
ఉద్యోగులకు పంచే కార్లు (ఇన్‌సెట్‌లో ఢోలకియా)
అహ్మదాబాద్ : గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్‌జీ ఢోలకియా పేరు తెలియని వారుండరు. అదేనండి దీపావళి కానుకగా తన సంస్థ ఉద్యోగులకు ప్రతి ఏడు ఏదో భారీ బహుమతులిస్తాడు చూడు ఆయనే. ఈ ఏడాది కూడా దీపావళి కానుకగా సంస్థలోని 1,700 మందికి కార్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇచ్చారు. అయితే దీన్నే క్యాచ్ చేసుకోని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారు కేడీ గాళ్లు. సావ్‌జీ ఢోలకియా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రూ.8,500కే కారిస్తున్నట్లు జనాలను మోసం చేయాలని చూశారు.
ఢోలకియా తన ఉద్యోగులకు కార్లు పంచుతున్న ఫొటోలను షేర్ చేస్తూ వాటికి క్యాప్షన్‌గా ‘రూ.8500 కే కార్ అనే స్కీమ్’ను వాటికి బ్యాంక్ ఖాతా వివరాలను జత చేసి ప్రచారం చేశారు. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైతే రూ.8500 జమచేస్తారో వారి అకౌంట్స్‌లో ఢోలకియా రూ.6 లక్షలు డిపాజిట్ చేస్తారని పేర్కొన్నారు. ఈ మోసాన్ని పసిగట్టిన బ్యాంక్ అధికారులు ఢోలకియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమారు ఐదు ఫేక్ ఐడీలను గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment