రాష్ట్రాలకే మైనింగ్‌ ట్యాక్స్‌ రాయల్టీ: సుప్రీం | Royalty on Mineral Rights Not Tax Rules | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలకే మైనింగ్‌ ట్యాక్స్‌ రాయల్టీ: సుప్రీం

Published Thu, Jul 25 2024 1:26 PM | Last Updated on Thu, Jul 25 2024 1:40 PM

Royalty on Mineral Rights Not Tax Rules

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే మైనింగ్ పై రాయల్టీ పొందే హక్కు విషయమై సుప్రీంకోర్టు  నేడు(గురువారం) చారిత్రక తీర్పు వెలువరించింది. ఖనిజాలు కలిగిన భూములపై రాయల్టీని విధించే హక్కు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందన్న వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది.

వివిధ రాష్ట్రాల్లో మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీ వసూలు చేసుకునే హక్కు కేంద్ర, రాష్ట్రాల్లో ఎవరికి ఉందన్న అంశంపై దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టులో సీజే డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం 8:1 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. ఈ నేపధ్యంలో ఖనిజ సంపద అధికంగా ఉన్న ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,  రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలగబోతోంది.

రాయల్టీ అనేది పన్నుతో సమానమైనది కాదని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు. అయితే ఖనిజ హక్కులపై పన్ను విధించే విషయంలో ఆయా రాష్ట్రాలకు అనుమతి కల్పిస్తే వివిధ రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని అన్నారు. ఇది మార్కెట్ దోపిడీకి దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టంలో మైనింగ్ పై రాష్ట్రాలు పన్ను విధించకుండా అడ్డుకునే అధికారం పార్లమెంట్ కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement