ఉడానీ -
రూ.8500కే ఢోలకియా కార్!
అహ్మదాబాద్ : గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా పేరు తెలియని వారుండరు. అదేనండి దీపావళి కానుకగా తన సంస్థ ఉద్యోగులకు ప్రతి ఏడు ఏదో భారీ బహుమతులిస్తాడు చూడు ఆయనే. ఈ ఏడాది కూడా దీపావళి కానుకగా సంస్థలోని 1,700 మందికి కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను ఇచ్చారు. అయితే దీన్నే క్యాచ్ చేసుకోని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారు కేడీ గాళ్లు. సావ్జీ ఢోలకియా పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రూ.8,500కే కారిస్తున్నట్లు జనాలను మోసం చేయాలని చూశారు. ఢోలకియా తన ఉద్యోగులకు కార్లు పంచుతున్న ఫొటోలను షేర్ చేస్తూ వాటికి క్యాప్షన్‌గా ‘రూ.8500 కే కార్ అనే స్కీమ్’ను వాటికి బ్యాంక్ ఖాతా వివరాలను జత చేసి ప్రచారం చేశారు. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైతే రూ.8500 జమచేస్తారో వారి అకౌంట్స్‌లో ఢోలకియా రూ.6 లక్షలు డిపాజిట్ చేస్తారని పేర్కొన్నారు. ఈ మోసాన్ని పసిగట్టిన బ్యాంక్ అధికారులు ఢోలకియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమారు ఐదు ఫేక్ ఐడీలను గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఉద్యోగులకు బొనాంజా -
ఉద్యోగులకు బొనాంజా
సూరత్‌లో జరిగిన కార్యక్రమంలో వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా తన సంస్థ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఇచ్చిన కొత్త కార్లు ఇవి. ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ సంస్థలోని 1,700 మంది వజ్రాల నిపుణులు, ఇంజనీర్లకు కానుకగా కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను ఇచ్చారు. మరోవైపు, ఢోలకియా గురువారం ఢిల్లీలో ప్రధానిని కలసి మోదీ చేతులమీదుగా కొందరు ఉద్యోగులకు కారు తాళాలను ఇప్పించారు. ఈ సందర్భంగా మోదీ వీడియోకాన్ఫరెన్స్‌లో సూరత్‌లోని ఉద్యోగులతో మాట్లాడారు. -
వజ్రాల వ్యాపారి కుమారుడు అన్నీ వదిలేసి..
సాక్షి, సూరత్ : కోట్ల రూపాయల సంపద, సకల సౌకర్యాలను విడిచిపెట్టి భవ్య షా అనే 12 ఏళ్ల బాలుడు జైన సన్యాసిగా మారిపోయాడు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కుమారుడు షా నిర్ణయంతో కుటుంబసభ్యులు గర్వపడుతున్నామని చెప్పారు. తమ కుమారుడు గురువారం జైన సన్యాసిగా మారడాన్ని వారు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆథ్యాత్మిక బాటలో జీవితాన్ని అంకితం చేయాలన్న నిర్ణయంపై బాలుడు స్పందిస్తూ భగవంతుడు చూపిన సత్యమార్గంలో పయనించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తాను తల్లితండ్రులను విడిచి వెళుతున్నానని, భవిష్యత్‌లో వారు సైతం ఇదే బాటలో పయనిస్తారని చెప్పాడు. భవ్య జైన దీక్ష స్వీకరించడం పట్ల తామెంతో సంతోషంగా ఉన్నామని డైమండ్ వ్యాపారి అయిన భవ్య తండ్రి దీపేష్ షా సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కుమారుడు తమను విడిచివెళుతున్నాడన్న బాధ తమకు లేదని, నాలుగేళ్ల కిందట 12 ఏళ్ల వయసులో తమ కుమార్తె సైతం జైన సన్యాసినిగా మారిందని చెప్పుకొచ్చారు. జైన సన్యాసులు భౌతిక వాంఛలు, వస్తువులను వీడటంతో పాటు భావోద్వేగాలు, కోరికలకు మూలమైన కర్మలను కూడా విడిచిపెట్టి ప్రశాంత జీవనం గడుపుతారు. -
వజ్రం లభ్యం?
జొన్నగిరి(తుగ్గలి): మండలంలోని జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన ఓ మహిళకు వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని గురువారం అదే గ్రామానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రూ.1.80 లక్షలు, 2 తు లాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
అనగనగా.. ఓ శ్రీమంతుడు
► సామాన్యుడిగా జీవించిన వేల కోట్ల వజ్రాల వ్యాపారి ► చేతిలో చిల్లిగవ్వ లేకుండా భాగ్యనగరంలో జీవనం చిటికెలో కో.. అంటే కోట్లు రాలే జీవితం.. విశ్వవ్యాప్తంగా హైటెక్ కార్యాలయాలు.. దేశవిదేశాలకు ఎగుమతులు... వేలాది మంది ఉద్యోగులు.... కాలు కదపకుండా.. కడుపులో చల్ల కదలకుండా సేవలందించే నౌకర్లు.. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అతడు. నడిచొచ్చే వజ్రాల గని అతడు. అంతటి శ్రీమంతుడు దిగివచ్చాడు. జేబులో పర్సు.. చేతిలో ఫోన్ లేకుండా భాగ్యనగరంలో నెల రోజులపాటు సామాన్యుడిగా బతికాడు. ముప్పై రోజుల జీవన ప్రస్థానంలో సికింద్రాబాద్‌లోని పాత డార్మెటరీలో పడుకున్నాడు. చిరుద్యోగులు, కార్మికుల జీవనౖశైలిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. తన బాధలు, ఆనందక్షణాలను వారితో పంచుకున్నాడు. ఆస్తిపాస్తులు లేకపోయినా వారంతా ఆనందంగా గడపడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని.. తనలో స్ఫూర్తిని నింపిందని ఉద్వేగంగా చెప్పాడు. ఎవరా శ్రీమంతుడు! ఏమిటతని ప్రత్యేకత! రీల్ జీవితాన్ని తలపించిన రియల్ స్టోరీ ఇది. – హైదరాబాద్ హితార్థ్ ధోలాకియా... 23 సంవత్సరాలు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బడా వజ్రాల వ్యాపారి. ‘హరికృష్ణా ఎక్స్‌పోర్ట్స్’అధినేత ఘన్‌శ్యామ్ ధోలాకియా కుమారుడే ఇతను. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని ఇటీవలే సూరత్‌కి తిరిగొచ్చాడు. ఇక జీవితం హ్యాపీ అనుకుంటున్న సమయంలో నాన్న అతనికి ఓ సవాలు విసిరాడు. తానెవరో ఎవరికీ చెప్పకుండా నెలరోజుల పాటు అతి సాధారణ జీవితం గడపాలని, సొంతగా సంపాదించి చూపాలని తండ్రి ఆదేశించాడు. గుర్తింపు కార్డులు, మొబైల్‌ఫోన్ లేకుండా కేవలం 500 రూపాయలతో హితార్థ్ హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. భాగ్యనగరంలో బతుకుపోరాటం... తనకు ఏమాత్రం సంబంధం లేని హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్న హితార్థ్ జూలై తొలివారంలో నగరంలో విమానం దిగిన వెంటనే ఉద్యోగ వేటలో పడ్డాడు. పలు దుకాణాలు, చిరు కంపెనీలను ఉద్యోగం కోసం సంప్రదించాడు. అడుగుపెట్టిన ప్రతీచోటా తన చిరునామా, గుర్తింపు కార్డు, ఫోన్ నంబర్, ఆధార్‌కార్డు సహా అన్ని వివరాలు అడిగారు. చివరకు తన వివరాలు వారంలో ఇస్తానని చెప్పి మెక్‌డోనాల్డ్స్ ఫుడ్కోర్ట్, ఆడిదాస్ షోరూం, చిల్లీస్ రెస్టారెంట్ సహా సికింద్రాబాద్‌లోని కార్డుబోర్డ్ షాపుల్లో దినసరి కార్మికునిగా నెలరోజుల పాటు బతుకుపోరాటం చేసి సంపాదించాడు. ఆ వచ్చిన దాంతోనే సరిపెట్టుకున్నాడు. కుటుంబ ఘనచరిత్ర... కొంత కాలం క్రితం హితార్థ్ పినతండ్రి కూడా ఇదే తరహాలో తన కుమారుడిని సామాన్యుడిలా బతకాలని చెప్పి కేరళకు పంపాడు. ఇక హితార్థ్ తండ్రి ఘన్‌శ్యామ్ కూడా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీపావళి కానుకగా 1200 కార్లు, ఖరీదైన ఫ్లాట్లు బహుమతులుగా ఇచ్చి వార్తల్లోకెక్కిన విషయం విదితమే. ఈ వివరాలన్నింటినీ శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్దక్కన్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హితార్థ్ చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఈ సమావేశంలో అతడి పినతండ్రి, వారి కుటుంబ స్నేహితుడు, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌త్రివేది పాల్గొన్నారు. అజ్ఞాతవాసం లాంటి జీవితమిది హితార్థ్ కుటుంబంతో నాకు స్నేహం ఉంది. అతను నెలరోజుల క్రితం ఇక్కడకు వచ్చినప్పుడు నాకు తెలియదు. నా సహాయం అడగలేదు. రాజుల కాలం నాటి అజ్ఞాతవాసం లాంటిదే ఇది. జీవితమంటే డబ్బు మాత్రమే కాదు... పేదల జీవనశైలి స్వయంగా అనుభవించడం ద్వారా హితార్థ్ గొప్ప అనుభవం, పరిణతి సాధించాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాని అనుభవం ఇది. ప్రతి సంపన్నుడూ వారి పిల్లలకు కనీసం కొంతకాలం సామాన్య జీవితం గడపేలా ప్రోత్సహించాలి. తద్వారా ఎన్నో భ్రాంతులు, భ్రమలు తొలగిపోతాయి. – రాజీవ్‌త్రివేది, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి జీవితానుభవం సాధించా: హితార్థ్ నెల రోజుల పయనంతో జీవిత కాలం అనుభవం సంపాదించా. ప్రతిచోటా నా గుర్తింపు అడిగారు. సామాన్యులు, కార్మికుల జీవనశైలిని స్వయంగా అనుభవించడం, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మా నాన్న నన్ను ఇందుకు ప్రేరేపించారు. ఇరుకు గదుల్లో నేలపై పడుకోవడం, ఇతర కార్మికులతో కలసి సామాన్లు మోయడం, వారితో కలసి భోజనం చేయడం నా జీవిత దృక్పథాన్ని మార్చింది. సూరత్‌లోని మా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి, వారికి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇంకా ఏమి చేయవచ్చో తెలుసుకున్నాను. హైదరాబాద్ నన్ను ఎంతో ఆదరించింది. ఇక్కడ అడుగడుగునా సీసీ కెమెరాలు ఉండడం ఆశ్చర్యపరిచింది. కొద్దిగా కష్టపడే తత్వం, నైపుణ్యం ఉంటే హాయిగా బతకవచ్చని నిరూపించింది. నాకు పని ఇచ్చిన యజమానులకు ధన్యవాదాలు. -
ఉద్యోగుల కోసం యజమాని ఏం చేశాడంటే..
చైనాలో కొంతమంది వ్యాపారవేత్తలు తమ దగ్గర పనిచేసే ఉద్యోగులందరినీ సెలవులకు విదేశాలకు తీసుకెళ్తుంటారు. అలాంటివి చూసి స్ఫూర్తి పొందాడో ఏమో గానీ.. గుజరాత్‌లోని ఓ వజ్రాల వ్యాపారి తన దగ్గర పనిచేసే మొత్తం 300 మందిని, వాళ్ల కుటుంబ సభ్యులందరితో కలిపి ఉత్తరాఖండ్‌లో 10 రోజుల పర్యటనకు తీసుకెళ్లాడు. ఉద్యోగులు, వాళ్ల భార్యాపిల్లలు అంతా కలిపి ఏకంగా 1200 మంది అయ్యారు. ముంబై మహానగరంతో పాటు తన సొంత ఊరైన సూరత్‌లో శ్రీ రామకృష్ణా ఎక్స్‌పోర్ట్స్ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేసే గోవింద్ ఢోలకియా ఈ పని మొదలుపెట్టాడు. మొత్తం సిబ్బంది అందరికీ 15 రోజుల సెలవు ప్రకటించి, రూ. 90 లక్షల ఖర్చుతో ఒక ప్రత్యేక ఏసీ రైలు బుక్ చేశాడు. ప్రతియేటా తమ బాస్ ఇలాగే తమను టూర్లకు తీసుకెళ్తారని ఉద్యోగులలో ఒకరు తెలిపారు. తామంతా ఆయనను సార్ అని కాకుండా, 'కాకాజీ' అని ఆప్యాయంగా పిలుచుకుంటామన్నారు. తమతో పాటు ఆయన, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ యాత్రకు వచ్చారు. సైట్‌సీయింగ్‌తో పాటు ఈ పది రోజుల్లో తాము సామాజిక సేవ కూడా చేస్తామని మరో ఉద్యోగి చెప్పారు. గురువారం నాడు తాము రిషికేశ్ సమీపంలోపని స్వర్గాశ్రమాన్ని స్థానిక పంచాయతీ సభ్యుల సాయంతో శుభ్రం చేశామన్నారు. అయితే.. ఢోలకియా మాత్రం తాను చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం కావాలని ఏమాత్రం కోరుకోవడం లేదు. అందుకే ఆయనను కలవాలని మీడియా ప్రతినిధులు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. -
వజ్రాల దొంగల గుట్టు రట్టు
వ్యాపారులమంటూ మోసం చేసి, భారీ మొత్తంలో వజ్రాలు దోపిడీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. నిర్విరామంగా శ్రమించిన ప్రత్యేక బృందం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేసిన దోపిడీకి గురైన రూ.38.6 లక్షల విలువైన సొత్తును యథాతథంగా రికవరీ చేసినట్లు ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ ముఠాకు ఇద్దరు వ్యాపారులే సూత్రధారులుగా ఉన్నట్లు ఆమె వివరించారు. అదనపు డీసీపీ నరోత్తమ్రెడ్డితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని తిరుచినాపల్లి డైమండ్ స్ట్రీట్‌కు చెందిన బాలకృష్ణ వృత్తిరీత్యా వజ్రాలు, ఖరీదైన రాళ్ల వ్యాపారి. వ్యాపారం నిమిత్తం పాతికేళ్లుగా నగరానికి వచ్చిపోతున్న ఇతను వచ్చిన ప్రతీసారి మార్కెట్ ఠాణా పరిధిలో ఉన్న తక్కువ ఖరీదు లాడ్జిల్లో బస చేసేవాడు. ఇతనితో లింగంపల్లిలో అశోక పెరల్స్ దుకాణం నిర్వహించే సి.మహేందర్, మెదక్ జిల్లా రామచంద్రాపురంలో ముత్యాలు, రంగురాళ్ల వ్యాపారం చేసే ఇతడి సమీప బంధువైన ఎం.బాబు పరిచయం పెంచుకున్నారు. తామూ వ్యాపారులమే అంటూ బుట్టలో వేసుకుని అతడి వద్ద ఉండే సొత్తు వివరాలు తెలుసుకొని దోపిడీకి పథకం వేశారు. మరో ఐదుగురితో కలిసి ముఠా కట్టి... తమ పథకాన్ని అమలు చేసేందుకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని వారిని ఎంచుకున్నారు. సమీప బంధువులు, ముత్యాల వ్యాపారులైన సి.శ్రీధర్, ఎం.శంకర్, సి.చిన శ్రీనివాస్‌లతో పాటు పి.రాజు, మహ్మద్ అన్వర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. బాలకృష్ణ ఫోన్ నెంబర్, వివరాలను చిన శ్రీనివాస్‌కు అందించి అతడి ద్వారా గతనెల 25న ఫోన్ చేయించారు. తాను భారీ మొత్తంలో ముత్యాలు, రంగురాళ్లు కొంటానని, మియాపూర్ రావాలని చినశ్రీనివాస్.. బాలకృష్ణకు ఫోన్ చేసి కోరాడు. ఒకే వ్యాపారికి తన వద్ద ఉన్న మొత్తం సొత్తును అమ్మేసి స్వస్థలానికి వెళ్లిపోవచ్చని భావించిన బాలకృష్ణ మార్కెట్ ప్రాంతం నుంచి బస్సులో మియాపూర్ వెళ్లాడు. అక్కడ ఇతడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్న దుండగులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కళ్లల్లో కారం చల్లి రూ.38.6 లక్షల విలువైన వజ్రాలు, ముత్యాలు, రంగురాళ్లు దోచుకున్నారు. నానా కష్టాలుపడి ఫిర్యాదు... ఈ షాక్ నుంచి కోలుకున్న బాలకృష్ణ అక్కడ నుంచి నేరుగా మార్కెట్ ప్రాంతంలో తాను బస చేసిన లాడ్జికి చేరుకున్నాడు. కాస్త తేరుకున్నాక కొందరి సాయంతో స్థానిక ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఓ పక్క భాష.. మరోపక్క పరిధి వంటి సమస్యలు రావడంతో నేరుగా ఉత్తర మండల డీసీపీ జయలక్ష్మిని కలిసి ఫిర్యాదు అందించారు. ఆమె ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మార్కెట్, మహంకాళి ఠాణాలకు చెందిన అధికారులతో పాటు కానిస్టేబుళ్లు స్వామి (మార్కెట్), శ్రీకాంత్ (చిలకలగూడ)లతో ఏర్పాటైన స్పెషల్‌టీమ్ సాంకేతిక ఆధారాల ద్వారా 18 రోజుల్లో నిందితుల్ని గుర్తించింది. బుధవారం మహేందర్, బాబు, శ్రీనివాసు, అన్వర్, రాజు, శ్రీధర్, శంకర్లను అరెస్టు చేసి దోపిడీకి గురైన సొత్తును రికవరీ చేసింది. ఈ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన డీసీపీ రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.